మహబూబ్‌నగర్

బాల్య వివాహాలను అరికట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మల్దకల్, ఏప్రిల్ 13: బడిబయట పిల్లలను చేర్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, గ్రామాలలో బడిఈడు పిల్లలను గుర్తించి వారికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆర్‌జెడి కృష్ణారావు అన్నారు. గురువారం మండల పరిధిలోని అమరవాయి, పాల్వాయి గ్రామాలలో జరిగిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్యవివాహాలను అరికట్టాలని, 18 ఏళ్లు నిండిన తర్వాత పెళ్లి చేయాలన్నారు. చిన్న తనంలో పెళ్లిలు చేస్తే అనేక రకాల ఆనారోగ్యాలకు గురవుతారని, ఒక్క వేళ పెళ్లి చేస్తే చట్టరీత్యా నేరమని అని తెలిపారు. జోగుళాంబ గద్వాల జిల్లా అక్షరాస్యతలో వెనుకబడిఉందని, పిల్లలను పనిలోకి పంపడం వల్ల మనం అన్నింటిలో వెనుకబడియున్నామన్నారు. పిల్లలను పనిలో కాకుండా బడిలో చేర్పించాలని సూచించారు.ప్రభుత్వం పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తుందని, విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, ఉచిత యూనిఫాం, మధ్యాహ్న భోజనం, డిజిటల్ తరగతులు అనేక రకాల వౌలిక వసతులు కల్పిస్తున్నాయని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించి భవిష్యత్‌కు పునాదులు వేయాగలరని అన్నారు. 14 సంవత్సరాలోపు బాలలను బడిలో ఉండాలని వారికి ప్రత్యేక శ్రద్ద వహించి వారిని చదవడం, రాయడం నేర్పాలన్నారు. గ్రామాలలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రోజే గ్రామాలు అభివృద్ది వైపు పయణిస్తాయని, అందుకు బాలల తల్లిదండ్రులు, ప్రతి ఒక్కరు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో మనం సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తామని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విధ్య అందించే బాధ్యత ఉపాధ్యాయులదని, క్రమం తప్పకుండా విధులకు హాజరుకావాలని, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పోటి పడాలని ఉపాద్యాయులుకు సూచించారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతుల బోధన ప్రారంభమైందని అన్నారు. గ్రామ సర్పంచు విజయలక్ష్మీ మాట్లాడుతూ ప్రభుత్వపాఠశాలలో మరుగుదొడ్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో తాగునీరు సౌఖర్యం కల్పించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం బడిబాట కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో ఎంపిటిసి అలివేలమ్మ, జిహెచ్‌ఎంలు బిఎస్ రవి, శ్రీనివాసులు, ప్రైమరి స్కూల్‌హెచ్‌ఎం విజయలక్ష్మి, ఉపాధ్యాయులు ప్రసన్నకుమార్, శ్రీనివాసరెడ్డి, మల్లప్ప, రత్నమాల, జానకమ్మ, అరుణరాణి, ఈరమ్మ, సిఆర్‌పి పద్మమ్మ, అంగన్‌వాడీ టీచర్లు తిమ్మప్ప, పద్మ, ఆశావర్కర్లు శంకరమ్మ, సుధారాణి, శేషమ్మ, విఆర్‌ఓ గోపాల్, జగన్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆర్‌జెడి ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి బడిబయటి పిల్లలను ఎంత మందిని గుర్తించారని ఉపాధ్యాయులను, అంగన్‌వాడీ టీచర్లను అడిగి తెలుసుకున్నారు.