మహబూబ్‌నగర్

పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్వకుర్తి, మార్చి 24: పేద ప్రజల అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గ్రామ స్థాయిలో ప్రజలలోకి తీసుకెళ్లాలని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణ కేంద్రంలో గల సాయిబాలాజీ పంక్షన్ హాలులో టి ఆర్ ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ మంత్రి రాములు, మాజీ ఎంపి మంద జగన్నాథం, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ విజితారెడ్డి, కల్వకుర్తి నియోజకవర్గ మాజీ ఇంచార్జి బాలాజిసింగ్, రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్‌రెడ్డి లు ముఖ్య అతిథులుగా హజరయ్యారు. ఈసందర్బంగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ధే ద్యేయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. అలాగే కల్వకుర్తి ప్రాంతానికి సాగునీరు అందించి తీరుతామని, అక్టోబర్ నాటికి పట్టణానికి త్రాగునీరు అందిస్తామన్నారు. పార్టీ సభ్యత్వాలలో రాష్ట్రంలో కల్వకుర్తి నియోజకవర్గం ప్రథమ స్థానంలో నిలిచే విధంగా నాయకులు సమన్వయంతో ముందుకు సాగుతామన్నారు. అదేవిధంగా మాజీ మంత్రి రాములు, మాజీ ఎంపి మంద జగన్నాథం లు మాట్లాడుతు కల్వకుర్తి ప్రాంతానికి త్వరగా సాగునీరు సాధించేందుకు నాయకులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని మొదటి తీర్మానం, నియోజకవర్గంలో గత మూడు, నాలుగు సంవత్సరాలుగా కరువుతో రైతులు అల్లాడుతున్నారని వారిని ప్రభుత్వం అదుకునేలా చొరవ తీసుకోవాలని రెండవ తీర్మానం ప్రవేశ పెట్టారు దీంతో కార్యకర్తలు, నాయకులు హర్షం వ్యక్తం చేయడంతో పాటు చప్పట్ల వర్షం కురిపించారు. దీంతో ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి దృష్టికి తప్పకుండా తీసుకెళ్లానని హమి ఇచ్చారు. మాజీ ఎంపి మంద జగన్నాథం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభత్వ సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లాలన్నారు. అనంతరం ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి మొదటి సభ్యత్వ నమోదు చేయించి రసీదు అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆనంద్‌కుమార్, విజయ్‌గౌడ్, పర్వతాలు, రాములు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.