మహబూబ్‌నగర్

ఘాటు తగ్గిన మిర్చి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటిక్యాల, మార్చి 20: ఆరుగాలం ఎంతో శ్రమించి పం డిచి దిగుబడి సాధించినా సరైన మద్దతు ధరలేక అప్పులే మిగులాయని మిరుప రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటిక్యాల మండలంలో జూరాల ఆయకట్టు పరిధిలోని ఉ దండాపురం, శనగపల్లె, బట్లదినె్న, చాగాపురం, నక్కలపల్లె, బుడ్డారెడ్డిపల్లె, కోదండాపురం, వల్లూరు, ధర్మవరం, వెంగన్నపల్లె, ఆర్.గార్లపాడు, బి.వీరాపురం, కారుపాకుల గ్రామలలో వేల ఎకరాలలో మిరుప పంటసాగు చేశారు. గత ఏడాది ఆశించిన స్థాయిలో దిగిబడి రావడంతో మార్కెట్ లో క్వింటాలు రూ.12 వేల వరకు ధర రావడంతో పెట్టుబడులు కాదని ఆధిక లాభాలు వచ్చినట్లు రైతులు తెలిపారు. ఈ సంవత్సరం పొలాలను కౌలుకు తీసుకొని పంటలు సాగుచేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల తెగుళ్ల నుండి పంటను కాపాడుకునేందుకు వేల రూపాయలు ఖర్చు చేసి దిగుబడి సాధించామని రైతులు తెలిపారు. తీరా మార్కెట్‌కు వెళ్లే సరికి సగానికి సగం ధర తగ్గిపోవడంతో రైతులు కంట్లో నీళ్లు వస్తున్నాయని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కానీ ఒక ఎకరా మిర్చిపంటను సాగుచేయాలంటే రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు, కలుపుకూలీలు కలిపి ఖర్చు రూ.80వేల నుండి రూ.లక్ష వరకు పెట్టుబడి వస్తున్నట్లు రైతులు చెప్పారు. మండలంలో మొత్తం మిర్చి పంట 4వేల ఎకరాలను సాగుచేసినట్టు వ్యవసాయ అధికారులు తెలిపారు. గుంటూరు రకం, హరిణి, ఆధార్, డీలక్స్, వైష్ణ వి, సూపర్ టెన్, బ్యాగిడి, జీరోటూ, రకం మిరుప పంటలు సాగుచేయగా 10 నుండి 12 క్వింటాళ వరకు దిగుబడి వస్తుందన్నారు.
ఈ సారి అంతా నష్టమే : రైతు తిరుమలేష్
గత ఏడాదిని దృష్టిలో పెట్టుకొని ఎకరాకు రూ.30 వేలు కౌలుకు వేసుకొని మిరుప పం ట సాగుచేశారు. కాని మొదటి నుండి రసాయన ఎరువులు, క్రిమిసంహరక మందుల ధర పెరగడంతో అధిక ఖర్చులు అయ్యాయి.
పండించిన పంటకు ధరలేదు: ఉశేని రైతు
పంట చేతికి అందే సమయంలో జూరాల ఆ యకట్టుకు నీరు నిలిపివేశారు. పండిన పంటను కోయడానికి కూలీల కోరత ఏర్పడి సుధిరా గ్రా మల నుండి ఓకోక్కరికి రూ 250 ఇచ్చి రప్పించి పంటకోస్తున్నట్లు తెలిపారు. ప ండించిన పంటను తీసుకోని హైద్రబాదు, రాయచూర్, గుంటూరు మార్కేట్‌లకు వెళ్ళినా సరైన ధరలేక చేసిన అప్పులు తీరక కష్టాలు తప్పడం లేదన్నారు.

వలస వెళ్తే... భూమిని కాజేశారు..
దంపతుల ఆత్మహత్యాయత్నం

గద్వాల, మార్చి 20: గత కొన్ని సంవత్సరాలుగా కూలీనాలి చేసి కూడబెట్టిన సొమ్ముతో నాలుగు ఎకరాలకు వ్యవసాయ పొలాన్ని కొనుగోలు చేస్తే కొందరు పెద్దలు కాజేశారని వృద్ధ దంపతులు కలెక్టర్ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సం ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేం ద్రంలో సోమవారం చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ధరూరు మండలం పార్చర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని సోం పురం గ్రామానికి చెందిన తిమ్మప్ప, భూలక్ష్మీలకు ఐదుగురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. గత ఐదేళ్ల క్రితం పార్చర్ల గ్రామ శివారులోని సర్వే నెం.376లో 4 ఎకరాల వ్యవసాయ పొలాన్ని కొనుగోలు చేశామన్నారు. కర్ణాటక ప్రాంతానికి వలస వెళ్లడంతో గ్రామానికి చెందిన ఓ నాయకుడు కబ్జా చేసి పేర్లు తారుమా రు చేశారని ఆరోపించారు. ఈ విషయంపై గత కొన్ని నెలలుగా అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించడం లేదని వాపోయారు. సోమవారం ఫిర్యాదుల దినోత్సవం సందర్భంగా వృద్ధ దంపతులు క్రిమిసంహారక మందులు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు పట్టుకొని వారించారు. దాదాపు కొన్ని గంటల సేపు వృద్ధ దంపతులు కన్నీరుమున్నీరవుతున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం పట్ల ప్రతి ఒక్కరు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు మూడు గంటల తర్వాత ఆర్డీఓ అబ్దుల్ హమీద్ వృద్ధదంపతుల వద్దకు చేరుకొని సమస్యను వివరించేందుకు డిఆర్‌ఓ దగ్గరకు తీసుకెళ్లారు. మండల తహశీల్దార్‌తో పాటు గ్రామానికి చేరుకొని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
కొత్తకోట, మార్చి 20: సత్యాహల్లి గ్రామంలో యశ్వంత్(8) అనే విద్యార్థి సోమవారం మధ్యాహ్నం ఈతకు వెళ్లి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సొంత బావిలో యశ్వంత్ అక్క ఈత నేర్చుకోవడానికి వెళ్లగా యశ్వంత్‌కు డబ్బా భిగించగా అట్టి డబ్బా ఊడిపోయింది. దీంతో యశ్వంత్ బావిలో మునిగిపోగా వెంటనే అక్క తల్లికి సమాచారం అందించింది. కాగా యశ్వంత్‌కుమార్ మండల విద్యాశాఖ అధికారి కృష్ణయ్య కుమారుడు, శవాన్ని వెతకడానికి గజ ఈతగాళ్లను వనపర్తి నుండి రప్పించారు. కృష్ణయ్యను పరామర్శించడానికి ఉపాధ్యాయ సంఘ నేతలు గ్రామానికి చేరుకున్నారు.