మహబూబ్‌నగర్

డిగ్రీ కళాశాలలో సౌకర్యాల ఏర్పాటుకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, మార్చి 9: వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇ.శ్రీ్ధర్ డిగ్రీ కళాశాలల ప్రధానాచార్యులను ఆదేశించారు. గురువారం తన చాంబర్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రధానాచార్యుల సమావేశం నిర్వహించి కళాశాలల వారిగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణంలో ఉన్న డిగ్రీ కళాశాలల భవనాలనాల నిర్మాణాలను నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా చూడాలన్నారు. నిర్ణీత సమయంలో పూర్తి చేయకుంటే సంబంధిత కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టాలని ఆదేశించారు. భవనాల నిర్మాణ గడువును పెంచేందుకు తనవద్దకు ప్రతిపాదనలను తీసుకొనిరావద్దని, ఎట్టి పరిస్థితులలో కూడా గడువుపెంచేందుకు అంగీకరించేదిలేదని స్పష్టం చేశారు. నిర్ణీత సమయంలో వాటిని పూర్తి చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని, పనుల పురోగతిని కూడా తన దృష్టికి తీసుకొని రావలన్నారు. అన్నీ కళాశాలలో సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని, కంప్యూటర్ లాబ్‌లను విద్యార్థులకు అందుబాటులో ఉండేలా చూడాలని, సిస్టమ్స్ ఉన్నచోట నెట్‌కనెక్షన్ ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు చాలా మంది బస్సుటాప్‌పై ప్రయాణం చేస్తున్నారని, దీనివల్ల కలిగే అనార్థాల గురించి విద్యార్థులకు వివరించాలన్నారు. ఈ విషయంలో పోలీస్, ఆర్టీఎ అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జెసి సురేందర్ కరణ్, ప్రిన్సిపాల్ రాజేందర్‌సింగ్‌తోపాటు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

వెనుకబడిన కులాల అభ్యున్నతికి కృషి
* ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్
మహబూబ్‌నగర్‌టౌన్, మార్చి 9: సమాజంలో వెనుకబడిన కులాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ న్నారు. గురువారం పట్టణంలోని అప్పన్నపల్లి గేట్ వద్ద మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్యాల ప్రకాష్ ఆద్వర్యంలో నిర్మించబడిన కాశీకాపుడి కమ్యూనిటి భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వెనుకబడిన కులాలన్ని అభివృద్ధి పర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1000కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా కులవృత్తులను కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ నిధులను కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాధ ఆమర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్, టిఆర్‌ఎస్ నాయకులు కోరమోని వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
పురుగుల మందు తాగి రైతు మృతి
కల్వకుర్తి, మార్చి 9: మండల పరిధిలోని ముకురాల గ్రామానికి చెందిన గొడుగు పర్వతాలు (48) అనే పల్లి రైతు పురుగుల మందు సేవించి మృతి చెందిన సంఘటన గురువారం మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై జలందర్‌రెడ్డి తెలిపిన మృతుని వివరాలు ఇలా ఉన్నాయి. ముకురాల గ్రామానికి చెందిన పర్వతాలు తన పొలంలో పల్లి పండించడం జరిగిందని పెట్టిన పెట్టుబడికి పండిన పంటకు చాలా వ్యత్యాసం ఉండటంతో అప్పుల భాదతో పురుగుల మందు తాగి మృతి చెందడం జరిగిందని తెలిపారు.