మహబూబ్‌నగర్

కూలీపనులు చేసిన ఎంపి, ఎమ్మెల్యేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టూన్, ఏప్రిల్ 20: హైదరాబాద్‌లో ఈ నెల 22న నిర్వహించే టిఆర్‌ఎస్ ప్లీనరి, 27న వరంగత్‌లో నిర్వహించే టి ఆర్ ఎస్ బహిరంగసభల కోసం స్థానిక ఎంపి జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌లు కూలీ పనులు చేసి రూ.6.16లక్షలు నిధులు సమకుర్చారు. ఎంపి, ఎమ్మెల్యేలు సింధూ హోటల్‌లో టీ, టీఫిన్‌లు విక్రయించగా రూ.1.16లక్షలను హోటల్ యజమాన్యం కూలీ డబ్బులను వారికి అందించారు. అలాగే ఎస్ వి ఎస్ ఆసుపత్రి ఆవరణలో పరిసరాలను శుభ్రం చేయగా ఆసుపత్రి యజమాన్యం రూ.5లక్షలను కూలీ కింద అందించడం జరిగింది. పార్టీలోని ప్రజాప్రతినిధులంతా కూలీపనులు చేసి ప్లీనరి, బహిరంగసభల నిర్వహణ కోసం నిధులు సమకూర్చుతుండడంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎంపి, ఎమ్మెల్యేలు కూడా కూలీపనులు చేసి నిధులను సమకూర్చారు. ప్లీనరి, బహిరంగసభల్లో టిఆర్‌ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.