మహబూబ్‌నగర్

వరంగల్ సభకు తరలిన ఎమ్మెల్యే చిట్టెం, నాయకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, ఏప్రిల్ 26: ఈనెల 27న వరంగల్ జిల్లాలో జరుపతలపెట్టిన టిఆర్‌ఎస్ 16వ ఆవీర్భావ సభకు మంగళవారం రాత్రి మక్తల్ కేంద్రంగా ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి సారథ్యంలో కార్యకర్తలు ట్రాక్టర్లపై బయలు దేరారు. ఈనేపథ్యంలో భాగంగా ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి రైతుబిడ్డగా ట్రాక్టర్ నడుపుతుండగా, ఆయన సతీమణీ చిట్టెం సుచరిత టిఆర్‌ఎస్ జెండా ఊపి ప్రారంభించారు. అంతకు ముందు ఎమ్మెల్యే దంపతులిద్దరు స్థానిక శ్రీపడమటి ఆంజనేయస్వామి దేవాలయంతోపాటు శ్రీనల్లజానమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి వరంగల్ ట్రాక్టర్ యాత్ర ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా విజయవంతంగా కొనసాగాలని వేడుకున్నారు. నియోజకవర్గం నుండి దాదాపు వందకుపైగా ట్రాక్టర్లు వెళుతున్నట్లు వారు తెలిపారు. ఓరుగల్లుకు బయలు దేరినవారిలో మార్కెట్ చైర్మన్ నర్సింహగౌడ్, రవిశంకర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, గోవర్థన్‌రెడ్డి, కావలి శ్రీహరి, రహీంపటేల్, మహిపాల్‌రెడ్డి, రాజేష్‌గౌడ్, సూర్యప్రకాష్, నర్సింహరెడ్డి తదితరులు బయలుదేరి వెళ్లారు.
వరంగల్‌కు ఎమ్మెల్యే ఆల కుటుంబం
దేవరకద్ర, ఏప్రిల్ 26: తెలంగాణ రాష్ట్ర సమితి 16వ ఆవిర్భావ దినోత్సవం గురువారం వరంగల్‌లో నిర్వహించే సభకు మండల టిఆర్‌ఎస్ నాయకులు ట్రాక్టర్లలో తరలివెళ్లారు. బుధవారం ఉదయం 9గంటలకు ట్రాక్టర్ ర్యాలీని ఎంపిపి ఇవి గోపాల్ జెండా ఊపి ప్రారంభించారు. దేవరకద్ర మండల కేంద్రం నుండి 26 ట్రాక్టర్లలో తరలివెళ్లారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కుటుంబసభ్యులు దేవరకద్ర నుండి తరలివెళ్లారు.
సభకు ‘పేట’ శ్రేణులు
నారాయణపేటటౌన్, ఏప్రిల్ 26: తెలంగాణ రాష్ట్ర సమితి 16వ వార్షికోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రగతి మహాసభలో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రం నారాయణపేట నియోజకవర్గం నుండి 200వందల పైచిలుకు ట్రాక్టర్లలో బయలుదేరిన టిఆర్‌ఎస్ శ్రేణులు మధ్యాహ్నం భువనగిరిలో భోజనాలు ముగించుకుని సాయంత్రం బయలుదేరి రాత్రికి మడికొండలో బసచేయనున్నారు. తిరిగి గురువారం ఉదయం వరంగల్‌కు బయలుదేరి పార్టీ బహిరంగసభలో పాల్గొని రాత్రికి తిరుగు పయనం కానున్నారు. ఈ సభకు నారాయణపేట నియోజకవర్గం నుండి టిఆర్‌ఎస్ నాయకులు డాక్టర్ పి.నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బండి వేణుగోపాల్, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మహ్మద్‌గౌస్, నాయకులు మోదీపూర్ రవి, రవీందర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, గోటూరు నాగేశ్వర్‌రెడ్డి, హన్మిరెడ్డి, శ్రీపాద్ తదితరులు తరలివెళ్లారు.