మహబూబ్‌నగర్

యల్ రన్‌తో దాహార్తి తీర్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 21: జిల్లాలో వేసి ఎండలు అధికంగా ఉన్నందున తాగునీటి ఎద్దడిని అదిగమించడానికి పనులు పూర్తి అయిన సెగ్మెంట్లలో సంబందిత ప్రజాప్రతినిధులను బాగస్వామ్యం చేస్తూ ట్రయల్ రన్‌ను ఏర్పాటు చేసి ప్రజల దాహర్తిని తీర్చాలని జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ సంబందిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హన్వాడ, ధన్వాడ, నారాయణపేటకు తాగునీటి పైప్‌లైన్ పూర్తి అయిన వాటిని ఎమ్మెల్యేతో మాట్లాడి ట్రయల్ రన్ చేసేందుకు తేదిలను నిర్ణయించాలని సంబందిత అధికారులను సూచించారు. పనులలో జియో ట్యాకింగ్ చేయాలని అన్నారు. ప్రతి గ్రామపంచాయతీలలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని అన్నారు. చిన్న చిన్న రిపేర్లు ఉంటే వెంటనే యుద్ద ప్రతిపాదికన పూర్తి చేయాలని అన్నారు. ప్రతి ఏఇ రోజువారి నివేదికలను వాట్సప్‌లో పెట్టాలని తెలిపారు. రాంకొండ నీటి ప్రాజెక్టు నుండి నీరు విడుదలకు సంబందించిన పనులు వేగవంతం చేయాలని అన్నారు. హన్వాడ, కోయిలకోండ సెగ్మెంట్లలో పనులు చేయాలని అన్నారు. నీటి సమస్య ఉన్న మండలాలలో సంబందిత అధికారులు ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకుని ప్రజలకు ప్రతి రోజు తాగునీరు అందేవిధంగా చూడాలని అన్నారు. ఇన్‌డియూజువల్ ఓపెన్ హెడ్ ట్యాంకులకు కనెక్షన్లను ట్రయల్ రన్ చేసిన తర్వాత ఇచ్చేవిధంగా చూడాలని సంబందిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ గౌతం, ఆర్‌డబ్ల్యూఎస్ డిఈ శ్రీనివాస్, సంబందిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.