మహబూబ్‌నగర్

పోలింగ్ ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జడ్చర్ల/నవాబుపేట, మార్చి 19: జడ్చర్ల నియోజకవర్గంలో ఆదివారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. నియోజకవర్గ కేంద్రమైన జడ్చర్లలో 328 ఓట్లకుగాను 306 ఓట్లు పోల్ అయ్యాయి. బాలానగర్‌లో 21 ఓట్లగాను 20 ఓట్లు పోల్ అయ్యాయి. నవాబుపేటలో 14 ఓట్లగాను 14 ఓట్లు పోల్ అయ్యాయి. మిడ్జిల్‌లో 16గాను 16 ఓట్లు పోల్ అయ్యాయి. జడ్చర్లలో ఏర్పాటు చేసిన పోలింగ్ సెంటర్‌ను జాయింట్ కలెక్టర్ శివకుమార్‌నాయుడు, ఆర్డిఓ లక్ష్మీనారాయణ, టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి జనార్థన్‌రెడ్డి, టిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ తదితరులు సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్ అభ్యర్థి జనార్థన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

సిఆర్ బాహుబలి: జూపల్లి
కొల్లాపూర్, మార్చి 19: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం డా. మర్రి చెన్నరెడ్డి, ఇంద్రరెడ్డి, మల్లికార్జున్, విజయశాంతి తదితరులు పోరాటం చేసి అలసి పోయరని, ఆ పోరాటాన్ని కేసిఆర్ 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన చేసిన బాహుబలి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అని రాష్ట్ర పంచాయతీశాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని రాజవారి బంగ్లా ముందు టి ఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రజా సమస్యలు మరచి అధికారం కోసం గోడ మీది బల్లుల ఉండే కాంగ్రెస్ నాయకులకు మరో పదేళ్లలో కూడా టిఆర్‌ఎస్‌ను ఏ పార్టీ ఏమి చేయలేదన్నారు. ప్రజాసంక్షేమం కోసం ప్రజల అకాంక్షల మేరకు బంగారు తెలంగాణ కోసం కేసిఆర్ పని చేస్తున్నరని ఆయన కొనియాడారు. ప్రభుత్వం చేస్తున్న వివిధ అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రతి కుటుంబంలోని ప్రతి వ్యక్తికి ఎదో విధంగా లాభం జరుగుతుందని ఆయన పెర్కోన్నారు. కుటుంబంలోని ప్రతి వ్యక్తికి ఆరు కిలోల బియ్యం చోప్పున, రూ.1000 పెన్షన్, దివ్యాంగులకు రూ.1500లు, తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి అందిస్తున్న వివిధ పథకాలను గురించి ఆయన ప్రస్తావించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తి పోతల ఫథకం ద్వారా 7 లక్షల ఏకారాలకు సాగు నీరు అందుతుందన్నారు. కల్వకుర్తి నియోజకవర్గానికి లక్ష యభై వేల ఎకారాలకు సాగునీరు అందుతుందన్నారు. రాష్ట్రంలోని నల్లగోండ, రంగారెడ్డి, పాలమూరు జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించే పథకం పై కాంగ్రెస్ నాయకులు కోర్టుకు వెళ్లడం శోచనియమన్నారు. పోతిరెడ్డిపాడు, ముచ్చు మర్రి ద్వారా కృష్ణ నదినీరును ఆంధ్రకు తరలిస్తుంటే కోర్టుకు ఎందుకు వేళ్ల లెదని ఆయన ప్రశ్నించారు. సాధరణ సభ్యత్వం 35రూపాయలు క్రియశీల సభ్యత్వం 100 రూపాయలని అదే ఎస్సీ, ఎస్టీలకు 30రూ, 50రూ చొప్పున చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. వారం రోజుల లోపల సభ్యత్వం పుర్తి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో మర్కెట్ కమిటి చెర్మెన్ రాంచద్రరెడ్డి, ఐదు మండలాల ఎంపిపిలు, జడ్పిటిసిలు, సింగిల్ విండో అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు పాల్గొనగా కొల్లాపూరు మండల పార్టీ అధ్యక్షుడు రాజేష్ ద్వారా మంత్రి జూపల్లి కృష్ణ రావు సభ్యత్వం తీసుకున్నారు.