మహబూబ్‌నగర్

అంచనాలు తలకిందులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మార్చి 23: హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరి అంచనాలు తలకిందులు అయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే సునయాసంగా గెలుస్తామనుకున్న టిఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి కాటేపల్లి జనార్థన్‌రెడ్డి ఎట్టకేలకు రెండవ ప్రాధాన్యత ఓట్లతో విజయం సాదించారు. దింతో పిఆర్‌టియుటిఎస్ ఉపాధ్యాయులు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఎదోరకంగా గెలిచామని ఆ సంఘం నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఎన్నికల ప్రచారం సమయంలో జిల్లాకు చెందిన టిఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే కాటేపల్లి జనార్థన్‌రెడ్డి గెలుపుఖాయమని చెప్పుకున్న నాయకులు తీరా ఫలితాలు వెల్లడైన తర్వాత ఆయోమయంలో పడ్డారు. అయితే కాటేపల్లి పోటీ చేస్తున్న సంఘం బలమైన ఉపాధ్యాయ సంఘమని ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పద్నాలుగువేల ఓట్లు వస్తాయని భావించినప్పటికిని ఆ సంఘం నాయకుల అంచనాలు తలకిందులు కావడం ఓ కింత కలవరానికి గురయ్యారు. అయినప్పటికిని ఎదోరకంగా గెలుపొందామనే సంతోషం మాత్రం వారిలో మిగిలింది. గురువారం జిల్లా వ్యాప్తంగా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు స్వీట్లు పంచుకుని కెసిఆర్ చిత్రపటానికి షీరాభిషేకం చేశారు. అదేవిధంగా పిఆర్‌టియుటిఎస్ ఉపాధ్యాయులు స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. అయితే తాము ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేకపోయాయని పిఆర్‌టియుటిఎస్ ఉపాధ్యాయ సంఘం నాయకులు కొందరు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి ప్రాదాన్యత ఓట్లతోనే గెలుపు సునయాసంగా భావించినప్పటికిని అది సాధ్యపడకపోవడం ఎలిమినేషన్ పద్దతిలో ఓట్ల లెక్కింపులో రెండవ ప్రాధాన్యత ఓట్లతో టిఆర్‌ఎస్ మద్దతు తెలిపిన కాటేపల్లి జనార్థన్‌రెడ్డి టిఎస్‌యూటిఎఫ్ అభ్యర్థి మాణిక్‌రెడ్డిపై ఘనవిజయం సాదించారు. ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మూడు జిల్లాల పరిధిలో 23789మంది ఓటర్లకు గాను 19338మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
ఈ ఎన్నికల్లో పోల్ అయిన ఓట్లలలో 50శాతం ఓట్లు ఏ అభ్యర్థికి వాస్తే వారు విజయం సాధించినట్లు అయితే అది సాధ్యపడలేదు. ఓటర్లు మొదటి ప్రాధాన్యత ఓట్లలలో ఎవరికి మేజారిటీ ఇవ్వలేదు. ఎన్నికల్లో అభ్యర్థి గెలవాలంటే 9670 ఓట్లు వచ్చిన వారు మాత్రమే విజయం సాధించినట్లు. అయితే మొదటి ప్రాధాన్యతలో కాటేపల్లి జనార్థన్‌రెడ్డికి 7640 ఓట్లు పోల్ అవ్వగా టిఎస్‌టిఎస్‌టియూ అభ్యర్థి ఎవిఎన్‌రెడ్డికి 3091 ఓట్లు రాగా యూటిఎఫ్ అభ్యర్థి మాణిక్‌రెడ్డి 3048 ఓట్లురాగా టిపిఆర్‌టియు అభ్యర్థి హర్షవర్థన్‌రెడ్డికి 2482 ఓట్లు పోల్ అయ్యాయి. అదేవిధంగా తాపస్ అభ్యర్థి నారా భూపతిరెడ్డికి 1714, బిసిటియు అభ్యర్థి విజయ్‌కుమార్‌కు 730 ఓట్లు, బిటి ఏ అభ్యర్థి ఆదిలక్ష్మయ్యకు 461 ఓట్లు వచ్చాయి. మిగిలిన అభ్యర్థులకు డబుల్ డిజిట్ ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. అయితే పిఆర్‌టియుటిఎస్ అభ్యర్థి కాటేపల్లి జనార్థన్‌రెడ్డికి సమీప ప్రత్యార్థిపై మొదటి ప్రాధాన్యతలో 4549 ఓట్లు అధిక్యం లభించింది. అయితే గెలుపుకు కావల్సిన ఓట్లు రాకపోవడంతో ఎలిమినేషన్ విధానంలో రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఏడుగురు అభ్యర్థులు ఎలిమినేషన్ తర్వాత కాటేపల్లి జనార్థన్‌రెడ్డి 7887 ఓట్లు టిఎస్‌యూటిఎఫ్ అభ్యర్థి మాణిక్‌రెడ్డికి 3295 ఓట్లు రాగా టిఎస్‌ఎస్‌టియూ అభ్యర్థి ఎవిఎన్ రెడ్డి 3234 ఓట్లు, టిపిఆర్‌టియు అభ్యర్థి హర్షవర్థన్‌రెడ్డి 2725 ఓట్లు వచ్చాయి. ఈ సమయంలో పిఆర్‌టియుటిఎస్ అభ్యర్థి కాటేపల్లి భారీ అధిక్యంలో ఉన్న గెలుపునకు ఇంకా 1783 ఓట్లు రావల్సి ఉండగా హర్షవర్థన్‌రెడ్డిని ఎలిమినేట్ చేసి ఆయన బ్యాలెట్‌లో నుండి రెండవ ప్రాదాన్యత ఓట్లు లెక్కించారు. తీవ్ర పోటీ నేపథ్యంలో టిపిఆర్‌టియు అభ్యర్థి హర్షవర్థన్‌రెడ్డి ప్రధాన అభ్యర్థులకు దీటుగా ఓట్లు సాధించారు. చివరగా 11వ రౌండ్ పూర్తి అయ్యేసరికి కాటేపల్లి జనార్థన్‌రెడ్డికి 9734 ఓట్లు రావడంతో విజేతగా ప్రకటించారు. ప్రత్యార్థి (మిగతా 3వ పేజీలో)
(1వ పేజీ తరువాయి)యూటిఎఫ్ అభ్యర్థి మాణిక్‌రెడ్డికి 5095 ఓట్లు వచ్చాయి. బుధవారం అర్థరాత్రి 12గంటల తర్వాత ఈ ఫలితాలను ప్రకటించారు. మొత్తం మీద ఈ ఎన్నికల్లో నోటాకు సైతం 48 ఓట్లు పోల్ అయ్యాయి. ఎట్టకేలకు ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్థన్‌రెడ్డి మరోసారి ఎమ్మెల్సీగా గెలువడంతో ఆయనకు మద్దతు పలికిన ఉపాధ్యాయులు, టిఆర్‌ఎస్ నాయకులు సంబరాల్లో మునిగి తెలారు. ఈ సందర్భంగా గురువారం మహబూబ్‌నగర్‌లో టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్‌తో పాటు మరికొందరు టిఆర్‌ఎస్ నాయకులు కలిసి సంబరాలు జరుపుకుని స్వీట్లు పంచుకున్నారు. ఎమ్మెల్సీ జనార్థన్‌రెడ్డిని కలిసేందుకు హైదరాబాద్‌కు బయలుదేరిన ఉపాధ్యాయులు ముందుగా జిల్లా కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ జరుపుకున్నారు. అయితే ఎవరు ఊహించని విధంగా ఎవిఎన్‌రెడ్డి, హర్షవర్థన్‌రెడ్డికి భారీ ఓట్లు పోల్ కావడం దాంతోనే కాటేపల్లి జనార్థన్‌రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓట్లు కాకుండా రెండవ ప్రాధాన్యత ఓట్లలలో బయటపడ్డారని ముఖ్యంగా హర్షవర్థన్‌రెడ్డికి పడిన ప్రతి ఓటు కాటేపల్లి జనార్థన్‌రెడ్డికే పడాల్సిన ఓట్లు అని పలువురు ఉపాధ్యాయులు చర్చించుకుంటున్నారు.