మహబూబ్‌నగర్

నేటి నుండి గద్వాల సంబురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, మార్చి 24: ఈ నెల 25వ నుండి 29వ తేదీ వరకు జరిగే గద్వాల సంబురాలను విజయవంతం చేసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌సైనీ, ఎస్పీ విజయ్‌కుమార్‌లు అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేపట్టడం జరిగిందని, జోగుళాంబ గద్వాల జిల్లా ఏర్పడి ఆరు మాసాలు అవుతున్నందున జిల్లాలోని కళలు, సాంస్కృతిక, చేనేత కళావైభవాలను, డ్వాక్రా, గిరిజన ఉత్పత్తుల నైపుణ్యాలకు దేశవ్యాప్త కీర్తిని చాటేందుకు ఈ సంబరాలు నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. ఈ నెల 25వ తేదీన ప్రారంభమయ్యే ఉత్సవాలకు ముఖ్యఅతిథులుగా నిజామబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎంపిలు నంది ఎల్లయ్య, జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు రాంచందర్‌రావు, కసిరెడ్డి నారాయణరెడ్డి, దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డికె అరుణ, సంపత్‌కుమార్, చైర్‌పర్సన్ కృష్ణవేణి, పర్యాటక శాఖ కార్యదర్శి వెంకటేశంతో పాటు వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు హాజరవుతారన్నారు. 26వ తేదీన మంత్రి లక్ష్మారెడ్డి, 27న సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, 29న జూపల్లి కృష్ణారావులు హాజరవుతారన్నారు. ఈ ప్రాంత కళాకారులతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు, సినీ నేపథ్యగాయిని గీతామాధురి, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి, వివిధ మెజీషియన్లు, మిమిక్రీ ఆర్టిస్టులు హాజరవుతున్నట్టు వారు తెలిపారు. సంబరాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అదే విధంగా జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ నియంత్రణతో పాటు గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. సమావేశంలో ఆర్డీఓ రవీందర్‌రెడ్డి, తహశీల్దార్లు మంజుల, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.