మహబూబ్‌నగర్

మహిళలు ఆర్థికంగా ఎదగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊట్కూర్, మార్చి 20: గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు వివిధ వృత్తుల్లో పని చేస్తూ అర్థికంగా ఎదగాలని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో జనశిక్షణ సంస్థ అధ్వర్యంలో జోగినీలకు, దళిత మహిళలకు ఉచిత కుట్టుమిషన్ శిక్షణ శిభిరంను జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి ప్రారంభించారు. అదేవిధంగా జోగినీవారి పిల్లలకు వివిధ వస్తువులు పంపిణీ చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు జోగినీలుగా మారకుండా ప్రభుత్వం ఏన్నో చేతి వృత్తి పనులను అవకాశం కల్పిస్తుందన్నారు. గతంలో తెలిసి తెలియకుండా మూడన్మకాల భారిన పడి కొందరు మహిళలు జోగినీలుగా మారారని ఇక మీదట గ్రామాలలో ఏ ఒక్కరు కూడా జోగినీ మహిళ ఉండకూడదని ఎవరు కూడా ఆ వ్యవస్థలో పడకూడదని అన్నారు. జోగినీ వ్యవస్థను ఎవరైనా ప్రోత్సహించిన వాటి గురించి గ్రామాలల్లో మహిళల కు చెప్పి మోసం చేసిన కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్వచ్చంద సంస్థల ద్యారా జోగినీలకు చేతి వృత్తులు నేర్చుకునేందుకు 65 రకాల కార్యక్రమాలు చేపట్టిందని శిక్షణ పోందిన వారు తమ స్వశక్తితో జీవించచ్చన్నారు. జోగిని వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తానని అన్నారు. బాల్యవివాహలు చేయడం వల్ల జరిగే అనర్థాలను గురించి వివరించారు. చిన్నతనంలో పెళ్లిళ్లు చేస్తే భవిష్యత్‌లో మహిళలు చాలా ఇబ్బందులకు గురికావడమే కా కుండా అనారోగ్యానికి గురై రోగాల బారిన పడతారన అన్నారు. ప్రతి ఒక్క బాలిక తరగతి గదికి వెళ్లాలని చదువుకుంటేనే సమాజంలో మంచి గౌరవం ఉంటుందని సమాజంలో ఏ మి జరుగుతుందో తెలుస్తుందన్నారు. జోగినీల వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారిస్థానని అన్నారు. నిరక్షరాస్యతతో కొంత మంది మహిళలను ఇ తర రాష్టల్రకు పంపిస్తు చిన్న వయస్సులో వివాహలు చేయడం వల్ల వారి జీవితాలు అనేక అనర్థాలకు దారి తీస్తుందని అన్నారు. చదువుతోనే మూడనమ్మకాలను పారలదోలచ్చని అన్నారు. ఈ ఏడాదిలో 1200 బాల్యా వివాహలను అడ్డుకోవడం జరిగిందని అన్నారు. బాల్యానికి రక్ష-2 అనే కార్యక్రమం నిర్వహిస్తుమని అ న్నారు. అనంతరం స్థానిక పోలిస్‌ష్టేషన్‌ను పరిశిలించి సంతృప్తివ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సూర్యప్రకాశ్‌రెడ్డి, ఎంపిటిసి గోవిందప్ప, సర్పంచ్ భాస్కర్, జనశిక్షణ డైరెక్టర్ సబ్బారెడ్డి, జోగిని వ్యతిరేకపోరాట కమిటీ జిల్లా కన్వీనర్ హాజమ్మ, ఎస్సై విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.