మహబూబ్‌నగర్

బిజెపి నేతలు నామాజీ, రతంగ్ అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణపేటటౌన్, మార్చి 23: మతపరమైన రిజర్వేషన్లను నిరసిస్తూ ఈ నెల 24న శుక్రవారం తలపెట్టిన ఛలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు గురువారం సాయంత్రమే నారాయణపేటలో బిజెపి రాష్ట్ర నాయకులు నాగూరావునామాజీ, రతంగ్‌పాండురెడ్డిలతో పాటు పలువురు బిజెపి నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమాలతో అధికారంలోకి వచ్చిన తెలంగాణ సిఎం కెసిఆర్ నేడు ఉద్యమాలను అణచివేసే విధానాలను అవలంబిస్తూ తన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఉద్యమాలు ఉండవని చెప్పిన ఉద్యమ సమయంలో చెప్పిన సిఎం కెసిఆర్ తాను అధికారంలోకి వచ్చాక ఉద్యమం జరగని రోజు ఏదని వారు ప్రశ్నించారు. విపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ పాలన సాగిస్తోందన్నారు. కాగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలను చేస్తూ రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ముస్లిం రిజర్వేషన్లు చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. బిజెపి సామాజికంగా, ఆర్థికం వెనకబడిన వారి రిజర్వేషన్లకు నాటి నుండి నేటి వరకు సహకరిస్తోందన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ మతపరమైన రిజర్వేషన్లు చేసేందుకు పూనుకుంటే బిజెపి వ్యతిరేకిస్తుందన్నారు. ఇలాంటి ప్రయత్నాలు మరోమారు చేస్తే కుహానా లౌకికవాదులకు ఉత్తరాది రాష్ట్రాల్లో పట్టినగతే తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌కు పడుతుందని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మతపరమైన రిజర్వేషన్ల ఆలోచనను విరమించుకోవాలని లేనిచో తమ ఆందోళనలను మరింత తీవ్రతరం చేసి తీరుతామన్నారు.
అగ్నిమాపక ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన
గద్వాలరూరల్, మార్చి 23: గద్వాల పట్టణంలోని కాకతీయ టెక్నో హైస్కూల్‌లో గురువారం అగ్నిమాపక ఎస్‌ఐ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు అగ్నిమాపక ప్రమాదాలకు అవగాహన కల్పించారు. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా మనం నివారణ మార్గాల ద్వారా అదుపు చేయవచ్చుననేది విద్యార్థులకు ప్రాక్టికల్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శ్రీకాంత్‌జ్యోషి, అగ్నిపమాక సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.