మహబూబ్‌నగర్

నేడు జక్లేర్ వరకు రైలు మార్గం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, మార్చి 24: దేవరకద్ర- మునీరాబాద్ రైల్వేలైన్ త్వరితగతిన కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా దేవరకద్ర నుండి జక్లేర్ వరకు దాదాపు 30 కిలోమీటర్ల రైల్వేలైన్‌ను అధికారులు ఇది వరకే పూర్తిచేశారు. గతంలో రెండు మార్లు డెమో ప్యాసింజర్‌ను సైతం నడిపారు. ఎలాగైనా జక్లేర్ వరకు రైలును నడపాలని ఈనెల 25న శనివారం హైదరాబాద్‌లో కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభు సికింద్రాబాద్- మహబూబ్‌నగర్ రైల్వే డబుల్‌లైన్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈనేపథ్యంలో దేవరకద్ర- జక్లేర్ మధ్య నూతన డెమో ప్యాసింజర్‌ను నడుపబోతున్నారు. ఇట్టి డెమో ప్యాసింజర్ రైల్‌ను చూసేందుకై ప్రజలు శనివారం జక్లేర్ రైల్వే స్టేషన్‌కు అధికంగా తరలివచ్చే అవకాశం ఉంది. మొత్తంపై ఇట్టి రైలు రాకతో చుట్టు పక్కల గ్రామాల వ్యాపారులతోపాటు మక్తల్‌లోని వ్యాపారులు సైతం హైదరాబాద్‌కు లైల్లో వెళ్లేందుకై సుముఖత చూపుతున్నారు. తమ వాపార వస్తూవులను సైతం రైల్లో ఈజీగా తెచ్చుకోవచ్చని వారు భావిస్తున్నారు.