మహబూబ్‌నగర్

కన్నులపండువగా సామూహిక వివాహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 20: ఎంజెఆర్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో స్ధానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గురువారం నిర్వహించిన సామూహిక వివాహామహోత్సవంలో శ్రీశ్రీశ్రీ శ్రీత్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో పలువురు రాష్ట్ర మంత్రులు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిలతోపాటు జిల్లా కలెక్టర్, పలువురు శాసనసభ్యుల సమక్షంలో 135 జంటలు ఏకమయ్యాయి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ప్రత్యేకంగా ఏర్పాటు దశవతార మండపములో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు ఇచ్చిన ప్రదర్శనలు చూపరులను ఎంతో ఆకట్టుకున్నాయి. మూడు రోజుల పాటు నిర్వహించిన సామూహిక వివాహామహోత్సవంలో మూడోరోజు నిర్వహించిన సామూహిక వివాహాలకు రాష్ట్ర మంత్రులు హరీష్‌రావు, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎంపి జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆలె వేంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, గువ్వల బాలరాజు, ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ మంత్రి రాములు, మాజి ఎంపి మందా జగన్నాథ్‌తోపాటు జిల్లా కలెక్టర్ శ్రీ్ధర్ తదితరులు పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సామూహిక వివాహామహోత్సవం ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందో వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎంజెఆర్ ట్రస్టు డైరక్టర్ జక్కా రఘునందన్‌రెడ్డి, మర్రి వెంకట్‌రెడ్డి, మర్రి జమున తదితరులు నూతన వధువరులకు కావలసిన వస్తువులను అందించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు నియోజకవర్గం నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇది ఇలా ఉండగా ప్రభుత్వం చేపట్టిన కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్ మైనార్టీ జంటలకు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో చెక్కులను అందచేయడం జరుగుతుందని మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. సామూహిక వివాహామహోత్సవం ఘనంగా నిర్వహించిన ఎంజెఆర్ చారిటబుల్ ట్రస్టు చైర్మన్, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి తదితరులను మంత్రులతోసహా పలువురు అభినందించారు. అంతకుముందు తిరుమల నుంచి వచ్చిన కళ్యాణ చక్రవర్తితోపాటు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ్మాస్వామి దేవాస్థానం నుంచి ఆలయ ప్రత్యేకాధికారి గీత ఆధ్వర్యంలో వచ్చిన ఆగమనశాస్త్ర పండితులు శ్రీలక్ష్మీనరసింహ్మాస్వామి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు.

అభివృద్ధి సంక్షేమ పథకాలను ఉపయోగించుకోవడానికి...
అవగాహన క్యాంప్‌లు: కలెక్టర్

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 20: మహబూబ్‌నగర్ జిల్లాలో 5వేల నుండి 6వేల మందికి సాంఘీక దురాచారాలు, చదువును మధ్యలోనే ఆపేసిన తిరిగి బడిలో చేర్పించడం, గ్రామాల్లో నూరుశాతం మరుగుదొడ్లు ఉపయోగించుకోవడం, మూఢనమ్మకం, పరిసరాల పరిశుభ్రత శిక్షణ కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తామని జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ అన్నారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలను ఉపయోగించుకోవడానికి అవగాహన క్యాంపులను మండలానికి 9 గ్రామపంచాయతీలను గుర్తించి జిల్లాలో 234 గ్రామపంచాయతీల్లో యువతి, యువకులకు అవగాహన కార్యక్రమం, గ్రూప్‌చర్చలు, గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేస్తామని అలాగే గొడపత్రికను ప్రారంబిస్తామని, మండల స్థాయిలో ఉన్న గ్రూప్‌వారికి మొబైల్ ఫోన్ సౌకర్యం ఏర్పాటు చేస్తామని వారికి వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవడానికి ఉపయోగించుకోవాలని, 15,16 సంవతర్సాలు గల యువతి, యువకులు స్కిల్ డెవలప్‌మెంట్‌పై శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. ప్రతి మండలంలో వర్క్‌షాప్ ఏర్పాటు చేయడంతో పాటు తహశీల్దార్, ఎంపిడిఓ, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు కలిసి గ్రామపంచాయతీలలో శానిటేషన్, గ్రీనరి, పరిసరాల పరిశుభ్రతపై ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారని తెలిపారు. లేబర్ డిపార్టుమెంట్ బాలకార్మికులను గుర్తించి వారిని విద్యాసంస్ధల్లో చేర్పించాల్సిన బాధ్యత లేబర్ డిపార్టుమెంట్‌పై ఉందని అన్నారు. ప్రతి నెలలో ఒకరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అడ్వజర్ అండ్ కమ్యూనికేటర్ స్పెషలిస్టు పర్సూన్‌సెన్, జయబాదురి, విజయ్‌కుమార్, హెల్ప్ మోహన్‌రెడ్డి, ఎస్‌వికె లక్ష్మణ్‌రావులు ఉన్నారు.