మహబూబ్‌నగర్

ప్రభుత్వం కళ్లు తెరిపించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, మార్చి 5: ఎమ్మెల్సీ ఎన్నికలతో మేధావులైన ఉపాద్యాయులు రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని తెలంగాణ ప్రాంత ఉపాద్యాయ సంఘం ఎమ్మెల్సీ అభ్యర్థి నర్రా భూపతి రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసిందని, ఉన్నపాఠశాలలకు వసతులు లేవని, వసతులు ఉన్నదగ్గర ఉపాద్యాయులు లేరని, వీటిపై దృష్టి సారించకుండ నూతనంగా గురుకుల పాఠశాలలు పెడుతున్నారని ఆయన అన్నారు. దీంతో ఉన్న పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉన్నదన్నారు. ఒకవైపు ధనిక రాష్ట్రం అని చెబుతున్న ముఖ్యమంత్రి డిఎస్సీ పెట్టే ధైర్యంలేక నిరుద్యోగుల జీవితాలతో అటలాడుకుంటున్నారని, పక్కన ఉన్న ఆంద్రప్రదేశ్‌లో ఇప్పటికే డిఎస్సీ ద్వారా 10వేల పోస్టులు భర్తీ చేశారని ఆయన అన్నారు. చంద్రశేఖర్ ‘రావు’ పాలనలో ఏవి ‘రావు’ అని ప్రజలు నిర్ధారణకు వచ్చారని ఆయన అన్నారు. మొదట గెలిచిన అభ్యర్థికే తాము కండువా కప్పుతామని చెప్పిన కెసిఆర్ తన రాజకీయ పలుకుబడి, డబ్బును ఉపయోగించి గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. సర్వేలో ఎమ్మెల్సీ ఓటమి పాలవుతాడని తెలియడంవల్లే అల్లుడైన హరీష్‌రావుకు ఈ బాధ్యతను అప్పగించారని, గెలుస్తాడని సర్వే రిపోర్టు వచ్చి ఉంటే కెటిఆర్‌కు అప్పగించేవాడని ఆయన ఎద్దేవా చేశారు. డిఆర్‌ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదని, తిట్ల రాష్ట్ర సమితి అని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు అధికార భలాన్ని ఉపయోగిస్తున్నారని, మిగితా సంఘాల నేతలను బెదిరిస్తున్నారని అన్నారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, భారీ కోట్ల పారుదల శాఖ మంత్రిగా మారారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లుతున్నారని ఆయన ఆరోపించారు. అధికార పార్టీ నేతలకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో మార్చిలోనే మూర్చ వస్తుందని అయన అన్నారు. సీతయ్య ఎవరి మాట వినడు అన్న చందంగా కెసిఆర్ సరళి ఉన్నదని, మేధావులైన ఉపాద్యాయులు ఈ ఎన్నికల్లో కేసిఆర్ చంప చెళ్లుమనిపించాలని అన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం, బిజెపి నాయకులు అయ్యగారి ప్రభాకర్ రెడ్డి, రామ్మూర్తి, వేణుగోపాల్, వెంకటేశ్వర్ రెడ్డి, అమరెందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, విష్ణువర్దన్ రెడ్డి పాల్గొన్నారు.