మహబూబ్‌నగర్

ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్, మార్చి 16: తెలుగు ప్రజల అత్మగౌరవం కోసం తెలుగు ప్రజలు ఒక్క రాష్ట్రంగా ఉండాలని ఆంధ్ర రాష్ట్ర సాధనకు 58 రోజులు అమరణ నిరహార దీక్షతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించిన పొట్టి శ్రీరాములు 116 జయంతి వేడుకలను వాసవి క్లబ్, ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ బంగ్లా చౌరస్తాలోని ఆమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ సభ్యులు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవరణకు పట్టుదలతో 58 రోజుల పాటు అమరణ నిరాహార దీక్ష చేశారని, తెలుగు ప్రజల అభివృద్ది కోసం ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆవోపా అధ్యక్షుడు కోట శ్రీనివాస్, కార్యదర్శి శ్రీనివాసులు, సూర్యనారాయణ, కుమారస్వామి, సోమిశెట్టి, సాయికిషోర్ తదితరులు పాల్గొన్నారు.
కల్వకుర్తిలో...
కల్వకుర్తి: తెలుగు ప్రజల అత్మగౌరవం కోసం తెలుగు ప్రజలు ఒక్క రాష్ట్రంగా ఉండాలని ఆంధ్ర రాష్ట్ర సాధనకు 58 రోజులు అమరణ నిరహార దీక్షతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించిన పొట్టి శ్రీరాములు 116 జయంతి వేడుకలను వాసవి క్లబ్ డిప్యూటీ గవర్నర్ జూలురి రమేష్, వాసవి, వనిత క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు గోపాల్, శ్రీ్ధర్,స్వాతి, రేణుక ల ఆధ్వర్యంలో గురువారం వాసవి క్లబ్ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. అదేవిధంగా పట్టణంలో గల ప్రభుత్వ ఏరియా అసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణి చేశారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ డిప్యూటీ గవర్నర్ జూలురి రమేష్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవరణకు పట్టుదలతో 58 రోజుల పాటు అమరణ నిరాహార దీక్ష చేశారని, తెలుగు ప్రజల అభివృద్ది కోసం ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ కోశాధికారి ప్రభాకర్, వనిత క్లబ్ కోశాధికారి స్రవంతి, క్యాబినేట్ కోశాధికారి రమేష్, పిఆర్‌ఓ కృష్ణయ్య, సభ్యులు రాఘవేంధర్, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.
వనపర్తిలో...
వనపర్తి: ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం ప్రాణాలను వదిలిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని గురువారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టిశ్రీరాములు చౌరస్తాలోగల నిలువెత్తు విగ్రహానికి సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు యాదగిరి, వెంకటేష్, శ్రీనివాస్, శ్రీ్ధర్, రాజు, రఘు, సాయిబాబా, సాయిరాం, సురేష్, శివ, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.