మహబూబ్‌నగర్

సారా రహిత రాష్ట్రంగా తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, ఏప్రిల్ 20: తెలంగాణ రాష్ట్రాన్ని జూన్ 2వ తేది నుండి సారా రహిత రాష్ట్రంగా ప్రభుత్వం ప్రకటించనునందని వనపర్తి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్‌కుమార్ తెలిపారు. గురువారం ఆత్మకూరు పట్టణంలోని ఎక్సైజ్ సర్కీల్ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఇప్పటికే వనపర్తి జిల్లాలో నాటుసారాను పూర్తిగా అరికట్టగలిగామని జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ సారా బట్టిలు ఏర్పాటు చేస్తున్నట్లుగా తమ దృష్టికి వస్తుందని ఆయన తెలిపారు. అందులో భాగంగానే గురువారం మదనాపురం మండలంలోని కొన్నూరు గ్రామంలో గిరిజన తండాల్లో దాడులు నిర్వహించి సారా బట్టీలను ధ్వంసం చేసి, ఐదు లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నల్లబెల్లాన్ని విక్రయించకూడదంటూ ప్రభుత్వం ఆదేశాలు చేసినప్పటికి కొన్నూరు గ్రామంలో వెంకటస్వామి అక్రమంగా బెల్లాన్ని విక్రయిస్తుండడంతో కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ జయరాం, ఎస్‌ఐ గోపాల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం
* రాష్ట్ర బిజెపి కోశాధికారి శాంతికుమార్
మహబూబ్‌నగర్‌టౌన్, ఏప్రిల్ 20: ముస్లింలకు మతం పేరుతో 12శాతం రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగవిరుద్దమని బిజెపి రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ అన్నారు. గురువారం బిజెపి ఆద్వర్యంలో ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అర్బన్ తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12శాతం రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని బిజెపి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. మత రిజర్వేషన్లు రాజ్యాంగ విర్దుదమని న్యాయస్థానతీర్పులకు వ్యతిరేకంగా ఉందని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో కల్పించిన నాలుగుశాతం మత రిజర్వేషన్ వ్యవహరం ప్రస్తుతం సుప్రీం కోర్టు పరిధిలో ఉందని ఈ తీర్పు వెలువడకముందే తెలంగాణ ప్రభుత్వం 12శాతం రిజర్వేషన్లకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్రమోది ఇచ్చిన సబ్‌కాసత్ సబ్‌కావికాస్ నినాదాన్ని బిజెపి ఎల్లప్పుడు కట్టుబడి ఉంటుందని కులమతాలకు అతీయితంగా దేశ ప్రజలందరు ఒకేజాతి ఒకే సమైక్య వ్యవస్థను పరిరక్షించాల్సిన అవసరం ఎంతైన ఉందని అన్నారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, పట్టణ అధ్యక్షుడు పాండురంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, ఉపాద్యక్షులు పడాకుల సత్యం, కృష్ణవర్థన్‌రెడ్డి, అసెంబ్లీ ఇంచార్జి అంజయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.