మహబూబ్‌నగర్

హామీలకే పరిమితమైన మరమ్మతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బల్మూర్, మార్చి 11: మండల పరిధిలోని బిల్లకల్ సమీపాన ఉన్న మండలంలోనె అతి పెద్ద ఆయకట్టు చెరువు రసుల్ చెరువు గత 15 సంవత్సరాలుగా చెరువుకు ఉన్న ప్రధాన తూము లీకేజిల కారణంగా నీరు వృదాగా పోతుంది. చెరువుకు తూర్పున లింగమయ్య గుట్ట వద్ద కట్ట తెగి గండి పడి ఏళ్లు గడుస్తుంది. దీంతో నీరు పూర్తిగా వృదాగా అడవిలో పారుతుంది. చెరువు మర్మతుకు గతంలో అధికారంలో ఉన్న టిడిపి ఎమ్మెల్యే, అప్పట్లో మంత్రిగా ఉన్న రాములు, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ రసుల్ చెరువు మర్మత్తుకు హామిలు ఇచ్చారు. అప్పట్లో ఎమ్మెల్యే నిధుల నుండి మర్మత్తులకు గాను వీరిద్దరు కూడా నిధులను కూడా కేటాయిస్తున్నట్లు ప్రకటించి చెరువు మర్మత్తును మరిచారు. నిధులు కేటాయించి మర్మత్తులు మరచిపోయరని రైతులు విమర్శించారు. మండలంలోని బిల్లకల్, బల్మూర్, కొండనాగుల గ్రామల రైతులు ఈ చెరువుకింద ఆయకట్టు రైతులుగా ఉన్నారు. చెరువునిండి నీరు సమృధ్ది గా ఉన్న సమయంలో సుమారు వేయి ఏకారల భూమి సాగు అవుతుందని లీకేజిలు, గండి కారణంగా ప్రస్తుతం చెరువుకింద వంద ఏకరాలు కూడ సాగుకు నోచుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. చెరువు నల్లమల అడవిలో ఉన్నందున వేసవి కాలం వచ్చిందంటే అడవి జంతువులు ఈ చెరువుకు నీటినీ తాగేందుకు వస్తాయి. గత కోనే్నళ్లుగా నీళ్లు నిలువ ఉండక పోవడంతో అడవి జంతువులు విలవిలడుతున్నాయి. జంతువులకోసం ఫారేస్ట్ అధికారులు ఏర్పాటుచేస్తున్న నీటి గుంటలు సైతం నిరుపాయోగంగా ఉన్నాయి. అడవి జంతువుల దప్పికను ఆసర చేసుకోని జంతువుల వేటగాళ్లు మాటు వేసి వేటాడిన సంఘటనలు జరిగాయి. చెరువులో నీరు ఉన్నట్లైతే ఇలాంటి సంఘటనలు జరిగేవి కావని రైతులు, ఫారెస్ట్ అధికారులు అనుకుంటున్నారు. ప్రస్తుతం అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రసుల్ చెరువును ఇటీవల సందర్శించి నెల రోజుల్లో మర్మతులు చేయిస్తానని గతంలో ఎమ్మెల్యేల మదిరిగా కాకుండ ఇచ్చిన హామిని నిలబేట్టుకుంటానని చెప్పి, నేటికి ఆరు నెలలవుతున్నా చెరువు మరమ్మత్తు చర్యలు చేపట్టక పోవడంతో రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన ఎమ్మెల్యే స్పందించి చెరువు మర్మతు చర్యలు చేపట్టలని మండల రైతులు కొరుతున్నారు.
నోట్ల రద్దు మోదీకి అండ
* బిజెపి జిల్లా అధ్యక్షుడు అయ్యగారి ప్రభాకర్ రెడ్డి
కొత్తకోట, మార్చి 11: పెద్ద నోట్లను రద్దు చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో మోడీకి అండగా నిలిచాయని జిల్లా బిజెపి అధ్యక్షులు అయ్యగారి ప్రభాకర్ రెడ్డి అన్నారు. శనివారం కొత్తకోటలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్ద నోట్లు రద్దు చేయడంతో ఇటూ ఉగ్రవాదులు, నక్సలైట్లను దెబ్బతిశాయని అందుకు ఉత్తరప్రదేశ్ ప్రజలు బిజెపికి అండగా నిలిచారన్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ కన్నికల్లో భూపతిరెడ్డి గెలుస్తారని అంచనాలు రావడంతో ఎన్నికల కమిషన్‌చే రద్దు చేయించారన్నారు. ఏది ఏమైన నర్ర భూపతిరెడ్డి గెలుపొందడం ఖాయమని అది కెసిఆర్‌కు చెంపపెట్టన్నారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు రాజవర్ధన్‌రెడ్డి, ఎస్.వెంకటరెడ్డి, మాదవరెడ్డి, సాయిరాం, శ్రీనివాస్ రెడ్డి, యాదయ్యసాగర్, అయ్యన్న, సురేష్ తదితరులు పాల్గొన్నారు.