మహబూబ్‌నగర్

శివనామస్మరణతో పులకించిన మాణిక్యగిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణపేటటౌన్/దామరగిద్ద, ఫిబ్రవరి 24: మహా శివరాత్రి పర్వదిన ఉత్సవాలు మాణిక్యగిరి కొండపై ఘనంగా జరిగాయి. శుక్రవారం తెల్లవారుజాము నుండే భక్తులు మాణిక్యగిరికి చేరుకుని రూప రహిత అహింసో పరమోధర్మ వీరధర్మజ మాణికేశ్వరి మాత దివ్యదర్శనం కోసం ఎదురుచూశారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన వౌనదీక్షలో ఉండే మాణికేశ్వరి మాత తన దివ్యదర్శనాన్ని భక్తులకు అందించడం ఆనవాయితీగా వస్తోంది. శుక్రవారం సైతం తన దర్శనాన్ని అమ్మవారు అందించనున్నట్లు మాణికేశ్వరి మాత ట్రస్టు సభ్యులు ముందుగానే ప్రకటించడంతో తెలంగాణతో పాటు ఆంధ్ర, సరిహద్దు కర్నాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు యానగుందిలో గల మాణిక్యగిరి క్షేత్రానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 1.20గంటలకు మాణిక్యగిరి వెనకభాగంలో గల తన సింహాసనం నుండి అమ్మవారు దర్శనాన్ని అందించారు. ఈ సమయంలో ఓం నమః శివాయః అంటూ భక్తులు పెద్ద ఎత్తున నినదించడంతో మాణిక్యగిరి మార్మోగిపోయింది. అమ్మవారిని దర్శించుకునేందుకు గత సంవత్సరం కంటే రెట్టింపు సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కాగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా కర్నాటక పోలీసులు, మాణిక్యగిరి ట్రస్టు సభ్యులు భారీ ఏర్పాట్లు చేసి పర్యవేక్షించారు. కాగా కర్నాటక, తెలంగాణ ఆర్టీసీలు యానగుందికి ప్రత్యేక బస్సులను నడిపించాయి.

వైభవంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి కల్యాణం
వేలాదిగా తరలివచ్చిన చెందులు, పట్టు వస్త్రాలను సమర్పించిన ఎమ్మెల్యే దంపతులు
లింగాల, ఫిబ్రవరి 24: మహాశివ రాత్రి పురష్కరించుకుని శుక్రవారం లింగాల మండల పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలోని భౌరపూరం చెంచుపెంట యందు పురతాన భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ఆవరణలో భ్రమరాంబమల్లికార్జున స్వామి కళ్యాణాన్ని చెంచుల సంస్కృతి సాంప్రదాయం ప్రకారం చెంచు పూజారులు ఘనంగా నిర్వహించారు. ఈ చెంచుల పండుగకు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఆంధ్ర ప్రాంతం నుండి వందలాది మంది చెంచులు తరలివచ్చారు. కళ్యాణోత్సవంలో భాగంగా చెంచులు నిర్వహించు ఎదుర్కోల్ల సేవలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దంపతులు పాల్గొన్నారు. భౌరపురం చెరువు ఒడ్డున వెలసిన భైరవ స్వామికి పూజలు చేశారు. చెంచులు డప్పులతో ఆటలాడుతూ చేసిన సాంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. ప్రభుత్వం తరుపున ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పట్టు వస్తల్రు, మంగళసూత్రాలను సమర్పించారు. ఆలయం ఆవరణలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో చెంచు పూజారులు సాంప్రదాయ రీతిలో శివపార్వతుల కళ్యాణం వైభవంగానిర్వహించారు. చెంచులతో పాటు వివిధ ప్రాంతలనుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దంపతులు భక్తులు భ్రమరాంబమల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెంచులకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించారు. ఆలయం వద్ద భోజనం నీడ, నీరు తదితర సౌకర్యలు కల్పించారు. డిఎం హెచ్‌వో సుధాకర్ లాల్ పర్యవేక్షణలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన రాష్ట్ర కమీషనర్ లక్ష్మణ్, డిటిడివో మంగ్యానాయక్, డిఎంహెచ్ వో సుధాకర్ లాల్, ఎంపిపి మంజుల, జడ్పిటిసి మాకం పార్వతమ్మ, సర్పంచ్ రవిందర్ నాయక్, చెంచులోకం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డా.రాంకీషన్, శ్రీనివాసులు, గురువయ్య, బాలజీ పాల్గొన్నారు.