మహబూబ్‌నగర్

ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, ఫిబ్రవరి 27: మార్చి 1వ తేది నుండి జరగనున్న ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ శే్వతా మహంతి తెలిపారు. సోమవారం ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీల్ ఆచార్య కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫురెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాన్ఫురెన్స్‌లో జిల్లా కలెక్టర్ శే్వతా మహంతి మాట్లాడుతూ జిల్లాలో 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, మొదటి, ద్వితీయ సంవత్సరాలు కలుపుకొని ఇంటర్ జనరల్, ఒకేషనల్ విద్యార్థులు మొత్తం 14,737 మంది పరీక్షలు రాస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇందుకుగాను అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్షల నిర్వహణ విషయమై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం కూడా కలెక్టర్ నిర్వహించారు. కాన్ఫురెన్స్‌లో రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ పరీక్ష కేంద్రాలను సులభంగా గుర్తించేందుకు, హల్ టీకెట్లను డౌన్‌లోడ్ చేసేందుకు ప్రత్యేక యాప్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు గోగుల్ ప్లేస్టోర్‌కు వెళ్లి యాప్‌ను టైప్ చేసి హాల్ టీకెట్ నెంబర్‌ను ఎంటర్‌చేస్తే పరీక్ష కేంద్రంతో పాటు అన్ని వివరాలు తెలుస్తాయని ఆమె తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులందరికి తెలిసేందుకు విస్తృత ప్రచారం చేయాలని ఆమె కలెక్టర్లకు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్, వైద్య సౌకర్యాలు కల్పించాలని ఆమె తెలిపారు. పరీక్షలలో ఎవ్వరైనా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు. విద్యార్థుల సౌకర్యం కోసం ఆర్టీసి అధికారులు అసవరమైన బస్సులను నడుపాలని, పరీక్షల నిర్వహణకు ఫ్లయింగ్ స్క్వాడ్, ఇతర అధికారులు సిబ్బందిని నియమించాలని, ప్రశ్నపత్రాలను భద్రపరచడం, జవాబు పత్రాలను తరలించడం, పోలీస్ బందోబస్తు తదితర అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆమె సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మార్చి 9వ తేదిన జరగాల్సిన మథ్యామెటిక్స్ పేపర్-2, జ్వాలజీ పేపర్-2, చరిత్ర పేపర్-2 పరీక్షలను మార్చి 19వ తేదిక మార్చినట్లు ఆమె తెలిపారు. వీడియో కాన్ఫురెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ శే్వతా మహంతి సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
రెవిన్యూ, పోలీస్ అధికారుల సంయుక్త బృందాలను ఏర్పాటు చేయాలని, ప్లయింగ్ స్క్వాడ్‌ను నియమించాలని, అన్ని కేంద్రాలకు సకాలంలో బస్సులు వెళ్లెల్లా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని, అన్ని పరీక్ష కేంద్రాల వద్ద ఏ ఎన్ ఎంలు, ఓ ఆర్ ఎస్ ద్రావణాన్ని(పాకెట్లను) సిద్ధంగా తగినన్ని ఉంచాలని, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారులు, కస్టోడియంట్లను నియమించాలని ఆమె అదికారులను ఆదేశించారు. రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యాకమిషనర్ అశోక్‌కుమార్ రాష్టస్థ్రాయి నుండి విసిలో పాల్గొనగా జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, డిఆర్‌ఓ చంద్రమోహన్, డిఐఓ సుధాకర్, డిఇసి జాకీర్, డిఇఓ సుశీందర్ రావు, ఆర్టీసి డిఎం రామయ్య తదితరులు పాల్గొన్నారు.