మహబూబ్‌నగర్

నిర్వాసితులకు అండగా ఉంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 21: మహబూబ్‌నగర్ పట్టణంలో బైపాస్ రోడ్డు నిర్మాణానికి భూములు, ఇళ్లు కొల్పోతున్న నిర్వాసితులకు అండగా ఉంటామని రోడ్డు నిర్మాణానికి అందరు సహకరించాలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మంగళవారం మహబూబ్‌నగర్ పట్టణంలోని అక్షర కాలనీ నుండి వెళ్లే బైపాస్ రోడ్డు మార్గాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. సర్వే పనులను కూడా దగ్గరుండి పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు భూములు, ఇళ్లు కొల్పోయే భాదితులు ఎమ్మెల్యేతో తమ మొరను విన్నవించుకున్నారు. రోడ్డుమార్గంలో తమ ఇళ్లు కొల్పోతే ప్రత్యామ్నయం చూయించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే భూ నిర్వాసితులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దాదాపు 8కిలో మీటర్లకు పైగా బైపాస్‌రోడ్డు నిర్మాణం జరగనుందని వెల్లడించారు. 150్ఫట్ల రోడ్డు అని పెర్కోన్నారు. అయితే రోడ్డు నిర్మాణంలో భాగంగా కొన్ని ఇళ్లు కొల్పోవల్సి వస్తుందని అలాంటి వారికి తప్పకుండా గౌరవమైన పరిహారం ఇవ్వడమే కాకుండా డబుల్ బెడ్‌రూంలు కూడా ఇస్తామని తెలిపారు. భూమి కొల్పోతున్న వారికి కూడా అధికంగానే పరిహారం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సర్వే పనులు దాదాపుగా పూర్తి అయ్యాయని త్వరలోనే పనులను ప్రారంబిస్తామన్నారు. రోడ్డు నిర్మాణంలో భాగంగా రెండు,మూడు ప్రాంతాల్లో బ్రిడ్జిలు నిర్మించాల్సి వస్తుందని, బైపాస్ రోడ్డు నిర్మాణం జరిగితే మహబూబ్‌నగర్ పట్టణానికి మరింత కళ వస్తుందన్నారు. నిర్వాసితులకు రోడ్డు పక్కనే మంచి భవనాలను కట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా పరిశ్రమలను బైపాస్‌రోడ్డుకు ఓ వైపున కొన్ని పరిశ్రమలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని దింతో మహబూబ్‌నగర్ పట్టణ ప్రజలకు ఉపాధి అవకాశాలు లబిస్తాయన్నారు. అదేవిధంగా మహబూబ్‌నగర్ పట్టణంలోని బాలుర జూనియర్ కళాశాలలోని పలు విబాగాలను పరిశీలించారు. విద్యార్థులకు కనీస వౌళిక వసతులను కల్పించడంలో భాగంగా మూత్రశాలలు, మరుగుదోడ్లు, మంచినీటి వసతిని కల్పించేందుకుగాను చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రాధ ఆమర్, టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటయ్య, మాజీ జడ్పిటిసి రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ కమీషనర్ దేవ్‌సింగ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ఊరలక్ష్మమ్మ జాతర
ఊట్కూర్, ఫిబ్రవరి 21: మండల కేంద్రంలోని శ్రీరాంనగర్‌లో వెలసిన ఉన్న గ్రామ దేవత జాతర ఉత్సవాలు మంగళవారం గ్రామ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. గ్రామ దేవత ఊరలక్ష్మమ్మ ఉత్సవాలు భాగంగా అనవాయితిగా వస్తున్న గౌడ వంశియులు, బోయిని కులస్తులు ముడు పెద్దబోనాలతో అమ్మవారికి సమర్పించడానికి తమ తమ ఇండ్ల నుండి డప్పులతో యువకులు నృత్యాలు చేస్తు మహిళలు పునకాలతో ఊరి పురవీధుల గుండా ఊరేగించి గ్రామ దేవత ఊర లక్ష్మమ్మ అమ్మవారికి సమర్పించారు. కోళ్లు, గొర్రెలను బలి ఇచ్చి తమ మొక్కులను తీర్చుకున్నారు. గ్రామ జాతరలో ఏలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండ ఎస్సై విజయ్‌కుమార్ అధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జాతర నిర్వహకులు గ్రామ పెద్దలు లక్షణ్ణ, అరవింద్‌కుమార్, శంకర్‌గౌడ్, నారాయణ, జగదీష్‌గౌడ్, శేషప్ప, అశప్ప, శంక్రప్ప, సందీప్, రమేష్, గోపాల్, యువకులు, మహిళలు పాలొగన్నారు.
సమగ్రంగా సర్వే నిర్వహించాలి
* టౌన్‌ప్లానింగ్, ఆర్‌అండ్‌బి అధికారులకు కలెక్టర్ రోనాల్డ్ రోస్ ఆదేశం

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 21: పట్టణంలో టౌన్ ప్లానింగ్ ఆర్‌అండ్‌బి అధికారులు సమగ్రంగా సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ చాంబర్‌లో టౌన్ ప్లానింగ్ ఆర్‌అండ్‌బి అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమగ్ర సర్వే పట్టణ ముఖ్యకూడలిగా ఎక్కడేక్కడ ఉన్నాయి, ప్రధాన కూడలిలో 1193 దుకాణాలు ఉన్నట్లు గుర్తించడం జరిగిందని తెలిపారు. మొదలు మైన్‌రోడ్డు, బస్టాండు రో, రైల్వే స్టేషన్ రోడ్డు వరకు సర్వే నిర్వహించి ప్లాన్ తయారు చేయాలని తెలిపారు. పాదచారులకు, చిన్నవాహనదారులకు, ఫోర్ విలార్ వాహనదారులను గుర్తించాలని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ బిల్డింగులు ఉన్నా ప్రదేశాల్లో సర్వే నిర్వహించాలని అన్నారు. పట్టణంలో 41వార్డులలో ఏ ఏ కమ్యూనిటి ఓసి, ఎస్సీ,బిసి, ఎస్టీలను గుర్తించాలని అన్నారు. సర్వేకు కమిటీ మెంబర్లను నియమించుకోవాలని, కాలనీలలో శాశ్విత చిరునామా కలిగిన వారిని గుర్తించాలని, కాలనీలలో డ్రైనేజీ, మురికి కాలువల నీరు ఎలా వెళ్లాలనే దానిపై కూడా సర్వే చేయాలని అన్నారు. ప్రధాన కూడలిలో రెడ్‌జోన్, గ్రీన్‌జోన్‌లుగా విభజించి, రెడ్‌జోన్‌లో ఎలాంటి తోపుడు బండ్లు, పండ్ల బండ్లు, కొబ్బరి బొండాల బండ్లు పెట్టడానికి వీలులేదని అన్నారు. గ్రీన్‌జోన్‌లో మాత్రమే వీటిని పెట్టడానికి అనుమతిస్తామని తెలిపారు. పట్టణంలో బైపాస్‌రోడ్డు సర్వే పనులు యుద్ధప్రతిపాదికన నడుస్తున్నందున పట్టణంలోని ప్రధాన కూడలిలో సర్వే పనులు వేగవంతంగా చేయాలని తెలిపారు. నివేదికలను వెంటనే సమర్పించాలని సంబందిత అధికారులను ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ గౌతం పోట్రు, ఆర్‌డిఓ లక్ష్మీనారాయణ, టౌన్ ప్లానింగ్ అధికారులు, ఆర్‌అండ్‌బి అధికారులు పాల్గొన్నారు.