మహబూబ్‌నగర్

మనస్తాపంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 16: ఇంటర్మీడియట్ పరీక్షలో తప్పిపోయాననే మనస్థాపంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. నాగర్‌కర్నూల్ ఎస్సై పురుషోత్తం కథనం ప్రకారం నాగర్‌కర్నూల్ మండల పరిధిలోని గుడిపల్లి గ్రామానికి చెందిన జయశీల(17) అనే విద్యార్థిని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. నాగర్‌కర్నూల్ పట్టణంలోని విజేత కళశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ బైపిసి చదువుతున్న జయశీల పరీక్షలో తప్పిపోవడంతో ఆదివారం గ్రామ సమీపంలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.
దేశ విచ్ఛిన్నతకే మత రిజర్వేషన్లు
అమిత్‌షా వచ్చి ప్రకటన చేస్తే అరెస్ట్ చేసే ధైర్యం కెసిఆర్‌కు ఉందా? * ఇంద్రసేనారెడ్డి
కొత్తకోట, ఏప్రిల్ 16: గతంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేశారని, ఇప్పుడు కేసిఆర్ మత పరమైన రిజర్వేషన్ ప్రకటిస్తు దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు పన్నుతున్నారని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఇంద్రసేనా రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా మతపరమైన రిజర్వేషన్‌లపై అభిప్రాయ సేకరణకు వెళ్తుతున్న ఇంద్రసేనా రెడ్డితో పాటు జిల్లా బిజెపి అధ్యక్షులు అయ్యగారి ప్రభాకర్ రెడ్డి, రావుల రవీంద్రనాధ్ రెడ్డి, రాజవర్ధన్ రెడ్డితో మరో 150 మంది బిజెపి కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఇంద్రసేనా రెడ్డి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతు దేశంలో ప్రధాని నరేంద్రమోది చేపడుతున్న సంక్షేమ పథకాలు పేదలకు, రైతులకు నేరుగా అందుతున్నాయని, కేసిఆర్ ఇచ్చిన హామీలను మరిచారని, దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడు ఎకరాలు భూపంపిణీ, విద్యార్థులకు స్కాలర్‌షిప్, రెండు పడకల గది ఇవ్వడంలో విఫలమయ్యారని అన్నారు. కెసిఆర్‌కు భయం పట్టే సర్వే చేయిస్తున్నారని, ఓట్ల కోసం హామీ ఇచ్చి, ఇప్పుడు విస్మరించారని, ఎస్టీలకు ప్రత్యేక గ్రామపంచాయతీలుగా చేస్తామని, ఆ హామి ఆమలుకు నోచుకోలేదని ఆయన అన్నారు. మతపరమైన రిజర్వేషన్‌లను సుప్రీం కోర్టు, కేంద్రప్రభుత్వం అడ్డుకుంటుందని సాకు చూపించాడానికే ఇలా మైనార్టీలను మోసం చేస్తున్నారని, మతపరమైన రిజర్వేషన్ ద్వార విద్యార్థులు కోటా కోసం మతం మార్చుకుంటారని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో టిర్‌ఎస్‌ను మట్టికరిపిస్తామని, అందుకు కెసిఆర్‌కు భయం పుట్టుకొని ఎమ్మెల్యేలు ఎక్కడ జారిపోకుండ సర్వేలు చేయిస్తున్నారన్నారు. సిఎం కెసిఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని, మత పరమైన రిజర్వేషన్లపై గ్రామస్థాయిలో ప్రజలకు వివరిస్తామని ఆయన అన్నారు. అమిత్‌షా వచ్చి హైద్రాబాద్ నడిబొడ్డులో మతపరమైన రిజర్వేషన్లపై ప్రకటన చేస్తే అరెస్ట్ చేసే ధైర్యం ఉందా అని ఆయన సవాలు విసిరారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచిస్తే కెసిఆర్ మరో రాజ్యాంగాన్ని రచించడంకోసం చూస్తున్నారన్నారు. అంతకు ముందు బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ శాంతియుతంగా మతపరమైన రిజర్వేషన్లపై ఓటింగ్‌ను నిర్వహిస్తే అరెస్ట్‌లు చేయడం సరిదని, కెసిఆర్ ఉద్యమం చేసినపుడు అరెస్ట్ చేసి ఉంటే తెలంగాణ వచ్చి ఉండేదా అని ప్రశ్నించారు. బిజెపి రాష్ట్ర నాయకులు రావుల రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ కోదండరామును అరెస్ట్ చేసినప్పుడు ఆయన కార్యకర్తలు లేకపోవచ్చుకాని బిజెపిలో కార్యకర్తలకు కొదవలేదని అన్నారు. అక్రమ అరెస్ట్‌లతో మత పరమైన రిజర్వేషన్లను ప్రవేశపెట్టాలనుకున్న కెసిఆర్‌కు తగిన రీతిలో బుద్ది చెబుతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు వెంకట్ రెడ్డి, సాయిరాం, దామోదర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అయ్యన్న, నరెందర్ గౌడ్, మురళి, నరెందర్ నాయుడు, మాధవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మత రిజర్వేన్లపై బిజెపి ఆందోళన
* జిల్లా వ్యాప్తంగా నిరసనలు, నేతల అరెస్టులు * కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 16: రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లకు కల్పిస్తూ అసెంబ్లీలో అమోదం తెలపడంతో అందుకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా ఆదివారం బిజెపి నాయకులు ఆందళోన కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని మండలాల్లో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా బిజెపి శ్రేణులు రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండే బిజెపి నాయకుల ఇళ్ల దగ్గరే పోలీసులు హడావిడిగా ముందస్తు అరెస్టులకు దిగారు. దాంతో పోలీసులకు, బిజెపి నాయకుల మధ్య తోపులాట, వాగ్వాదం లాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలను సైతం దగ్ధం చేశారు. టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలో మత పరమైన రిజర్వేషన్లు తెచ్చి ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరలేపారని ఆరోపించారు. అదేవిధంగా నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలో సైతం బిజెపి నాయకులు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో బిజెపి నాయకుల ఆందోళన ఉద్రికత్తతలకు దారి తీసింది. ఇళ్ల దగ్గరకు వెళ్లి బిజెపి నాయకులను ముందస్తు అరెస్టులు చేయడంతో ఆ పార్టీ నాయకులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన బిజెపి నాయకులు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సిఎం దిష్టిబొమ్మను కాల్చేందుకు బిజెపి నాయకులు చేస్తుండడంతో పోలీసులు అడ్డుకు ప్రయత్నం చేశారు. అయినప్పటికినీ బిజెపి నాయకులు సిఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం హైదరాబాద్, రాయిచూర్ వెళ్లే ప్రధాన రహదారిపై కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. అంతేకాకుండా రాస్తారోకో చేపట్టడంతో పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రాస్తారోకో చేస్తున్న బిజెవైఎం నాయకులను పోలీసులు బలవంతంగా రోడ్డుపై నుండి బయటకు ఈడ్చుకెళ్తూ అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు, బిజేవైఎం నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. పోలీసులు బిజెపి నాయకులను బలవంతగా అరెస్టు చేసి పట్టణంలోని వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ బిసిలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మతపరమైన రిజర్వేషన్లు తెచ్చి రాజకీయంగా లబ్ధిపొందాలని కెసిఆర్ భావిస్తున్నారని ఆరోపించారు. 12 శాతం ముస్లిలంకు రిజర్వేషన్లు కల్పించడం అంటే రాజ్యాంగానికి కెసిఆర్ వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆరోపించారు. ఇది వరకే గత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో తీసుకువచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్లపైనే కోర్టులు మొట్టికాయాలు వేసిందని ఆ విషయం తెలిసి కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించడం విచారకరమని అన్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బిజెపి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటుందని అన్నారు. ఇళ్లపై పడి ప్రభుత్వం బిజెపి నాయకులను దౌర్జన్యంగా అరెస్టు చేయడం సిఎం ఆహాంకారానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతిరెడ్డి, పాండురంగారెడ్డి, శోభనాదేవి, అంజయ్య, రాజు, తదితరులు పాల్గొన్నారు.