మహబూబ్‌నగర్

ప్రాజెక్టులకు జన్మనిచ్చింది కాంగ్రెసే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 27: ప్రాజెక్టులకు జన్మనిచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అలాంటి పార్టీ నాయకులు ప్రాజెక్టులను ఆపుతున్నారు అనడం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు, ఆయన పెంచుతున్న కుక్కలకు తగదని టిపిసిసి ఉపాధ్యక్షురాలు, గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ హెచ్చరించారు. సోమవారం మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉబేదుల్లా కొత్వాల్ అధ్యక్షతన నిర్వహించిన జన ఆవేదన సభకు మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డికె అరుణ, మాజీ ఎంపి మల్లురవి, డిసిసిబి చైర్మన్ వీరారెడ్డిలతో పాటు పలువురు నేతలు హజరయ్యారు. ఈ సందర్భంగా సభలో ఎమ్మెల్యే డికె అరుణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ నోటికి వచ్చినట్లు కూతలు కూస్తున్నారని అదేవిధంగా ఆయన పెంచిన కుక్కలు కూడా ఊరకుక్కల్లా ఆరుస్తున్నారని వారి ఆరుపులకు బెదిరింపులకు భయపడేది లేదని అన్నారు. కబడ్దార్ కెసిఆర్ అంటూ నీ అరుపులకు, నువ్వు పెంచుతున్న ఊరకుక్కలను చూసి భయపడడానికి ఇక్కడ ఎవరు సిద్దంగా లేరని హెచ్చరించారు. ఇక తెలంగాణలో టిఆర్‌ఎస్ అధికారంలోకి రాదని కెసిఆర్‌కు తెలిసిపోవడంతో మరోసారి ప్రజలను రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీని తిట్టి కాంగ్రెస్ నాయకులపై తప్పుడు ప్రచారం చేసి మరోసారి అధికారంలోకి రావాలనే ఆకాంక్షతోనే కెసిఆర్ నోటికి వచ్చినట్లు కూతలు కూస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ దండు కదిలితే కెసిఆర్ కుర్చీ కూలిపోతుందన్నారు. నిష్పక్షపాతంగా ప్రతిపక్షపార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తాను ప్రజల పక్షాన పనిచేస్తూ వారి సమస్యలపై గొంతు ఎత్తుతుంటే జీర్ణించుకోలేని బందిపోటు నాయకులు తనను ఆడపిల్ల అని కూడా చూడకుండా విమర్శలు చేస్తున్నారని నీచమైన మాటలు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల గొంతునొక్కుతున్న మోసకారి కెసిఆర్ అని ఆయన తానా అంటే ఆయన పెంచుతున్న దోపిడీ దొంగలు తందాన అంటున్నారని డికె అరుణ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టులకు పునాది వేసిందే కాంగ్రెస్ పార్టీ అని ప్రాజెక్టులకు జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీని నోటికి వచ్చినట్లు తిడితే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మీషన్ భగీరథ పేరుతో పైపులు వేశారని అందులో దాదాపు రూ.40వేలకోట్ల అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు. కులాల పేరిట ప్రజలను విభజించి ప్రజల్లో చిచ్చుపెడుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తుందన్నందునే తాము జన ఆవేదన సభలు నిర్వహిస్తుంటే కడుపుమంటతో టిఆర్‌ఎస్ నాయకులు ఓర్వలేక, జీర్ణించుకోలేక విష ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భాస్కర్, నిజాంపాష, చంద్రశేఖర్, బ్రహ్మయ్య, బెనహర్, వెంకటేష్, పాష తదితరులు పాల్గొన్నారు.