మహబూబ్‌నగర్

ట్రాన్స్‌కో నిర్వాకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణపేటటౌన్, మార్చి 23: ట్రాన్స్‌కో అధికారులు, సిబ్బంది నిర్వాకం కారణంగా 11కెవి విద్యుత్ లైన్ విద్యార్థికి తగిలి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థి పరిస్థితి విషమంగా మారడంతో భాధితుడికి ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం జిల్లా కేంద్రానికి తరలించి అక్కడి నుండి హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని సుభాష్‌రోడ్ ధన్‌గడ్డ ప్రాంతంలో నివాసముంటున్న మున్సిపల్ కార్మికుడు సాయిలు దంపతుల కుమారుడు నవీన్(11) స్థానిక రవితేజ ఉన్నత పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. గురువారం నవీన్ పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఇంటి మిద్దెపై ఆడుకుంటుండగా మధ్యాహ్నం 12.30గంటల ప్రాంతంలో ఇంటిపై నుండి వెళ్లిన 11కెవి విద్యుత్ తీగలు తగిలి తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీనిని గమనించిన ఇరుగుపొరుగు వారు తల్లికి సమాచారం ఇవ్వడంతో బాధితుడిని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించాలని సూచించగా జిల్లా కేంద్రంలో సాయంత్రం వరకు పరీక్షలు నిర్వహించి హైదరాబాద్‌కు రెఫర్ చేయడంతో బాధితుడిని హైదరాబాద్‌కు తరలించారు.
ట్రాన్స్‌కో అధికారుల నిర్వాకమే ప్రమాదానికి కారణమా?
ట్రాన్స్‌కో అధికారుల నిర్వాకం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు సుభాష్‌రోడ్ ప్రజలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. 11కెవి లైన్లను తొలగించాలని ట్రాన్స్‌కో అధికారులకు ధన్‌గడ్డ ప్రాంత వాసులు విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఈ ప్రమాదం సంభవించిందన్నారు. కాగా ఈ ప్రాంతంలో గత మహాశివరాత్రి పర్వదినం రోజున కొందరి స్థలాల్లో 11కెవి లైన్లను తొలగించిన సిబ్బంది అక్కడే ఖాళీగా ఉన్న మరో విద్యుత్ స్తంభానికి విద్యుత్ వైర్లను ఏర్పాటు చేస్తే ప్రమాదం సంభవించే ఆస్కారం ఉండదనేది ఈ ప్రాంత ప్రజల అభిప్రాయం. మహా శివరాత్రి పర్వదినం రోజున ఇదే ప్రాంతంలో 11కెవి విద్యుత్ లైన్లను మార్చిన ట్రాన్స్‌కో సిబ్బంది ఈ విద్యుత్‌లైన్ల తొలగింపు విషయంలో ఎందుకు నాన్చివేత ధోరణిని అవలంబించారో అంటూ ట్రాన్స్‌కో అధికారులు, సిబ్బంది తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి ట్రాన్స్‌కో పూర్తి భాధ్యత వహించాలని లేనిచో ఆందోళనకు దిగుతామని ధన్‌గడ్డ కాలనీ వాసులు బహిరంగంగానే పేర్కొంటున్నారు.