మహబూబ్‌నగర్

ఆసుపత్రుల బంద్ విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, మార్చి 25: డాక్టర్లపై జరుగుతున్న దాడులకు నిరసనగా శనివారం ఆలిండియా మెడికల్ అసోసియేషన్ పిలుపుమేరకు వనపర్తిలో నిర్వహించిన ప్రభుత్వ, ప్రయివేట్ ఆసుపత్రుల బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా వనపర్తిలో డాక్టర్లు ఆసుపత్రులను బంద్ చేసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏరియా ఆసుపత్రి ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా అధ్యక్షులు డాక్టర్ మురళీధర్ మాట్లాడుతూ మహారాష్టల్రోని పూణేలో వారం రోజుల్లో ఐదు భౌతిక దాడులు జరగడం సమస్య తీవ్రతకు అద్దం పడుతుందన్నారు. వనపర్తి జిల్లాలో కూడా దురదృష్టవశాత్తు ఇలాంటి సంఘటనలు గతంలో జరిగాయన్నారు. ఇలాంటి మానసిక ఒత్తిడితో డాక్టర్లు పని చేయడం ఇబ్బందికరంగా ఉందని, రోగులకు అందించే సేవల మీద గుణాత్మకంగా ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. ఇలాంటి దాడులను వ్యతిరేకించాల్సిన బాద్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలు డాక్టర్లకు బాసటగా నిలవాలని ఆయన కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ శే్వతా మహంతి, ఎస్పీ రోహిణి ప్రియదర్శినిలను కలిసి వారు వినతిపత్రాలను అందజేశారు.
ప్రజల కల సాకారం...
* రైల్వే డివిజన్ ఆపరేషన్ మేనేజర్ కృష్ణానాయక్
మక్తల్, మార్చి 25: ప్రజలు కోరుకున్న విధంగా మహబూబ్‌నగర్- జక్లేర్ వరకు దక్షిణ మధ్యరైల్వే బోర్డుశాఖ డెమోరైలును ప్రారంభించడంతో ఈప్రాంత ప్రజల కల సాకారమైందని రైల్వే డివిజన్ ఆపరేషన్ మేనేజర్ కృష్ణనాయక్ అన్నారు. శనివారం జక్లేర్ రైల్వే స్టేషన్‌కు డెమోరైలు సేవలు ప్రారంభమైన సందర్భంగా ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ ప్రయాణికుల రద్దీని బట్టి ప్రస్తుతం వారినికి రెండు రోజులు నుడుపుతున్న రైలును ప్రతిరోజు నడిపేందుకై ప్రయత్నిస్తామని అన్నారు. జక్లేర్ నుండి కృష్ణావరకు పెండింగ్‌లో ఉన్న రైల్వేలైన్ పనులు, ఇతర పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.