మహబూబ్‌నగర్

పింఛన్ కోసం వచ్చి.. వడదెబ్బకు వృద్ధుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధన్వాడ, మార్చి 30: ఫించన్ కోసం వచ్చి వృద్ధుడు మృతి చెందిన సంఘటన మరికల్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గురువారం మరికల్ గ్రామస్థుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మరికల్ మండల పరిదిలోని పల్లేగడ్డ గ్రామానికి చెందిన గుర్రాల రాములు(69)అనే వృద్ధుడు గురువారం పింఛన్ డబ్బులు కోసం మరికల్ గ్రామంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద మధ్యాహ్నం ఎండలో నిలబడటం జరిగింది. ఎండకు గుర్రాల రాములుకు అస్వస్థతకు గురికావడంతో ఆటోలో పల్లేగడ్డ గ్రామానికి కుటుంబసభ్యులు తీసుకోని వెళ్లడం జరిగింది. మార్గమద్యలోనే గుర్రాల రాములు మృతి చెందినట్లు పల్లేగడ్డ గ్రామస్థులు తెలిపారు. చివరకు గుర్రాల రాములు పింఛన్ కూడా తీసుకోలేకపోవడం జరిగిందని గ్రామస్థులు తెలిపారు. అధికారులు ఇకనైనా పింఛన్‌లు ఉదయం సమయంలో వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు అందేలచుడాలని వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారంలో
పాల్గొన్న ‘పేట’ పిఆర్‌టియు నేతలు
నారాయణపేటటౌన్, మార్చి 30: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవానికి నారాయణపేట పిఆర్‌టియు నాయకులు హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం శాసనమండలిలో ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మండలి నుండి బయటకు వచ్చి తనకోసం వచ్చిన పిఆర్‌టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు వి.సంతోష్‌కుమార్, ఆయా మండలాల నాయకులు జనార్దన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, రఘుపాల్, యల్గార్ శ్రీనివాస్, రఘుపాల్ తదితరులను కలసి తన గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయులు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు.
వకీల్‌ను సన్మానించిన ఎమ్మెల్సీ ‘కాటేపల్లి’
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తనకు మెజార్టీ వచ్చేలా విస్తృతంగా పర్యటించి ప్రచారం సాగించిన పిఆర్‌టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు వకీల్ సంతోష్‌కుమార్‌ను ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డిలు ఘనంగా సత్కరించారు. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని రెడ్‌రోస్ గార్డెన్స్‌లో జరిగిన కార్యక్రమంలో వారు వకీల్ సంతోష్‌కుమార్‌ను సన్మానించి ఉపాధ్యాయ సమస్యలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి చట్టసభల్లో తాము చేపటట్టాల్సిన చర్యల గురించి వివరించాలని సూచించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తాము అవిశ్రాంతంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.