మహబూబ్‌నగర్

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస మద్దతుదారుడిని ఓడించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 27: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా మద్దతు తెలుపుతున్న కాటేపల్లి జనార్థన్‌రెడ్డిని ఉపాధ్యాయులు ఓడించాలని టిజెఎసి జిల్లా చైర్మన్ రాజేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం టిఎన్‌జిఓ భవనంలో టిజెఎసి ముఖ్యనేతల సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జెఎసి చైర్మన్ రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జెఎసి తెలంగాణ పిఆర్‌టియు అభ్యర్థి హర్షవర్థన్‌రెడ్డికి మద్దతు ప్రకటిస్తున్నామని ఆయన గెలుపుకోసం కృషి చేయడం జరుగుతుందని వెల్లడించారు. తమ అభ్యర్థిగా చెప్పుకుంటున్న టిఆర్‌ఎస్ మంత్రులు అభ్యర్థికి ఎందుకు పార్టీ భి-్ఫరం ఇవ్వలేదని పిఆర్‌టియు టిఎస్ అభ్యర్థిగా జనార్థన్‌రెడ్డి ఎందుకు పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు. నేరుగా టిఆర్‌ఎస్ అభ్యర్థి అంటే ఓడిపోతారనే భయంతో ఇలాంటి డ్రామా రాజకీయాలకు తెరలేపి ఉపాధ్యాయులను కూడా మరోసారి మోసం చేయడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న ఎత్తుగడలేనని ఆరోపించారు. తాము టిఆర్‌ఎస్ మంత్రులకు ఓ సవాల్ చేస్తున్నామని ప్రస్తుతం ఉపాద్యాయులు, ఉద్యోగులు ఎదుర్కోంటున్న ఐదు సమస్యలను తీర్చాలని అందులో ప్రధానంగా పాత పించన్ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం జిఓ తీసుకురావాలని 2014-15 తొమ్మిది నెలల గ్రాడ్యూవిటి ఇప్పించాలని పిఆర్‌సి తెల్చాలని, హెల్త్‌కార్డులు ఇవ్వాలని అలా ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటే జెఎసి మద్దతు తెలుపుతున్న హర్షవర్థన్‌రెడ్డిని ఉపసంహరింపజేసి టిఆర్‌ఎస్ మద్దతు తెలుపుతున్న జనార్థన్‌రెడ్డికి అండగా నిలుస్తామని వెల్లడించారు. సకల జనుల సమ్మెకు ద్రోహం చేసిన పిఆర్‌టియు టిఎస్‌గా చెప్పుకుంటున్న జనార్థన్‌రెడ్డి ఎన్నడు కూడా ఉద్యమంలో పాల్గొనలేదని ఆయన అప్పటి సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ఒత్తాసు పలికారని ఆరోపించారు. జెఎసితో కలిసి తెలంగాణ కోసం పనిచేసిన టిపిఆర్‌టియు రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్థన్‌రెడ్డి ఉద్యమనాయకుడు కాబట్టే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు జెఎసి మద్దతు తెలుపుతుందన్నారు. ఉద్యమకారులకు గౌరవించడానికే జెఎసి ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఉపాధ్యాయులంతా హర్షవర్థన్‌రెడ్డిని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి హర్షవర్థన్‌రెడ్డి, టిజెఎసి కన్వీనర్ చంద్రానాయక్, అధికార ప్రతినిధి మెటుకాడి ప్రభాకర్, కో- చైర్మన్ సాయిబాబా, ప్రభాకర్, సాజిదా సికిందర్, మంత్రి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఠాణాకు చేరిన ఇంటర్ పరీక్ష పత్రాలు
దేవరకద్ర, ఫిబ్రవరి 27: దేవరకద్ర మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రశ్న పత్రాలు సోమవారం దేవరకద్ర పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాయి. మార్చి 1వ తేది నుండి నిర్వహించే ఇంటర్మిడియేట్ పరీక్షల ప్రశ్న పత్రాల భద్రత దృష్ట్యా దేవరకద్ర ఠాణాకు చేర్చారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షల నిర్వహణ ఉంటుందని ప్రిన్సిపల్ ప్రేమీలదేవి తెలిపారు.