మహబూబ్‌నగర్

పేదింటి ఆడపిల్లలను ఆదుకునేందుకే.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్లాపూర్, మార్చి 26: ఎన్నికల ప్రణాళికలో చెప్పని పథకాలెన్నో ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రవేశపెట్టారని అందులో పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకోసం కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు ఉన్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎంజికెఎల్‌ఐ అతిథిగృహం ఆవరణలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్యాణలక్ష్మీ పథకం ద్వారా వీపనగండ్ల మండలానికి 23, కొల్లాపూర్ మండలానికి 70, చిన్నంబావి 13, కోడేరుకు 73, పెంట్లవెల్లికి 14, పెద్దకొత్తపల్లికి 88, పానుగల్లుకు 25 కలిపి మొత్తం 314 మందికి రూ.1.60 కోట్లు విలువగల చెక్కులను అందచేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎంజికెఎల్‌ఐ పథకం ద్వారా నియోజకవర్గంలోని 13 గ్రామాలకు తప్ప అన్ని గ్రామాలకు సాగునీరు అందిస్తున్నామని, ఆ మిగిలిన 13 గ్రామాలకు కూడా వచ్చే ఆగస్టు 15 నాటికి సాగునీరు అందిస్తామన్నారు. తాగునీటికోసం ఆయా గ్రామాలలో అవసరాన్ని బట్టి ఒహెచ్‌ఆర్ ట్యాంకులను నిర్మిస్తామన్నారు. గతంతో పోలిస్తే కరెంటు విషయంలో అంతరాయం లేకుండా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఎందరో త్యాగాలు చేశారని, ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రాణాన్ని ఫణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేందుకు మన నిధులు, మన నీరు, మన ఉద్యోగాలు అన్న నినాదంతో అనేక ప్రయోజనాత్మకమైన పథకాలను ప్రవేశపట్టారని అన్నారు. అందులో భాగంగానే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు. నియోజకవర్గంలోని ఐదు మండల కేంద్రాలలో ఒక్కొక్కటి 20 కోట్ల చొప్పున గురుకుల పాఠశాలలు వచ్చాయన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకొని వృద్ధిలోకి రావాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఎంపిపిలు, జడ్పీటిసిలు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, సింగిల్‌విండోలతోపాటు మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని ఎంపిడివో కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం భవన నిర్మాణ పనులకు ఆదివారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణాన్ని మూడు నెలల్లో పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో అవకతవకతలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఇ విశ్వమోహన్, అధికారులు భీముడు పాల్గొన్నారు.

రికార్డుస్థాయలో టిఆర్‌ఎస్ సభ్యత్వాలు

జడ్చర్ల, మార్చి 26: జడ్చర్ల నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వాలు రికార్డుస్థాయిలో నమోదు చేయించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం నియోజకవర్గ కేంద్రమైన జడ్చర్లతో పాటు నూతన మండలమైన రాజాపూర్‌లో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమాలల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలకు కనువిప్పు కలిగేలా సభ్యత్వాలు నమోదు చేయించాలని సూచించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు పరుస్తున్న అభివృద్ధి ,సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టిఆర్‌ఎస్ పార్టీ అభిమానులే కాక తటస్థులు సైతం పార్టీ సభ్యత్వాలు తీసుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలోనే జడ్చర్ల నియోజకవర్గంలో సభ్యత్వాల నమోదు కార్యక్రమం జోరుగా కొనసాగుతోందని ఇది ఎంతో శుభపరిణామమని ఆయన అన్నారు. గ్రామాల్లో ఇంకా చాలా మంది సభ్యత్వాలు పొందేందుకు సిద్ధంగా ఉన్నారని ఇంటింటికీ వెళ్లి సభ్యత్వాల నమోదు చేయించాలని ఆయన తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వినియోగించుకొని లబ్ధి పొందుతున్న లబ్ధిదారులకు కూడా అవగాహన కల్గించి వారి ద్వారా సభ్యత్వాలు పొందాలని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడ్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి బెంబేలెత్తుతున్న ప్రతిపక్ష పార్టీలు భవిష్యత్తులో తమకు పుట్టగతులుండవని భావించి ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన విమర్శించారు. టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎల్లప్పుడూ ప్రజల మధ్యనే ఉంటూ వారి శ్రేయస్సుకోసం నిరంతరం కృషి చేయాలని మంత్రి పేర్కొన్నారు. సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో పార్టీ శ్రేణులు చురుకుగా వ్యవహరించాలని, నిర్లక్ష్యం వహించరాదని హితవు పలికారు. సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో జడ్చర్లను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టడమే ప్రధాన ధ్యేయంగా సభ్యత్వాల నమోదు కార్యక్రమం ముగిసే వరకు నిరంతరం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మహబూబ్‌నగర్ జిల్లా అంటే ఎంతో అభిమానమని వెనుకబడిన మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనేక అభివృద్ధి పనులను చేపడ్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆంధ్ర వలస వాదుల పాలనలో నిర్లక్ష్యానికి గురై పూర్తిగా వెనుకబాటు తనానికి గురైన పాలమూరును అభివృద్ధి చేయడమే ద్యేయంగా ప్రతిష్టాత్మకమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారని ఆయన తెలిపారు. ఎత్తిపోతల పథకం పనుల నిర్వహణకు ప్రతిపక్ష పార్టీలు అడుగడుగునా అడ్డు తగులుతున్నాయని అయినా కూడా ప్రభుత్వం మనోస్థైర్యంతో అన్ని అడ్డంకులను అధిగమిస్తూ ఎత్తిపోతల పథకం పనులను నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. ప్రజలు బాగు పడటం ప్రతిపక్ష పార్టీలకు ఎమాత్రం ఇష్టంలేదని అందుకే ప్రజా సంక్షేమం కోసం చేపడుతున్న పనులకు అటంకాలు కలిగిస్తూ తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రతిపక్షాల కుట్రలను ప్రజలు గమనించాలని బంగారు తెలంగాణ సాధనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న కెసిఆర్‌కు అండగా నిలవాలని అందుకోసం టిఆర్‌ఎస్ పార్టీలో చేరాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పలువురికి సభ్యత్వాలు మంత్రి తన చేతులమీదుగా అందజేశారు. ఈకార్యక్రమంలో టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, ఎంపిపి లక్ష్మి, జడ్పిటీసి జయప్రద, మండల అధ్యక్షుడు కోడ్గల్ యాదయ్య, నాయకులు గోవర్ధన్‌రెడ్డి, శ్రీశైలంయాదవ్, మురళి, శ్రీకాంత్, శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.