మహబూబ్‌నగర్

‘గద్వాల సంబరాల’ను వైభవంగా నిర్వహిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, మార్చి 17: నడిగడ్డ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను దేశవ్యాప్తంగా చాటేందుకు ఈ నెల 25 నుండి 29వ తేదీ వరకు గద్వాల సంబరాలు నిర్వహిస్తున్నామని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌సైనీ, ఎస్పీ విజయ్‌కుమార్, జెసి డాక్టర్ సంగీతలు వెల్లడించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఉరుల సమావేశంలో వారు మాట్లాడారు. గద్వాల సంబరాలను విజయవంతం చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు, అధికారులు సహకరించాలని పిలుపునిచ్చారు. ఐదు రోజుల పాటు జరిగే సంబరాల్లో ఈ ప్రాంత చారిత్రాత్మక సందేశాలను తెలియజేయడంతో పాటు ప్రత్యేకంగా చేనేత వస్త్రాలు, ఇతర స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. మార్కెట్ యార్డు వెనుక భాగంలో అయిజ రోడ్డు ప్రక్కన ఏర్పాటు చేస్తున్నట్టు ఈ గద్వాల సంబరాలు జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే వివిధ శాఖల అధికారుల సమన్వయంతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అదే విధంగా 15 సబ్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకు సహకరిస్తున్న అన్ని సంఘాలకు వారు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రతి పనిని పారదర్శకంగా చేపడుతున్నట్టు స్పష్టం చేశారు. సంబరాలకు కొందరు బలవంతపు చందాలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై ఘాటుగా స్పందించిన అధికారులు అటువంటి వాటిపై ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతానికి చెందిన ప్రముఖ కళాకారులు, రాజవంశీయులు, జిల్లా మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులను ఆహ్వానించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.

మీషన్‌భగీరథ పనులను అడ్డుకున్న రైతులు
దేవరకద్ర, మార్చి 17: మండల పరిధిలోని గూరకొండ, గోప్లాపూర్, బండర్‌పల్లి గ్రామాల్లో మీషన్ భగీరథ పనులను రైతులు అడ్డుకున్నారు. తమ పంట పొలాల్లో ఏ మాత్రం నష్టపరిహరం కల్పించకుండా రోడ్డు వేయడమే కాకుండా మీషన్‌భగీరథ పనులు చేయడం సమంజసం కాదని ఆయా గ్రామాల రైతులు పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ హైకోర్టు నుండి స్టే అర్డర్ ఉండడం వల్ల పనులు ప్రారంభించేందుకు వీలు లేదని తెల్చిచెప్పడంతో మీషన్‌భగీరథ పనులను నిలిపివేశారు.