మహబూబ్‌నగర్

పల్లెప్రగతి పనులకు ప్రాధాన్యతనివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాన్‌గల్, ఫిబ్రవరి 27: పల్లెప్రగతి కార్యక్రమంలో గుర్తించిన పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని వనపర్తి జిల్లా కలెక్టర్ శే్వతా మహంతి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంపిడి ఓ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాలలో ప్రత్యేక అధికారులు ఒక గ్రామాన్ని సందర్శించి అక్కడ నెలకొన్న సమస్యలు, అత్యవసర వౌలిక సదుపాయల కల్పనపై నివేదికలు సమర్పించాలని తెలిపారు. గతంలో మంజూరైన పనులు, వదిలేసిన పనులు, అసంపూర్తి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, అవసరమైన చోట రహదారి పనులకు తిరిగి టెండర్లు పిలువాలని ఆర్‌అండ్‌బి నాగేశ్వర్‌రావును ఆదేశించారు. పాఠశాలల్లో అసంపూర్తి తరగతి గదులు, మూత్రశాలలు, వంట గదుల మరమ్మతులు, విద్యకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించాలని జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావును ఆదేశించారు. హరితహారం కింద చేపట్టిన మొక్కలను సంక్షరించాలని, ఉపాధి హామి కింద కూలీలకు చెల్లించాల్సిన కూలీ డబ్బు చెల్లింపులో జాప్యం లేకుండా చూడాలని డిఆర్‌డిఓ గణేష్‌ను ఆదేశించారు. అన్ని గ్రామాలలో డంపింగ్ యార్డు, స్మశాన వాటికలకు స్థలాలను ఎంపిక చేయాలని, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పాలు, గ్రుడ్లు తదితర పౌష్టికాహారాన్ని సక్రమంగా పంపిణీ చేయాలని దీనిపై అధికారుల పర్యవేక్షణ ఉండాలని ఆమె సూచించారు.
సమీక్ష సమావేశానికి విద్యుత్ అధికారి గైర్హాజరు కావడంతో సమావేశానికి హాజరైన కింది స్థాయి ఉద్యోగిని సమీక్ష నుండి వెళ్లాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల్లో ఆసరా పింఛన్లను సక్రమంగా పంపిణీ చేయాలని ఆమె ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశానికి డిఆర్‌ఓ చంద్రమోహన్, డిఎఓ నాగేంద్రయ్య, వెటర్నరీ జెడి విజయ్‌రాజ్, డిఇఓ సుశీందర్‌రావు, మైనింగ్ ఎడి మల్లిఖార్జున్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్‌కుమార్, డిఆర్‌డిఓ గణేష్, మత్య్సశాఖ ఎడి రోహిణి, సర్వేయర్ ఎడి బాలకృష్ణ, మార్కెటింగ్ ఎడి స్వరణ్‌సింగ్, డిఎస్‌ఓ తనూజలు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను
ప్రజలకు తెలియజేయాలి
బిజెపి రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి శ్రీనవాసులు
మాగనూర్, పిబ్రవరి 27: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలని బిజెపి రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. సోమవారం క్రిష్ణ మండల పరిధిలోని గుడెబల్లూర్ శ్రీ లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో మాగనూర్, క్రిష్ణ మండలాల కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసులు మాట్లాడుతూ బిజెపి బూత్ లేవల్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని గ్రామంలోని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా వివరించాలని ఆయన అన్నారు. రైతులకు రుణమాఫీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడతల వారిగా ఇవ్వడం విడ్డూరమని అన్నారు. ప్రజలు ఎదుర్కోంటున్న సమస్యలపై బిజెపి నిరంతర సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సంపర్క్ అబియాన్ చైర్మన్ కొండయ్య, సోమశేఖర్‌గౌడ్, మండల అధ్యక్షుడు జయనంద్‌రెడ్డి, ఉశనప్ప, కృష్ణయ్య, కనకరాజ్, పల్లె నర్సప్ప, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీయాలి : కలెక్టర్ శ్రీ్ధర్
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 27: సైన్స్‌ఫేర్ అంటే కేవలం ప్రదర్శననే కాకుండా భవిష్యత్‌లో పిల్లలు ఏ మార్గాన్ని ఎంచుకుంటారనే దానికి ఇక్కడే పునాది పడుతుందని జిల్లా కలెక్టర్ ఇ.శ్రీ్ధర్ అన్నారు. సైన్స్‌డే సందర్భంగా స్థానిక జాతీయోన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన మండల స్థాయి సైన్స్‌ప్రదర్శనను జిల్లా కలెక్టర్ ఇ.శ్రీ్ధర్, డిఇవో జనార్దన్‌రావులు ప్రారంభించారు. స్థానిక ఎంఇఒ జయశ్రీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిల్లలకు మంచి విలువలు నేర్పించి వారి ఆలోచనలను సక్రమమైన మార్గంలో పెట్టినప్పుడే వాళ్లు మంచి పౌరులుగా తయారవుతారని అన్నారు. ఇలాంటి విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలతోనే విద్యార్థుల్లోని సృజనాత్మక ఆలోచనలు బయటకు వస్తాయని, పిల్లలు ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొని ఆలోచనలు పెంపొందించుకోవాలని, తద్వారా జ్ఞాన సముపార్జన చేయాలన్నారు. జ్ఞాన సముపార్జన బాధ్యత ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రులపై కూడా ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయులకు విద్యార్హతలు చాలా ఎక్కువని, దానికి తగ్గ ఫలితాలను తీసుకొని రావాల్సిన బాధ్యత వీరిపై ఉంటుందన్నారు. పాఠశాలల్లో వసతులు, వనరుల లేమి గురించి ఆలోచించకుండా మన పిల్లలు, మన పాఠశాల అని అనుకొని పనిచేస్తే సత్ఫలితాలు వస్తాయన్నారు. మండలంలోని పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి విద్యార్థుల సంఖ్యను పెంచుటకు కృషి చేస్తున్న మండల విద్యాశాఖ అధికారులను, ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పోటీతత్వంతో ప్రైవేట్ కంటే ధీటైన ఫలితాలను సాధించాలన్నారు. డిఇవో జనార్ధన్‌రావు మాట్లాడుతూ పిల్లలలోని సృజనాత్మకతను వెలికి తీయడానికి ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని అభినందించారు. ఇలాంటి ఆలోచనలను పెంపొందించడానికి వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో ఉపకరిస్తాయన్నారు. అనంతరం మండలంలోని పాఠశాలల విద్యార్థులు రూపొందించిన వైజ్ఞానిక ప్రదర్శనను వారు తిలకించి విద్యార్థులను అభినందించారు. ఇది ఇలా ఉండగా మండల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి సందర్శించి పరిశీలించి విద్యార్థుల ద్వారా ఆయా ప్రదర్శనల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి మణెమ్మ, ఎంపిపి బండి శాంతమ్మ, తహశిల్దార్ శ్రీనివాస సూరి, ఎంపిడివో పండరీనాథ్, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి అమరేష్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. మండలంలోని అన్నీ పాఠశాలల నుంచి 103 ప్రదర్శనలు పాల్గొన్నట్లు ఎంఇఒ జయశ్రీ తెలిపారు.