మహబూబ్‌నగర్

పేదల సంక్షేమ బడ్జెట్ : టిఆర్‌ఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణపేటటౌన్, మార్చి 13: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2017-’18 బడ్జెట్ నిరుపేదల సంక్షేమ బడె ట్ రూపొందించిందని టిఆర్‌ఎస్ నాయకులు అన్నారు. సోమవారం అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం బ డ్జెట్‌ను ప్రవేశపెట్టిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే క్యా ంపు కార్యాలయం నుండి టిఆర్‌ఎస్ నేతలు సిఎం, ఎమ్మెల్యే చిత్రపటంతో కూడిన ఫ్లెక్సీతో పట్టణంలో ర్యాలీ నిర్వహించి స్థానిక వీరసావర్కర్ చౌరస్తాలో బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నీ వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా బడ్జెట్‌ను రూపొందించి ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటోందన్నారు.
బంగారు తెలంగాణ సాధనే ధ్యేయంగా ము ందుకు సాగుతున్న సిఎం కెసిఆర్ అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు నిద్రపోరని, ఇంకా ఉద్యమనాయకుడిగానే వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని అన్నీ రంగాల్లో అభివృద్ది పథంలోకి తీసుకెళుతున్నారన్నారు. ప్రధానంగా సాగు, త్రాగునీటిపై దృష్టి సారించి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను వేగంగా పూర్తి చేయిస్తున్నారన్నారు. కుల సంఘాలకు పెద్దపీట వేసి వారి అభ్యున్నతికి సరిపడా నిధులను ఈ బడ్జెట్‌లో విడుదల చేశారన్నారు. మహిళలు, చేనేత రంగాలను అభివృద్ది చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ఆ దిశగా ఈ రంగాన్ని అభివృద్ది చేసేలా నిధులను విడుదల చేశారన్నారు. బంగారు తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కోసం అహర్నిషలు కృషి చేస్తున్న సిఎం కెసిఆర్‌కు తాము బాసటగా నిలుస్తామన్నారు. రమేశ్‌గౌడ్, నాగరాజ్ సరాఫ్, ప్రతాప్‌రెడ్డి, ఆనంద్‌ఘట్, విజయ్‌సాగర్, వినోద్‌కుమార్, శ్రీహరి, బుల్లెట్ రాజు, గురులింగ ప్ప, కాకర్ల భీమయ్య, వెంకట్రాములు, యాంకె హన్మంత్‌రెడ్డి, గంజాయి సతీష్, శంకర్, భగవంతు, జగన్నాథ్, రవిగౌడ్, రాములు, ఆశప్ప, కిష్టప్ప, జహీరోద్దీన్, మహిమూద్, ఫిరోజ్, మల్లప్ప, హన్మంతు తదితరులు పాల్గొన్నారు.

ముస్లిం మైనార్టీ స్థితిగతులపై అధ్యయనం

గద్వాల, మార్చి 13: ముస్లిం మైనార్టీల స్థితిగతులను తెలుసుకునేందుకు గాను తెలంగాణ ప్ర భుత్వం బిసి కమిషన్ ఏర్పాటు చేసిందని, జోగుళాం బ గద్వాల జిల్లాలో పర్యటించి వారి స్థితిగతులను అధ్యయనం చేస్తున్నదని బిసి కమిషనర్ సభ్యులు ఆంజనేయులుగౌడు తెలిపారు. సోమవారం గద్వాల కు చేరుకున్న ఆయనకు బిసి వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యం లో ఘనంగా స్వాగతం పలికారు. జోగుళాంబ గద్వా ల జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌సైనీని కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం బిసి కమిషన్ స భ్యులు నల్లకుంటలోని షాదిఖానా, మోమిన్‌మహెల్లా, ఒంటెలపేటకు చేరుకొని ముస్లింల ఇళ్లను కలియతిరిగి వారి స్థితిగతులను అధ్యయనం చేశారు. కుటుంబ వివరాలు, ఆదాయం, వృత్తి ఉద్యోగాలు, తదితర అంశాలపై వివరాలు సేకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు గాను మైనార్టీల జీవన విధానం, కుటుంబ ఆదాయం, వారి స్థితిగతులను విచారణ జరిపి నివేదిక ప్రభుత్వానికి అందజేయనున్నట్టు ఆయన తెలిపారు. ముస్లిం మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. అనంతరం వార్డెన్లు ఆంజనేయులుగౌడును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బిసి వెల్ఫేర్ జిల్లా అధికారి రాజన్న, నాయకులు, ముస్లిం సోదరులు, వార్డెన్లు, తదితరులు పాల్గొన్నారు.