మహబూబ్‌నగర్

బంగారు తెలంగాణకు అడుగుపడినట్లే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మార్చి 28: బంగారు తెలంగాణ నిర్మాణం జరుగుతుందని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచన విధానం నేరవేరుతుందని మహబూబ్‌నగర్‌కు పోస్ట్ఫాస్ పాస్‌పోర్టు సేవా కేంద్రం రావడం అంటే బంగారు తెలంగాణకు అడుగుపడినట్లేనని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని హెడ్ పోస్ట్ఫాస్‌లో పోస్ట్ఫాస్ పాస్‌పోర్టు సేవా కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంపి జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌లు ముక్యఅతిథులుగా హజరయ్యారు. ఎంతో అట్టహసంగా ప్రారంభమైన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్, ఎస్పీ రెమా రాజేశ్వరి, హైదరాబాద్ జోనల్ పోస్ట్ఫాస్ అధికారి ఎలియాష, రిజినల్ పాస్‌పోర్టు అధికారి విష్ణువర్థన్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా మహబూబ్‌నగర్‌కు పాస్‌పోర్టు కార్యాలయం రావడం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని అదేవిధంగా ఎంపి జితేందర్‌రెడ్డి చేసిన కృషి కూడా ఫలించిందన్నారు. కలలో కూడా ఊహించనటువంటి ఈ కేంద్రం రావడం ఈ ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పాస్‌పోర్టు కోసం వెళ్లాలంటే హైదరాబాద్‌లో రోజుల తరబడి మహబూబ్‌నగర్ వాసులు ఉండి తీరా కొందరు దళారుల చేతుల్లో కూడా మోసపోయిన దఖాలాలు ఉన్నాయని ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదన్నారు. తెలంగాణకు వచ్చిన రెండు పాస్‌పోర్టు కేంద్రాల్లో మహబూబ్‌నగర్, వరంగల్‌కు వచ్చిన్నప్పటికిని తొలి ప్రాధాన్యతలో మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా విభజన తర్వాత మహబూబ్‌నగర్ పని అయిపోయిందని అన్ని రకాల వ్యాపారాలు మూతపడుతాయని కొందరు తప్పుడు ప్రచారం చేశారని వారి నోళ్లు మూయించేరోజు వచ్చిందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో సాగు,తాగునీటి పథకాలు కూడా పెద్ద ఎత్తున రాబోతున్నాయని ఏడాదిలో వాటన్నింటిని ప్రారంబిస్తామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మరింత వ్యాపార అభివృద్ధి చెందుతుందని ఇక్కడికి నాలుగైదు పరిశ్రమలు కూడా రాబోతున్నాయని వాటిని బైపాస్ రోడ్డు పక్కలోనే ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మహబూబ్‌నగర్‌లో శాంతిభద్రతల పరిరక్షణలో ఎస్పీ చూపిస్తున్న చొరవ అమోఘమన్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ జిల్లాకు ఎదైన పథకం వస్తుందంటే అందుకు సంబందించిన భవనాల స్థలాలు కావాలంటే వెంటనే సమకూరుస్తున్నారని కలెక్టర్ జిల్లా అభివృద్ధిపై చూపిస్తున్న చొరవ మరవలేనిదన్నారు. కేంద్రంతో ఎంపి జితేందర్‌రెడ్డి పోరాడి నిధులు తీసుకువస్తున్నారని అందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ సహకారం ఎంతగానో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రాధ ఆమర్, ట్రైని కలెక్టర్ గౌతం, మహబూబ్‌నగర్ పోస్ట్ఫాస్ సూపరింటెండెంట్ శివశంకరయ్య, అసిస్టెంట్ సూపర్‌వైజర్ విష్ణుజ్యోతి, పోస్టుమాస్టర్ సుబ్రహ్మణ్యం, అధికారులు నర్సింహులు, రవిందర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ ఇద్దరి కూతుళ్లు అతిరాయ్, అయిషాలకు పాస్‌పోర్టులను ఎంపి జితేందర్‌రెడ్డి అందజేశారు.