మహబూబ్‌నగర్

బాల్యవివాహాలు లేని జిల్లాగా వనపర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, మార్చి 24: రాష్ట్రంలోనే బాల్యవివాహాలు లేని జిల్లాగా వనపర్తిని మార్చుకుందామని వనపర్తి జిల్లా జడ్జి వెంకట కృష్ణయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం వనపర్తి మండలం నాగవరం ఇందూ గార్డెన్‌లో బాల్యవివాహాల నిరోధంకై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు చేసిన చట్టాలను గౌరవిస్తూ సమాజంలో మార్పు రావడం కోసం సమష్టి కృషితో ముందుకెళ్లాలని అన్నారు. సమాజంలో నిరాక్షరాస్యత ఉండడం, కుటుంబ నియంత్రణ పాటించకపోవడం వల్ల బాల్య వివాహాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఉచిత విద్యను అందిస్తున్నప్పటికి గ్రామీణ ప్రాంతాల్లోని బాలబాలికలు బడి బయట ఉండడం ఆందోళన కలిగిస్తున్న అంశమన్నారు. ప్రతి ఒక్కరు చదువుకున్న నాడు బాల్యవివాహాలు వాటంతట అవే నిర్మూలన అవుతాయని చెప్పారు. సమాజంలో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రధానంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని ఆయన చెప్పారు. మన పిల్లలను మనమే కాపాడుకోవాలన్న ఆలోచన కలిగించడానికి జిల్లా అధికారులు సదస్సును ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. కొన్ని దేశాల్లో ఒక చెట్టు కొమ్మను కూడా నరకడానికి వీలులేని విధంగా చట్టాలు ఉన్నాయన్నారు. ప్రతి చిన్నారి కనీసం డిగ్రీ వరకు చదివించాలన్న తపన తల్లిదండ్రుల్లో ఉండాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే బాల్య వివాహాలను నిరోధించడం సాధ్యమవుతుందని, సమాజాన్ని అధికారులు ఒక్కరే మార్చలేరని అన్నారు. ప్రతి ఒక్కరు ఆత్మపరిశీలన చేసుకొని భావితరాల భవిష్యత్తు కోసం బాల్యవివాహాలను అరికట్టాలని ఆయన అన్నారు. ఏడాది తరువాత వనపర్తి జిల్లా బాల్య వివాహాలు లేని జిల్లాగా రూపుదిద్దుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
జిల్లా కలెక్టర్ శే్వతా మహంతి మాట్లాడుతూ బాల్యవివాహాలను అరికట్టేందుకు జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో కమిటిలను వేస్తామని, ఈనెల 31వ తేదీన ప్రతి గ్రామంలో కమిటీలు సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల్లో బాల్యవివాహాల నివారణ పట్ల అవగాహన కలిగిస్తారని తెలిపారు. అలాగే మండల స్థాయిలో తహశీల్ధార్ల స్థాయిలో టీమ్‌లను ఏర్పాటు చేస్తామని, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీలు పని చేస్తాయని ఆమె తెలిపారు. వీటిపై సమీక్షలు నిర్వహించి ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటామన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రతి ఆడ పిల్ల డేటా ఉంటుందని, అలాగే పాఠశాలలో కూడా ఉంటుందని అంగన్‌వాడీ టీచర్లు, ప్రధానోపాధ్యాయులు బాల్య వివాహాల నిరోధంకై కృషి చేయాలన్నారు.
జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ ఆడపిల్లలు పుడితేనే త్వరగా పెళ్లిళ్లు చేయాలన్న సంకల్పం గ్రామీణ ప్రాంతాల తల్లిదండ్రుల నుండి పోవాలని తెలిపారు. బాల్యవివాహాల సమాచారాన్ని పోలీసు అధికారులకు తెలియజేస్తే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి నిరోధించే అవకాశం కలుగుతుందని ఆమె చెప్పారు. బాల్య వివాహాల నిరోధం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలు మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రారెడ్డి, లీగల్ లిట్రసి జిల్లా కార్యదర్శి సూర్యనారాయణ, న్యాయవాది శశిభూషణ్, ఎంపిపి శంకర్‌నాయక్, మున్సిపల్ ఛైర్మన్ రమేష్ గౌడ్, మార్కెట్ కమిటి ఛైర్మన్ రవి, చైల్డ్ లేబర్ పిడి చంద్రశేఖర్, భాస్కర్, జడ్పిటిసి వెంకటయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.