మహబూబ్‌నగర్

క్లాస్-5 కాంట్రాక్టర్లు ఎదగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మార్చి 23: జిల్లాలో ఉన్న క్లాస్-5 కాంట్రాక్టర్లు జిల్లాకు సంబంధించిన పనులు మీరే చేసేవిధంగా ఎదగాలని దానికి కావల్సిన వౌలిక వసతులు సమకూర్చుకోవాలని జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లాకు సంబందించిన క్లాస్-5 కాంట్రాక్టర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ .జిల్లాలో మీషన్ భగీరథ, డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పనులు చేసేందుకు ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి మన జిల్లాకు వచ్చి కాంట్రాక్టు పనులు చేస్తున్నారని అన్నారు. వారికి అవకాశం ఇవ్వకుండా మనమే మన జిల్లాకు సంబంధించిన పనులన్నింటిని ఒక ఫైనాన్స్ సంవత్సరంలో రూ.10లక్షల రుపాయలన అనుభవం ఉన్నటు అయితే రూ.50లక్షల వరకు పనులు చేసే అవకాశం ఉందని అన్నారు. దీనికి కావల్సిన ఆస్తి వివరాల సర్ట్ఫికెట్ స్థానిక తహశీల్దార్‌తో తీసుకుని ఆర్‌అండ్‌బి అధికారులతో కాంట్రాక్టు సంబంధించిన ఇతర అనుమతి పత్రాలను పొందినట్లు అయితే మన పనులన్ని మీరే చేసేవిధంగా చూస్తానని ఆయన అన్నారు. ఆరు నెలల కాలంలో అనుకున్న విధంగా పనులు నిర్వహిస్తే క్లాస్-3 కాంట్రాక్టర్‌గా ఎదిగే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వం నిర్మించే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మాణం చేపట్టినట్లు అయితే మీకు కావలసిన స్థానిక తహశీల్దార్‌తో ఇసుక పంపిణీ, ప్రభుత్వ నిబంధనల మేరకు సిమెంట్ ఫ్యాక్టరీ వారితో మాట్లాడి సబ్సిడీపై సిమెంట్‌ను ఇప్పించడం జరుగుతుందని అన్నారు. అలాగే స్టిల్ విషయంలో కూడా మా వంతు ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో కాంట్రాక్టర్‌కు నష్టం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. వారం, పది రోజుల్లో మీరందరు సమిష్టిగా మాట్లాడుకుని నిళ్ల నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేవిధంగా ముందుకు రావాలని ఆయన తెలిపారు. డబుల్ బెడ్‌రూమ్‌కు నిధుల కొరత లేదని అన్నారు. పనులు జరిగిన వెంటనే డబ్బులు చెల్లించే విధంగా నియమ నిబంధనలు ఉన్నాయని అన్నారు. డబ్బులు రావనే అపోహను మరచి పనిలో ముందుకు పోవాలని పేర్కోన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు స్థలం లేని ఎడల ప్రభుత్వమే భూమిని కొని ఇళ్లు నిర్మించే విధంగా చూస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌సి పిఆర్ రఘు, హౌసింగ్ పిడి రమణారావు, బిసి వెల్ఫెర్ అధికారి సమ్‌సన్, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా సంబురాలని
విజయవంతం చేయాలి: కలెక్టర్
ఇటిక్యాల మార్చి 23: జిల్లాలో మొట్ట మొదటిగా సారి జరిగే జోగుళాంబ గద్వాల జిల్లా సంబురాలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌సైని అధికారులకు సూచించారు. గురువారం మండల పరిధిలో బీచుపల్లి గురుకుల పాఠశాల ఆవరణంలో జిల్లా సంబురాల కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ సందర్శంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో విద్యర్థులు నైపుణ్యాలను గుర్తించవచున్నారు. అనంతరం మండలంలోని వివిధ పాఠశాలల విద్యర్థులు పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ రాంమహేశ్వర్‌రెడ్డి, తహశీల్దార్ డి.లక్ష్మి, మండల అధ్యక్షుడు హనుమంతురెడ్డి, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రవీందర్, ఆయా పాఠశాల విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు.