మహబూబ్‌నగర్

టిబి రహిత జిల్లాగా కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 28: భారత ప్రధానమంత్రి టిబి, హెచ్‌ఐవి పాజిటివ్ వంటి కేసుల నిర్మూలన కోసం దేశంలో 100 జిల్లాలను గుర్తించడం జరిగిందని జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పర్యటించి టిబి రోగులను గుర్తించడం, సరైన పరీక్షలు నిర్వహించడం లేదని మా దృష్టికి వచ్చిందని సంబంధిత పిహెచ్‌సి డాక్టర్ల పరిధిలోని టిబి రోగులను ఆశా వర్కర్ల ద్వారా గుర్తించి వారికి కావల్సిన మెరుగైన వైద్యం అందేవిధంగా చూడాల్సిన బాధ్యత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులపై ఉందని అన్నారు. టిబి రోగానికి సంబంధించిన ల్యాబ్ రిపోర్టు తప్పుగా ఉన్నట్లు అయితే కఠిన చర్యలు తప్పవని అన్నారు. బాధ్యతాయుతంగా పనిచేయాలని తెలిపారు. పిహెచ్‌సిలో ప్రతి వారం హాజరుకావాలని తెలిపారు. మెడికల్ అధికారి పర్యవేక్షణలో టిబి రోగులను అత్యవసర కేసులుగా గుర్తించి సేవాలందించాలని ఆయన అన్నారు. భారత ప్రధానమంత్రి ప్రగతిరివ్యూ కింద మూడు నెలలకోసారి సమీక్షలు చేస్తున్నందున మన జిల్లా నుండి తప్పుడు నివేదికలు వెళ్లకుండా, వారికి కావల్సిన పరీక్షలన్నీ చేయాలని అన్నారు. లింకేజ్, కెపాసిటి రోగులకు సంబంధించిన రికార్డులను తయారు చేయాలని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందున 2030వ సంవత్సరం వరకు ప్రపంచంలో టిబి రోగం పూర్తిగా నిర్మూలన చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నందున దానిలో భాగంగా మన వంతు బాధ్యతగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని సంబంధిత అధికారులు బాధ్యతగా విధులు నిర్వహించిన టిబి రహిత జిల్లాగా మారడానికి బాధ్యతగా పనిచేయాలని ఆయన అన్నారు. స్టేట్ టిబి కంట్రోల్ ప్రోగ్రామ్ ద్వారా వీడియో ప్రొజెక్టర్ ద్వారా అవగాహన , వ్యాధి నిర్మూలనలో రోగులు తీసుకోవల్సిన బాధ్యతలు, అధికారులు చేపట్టాల్సిన చర్యలపై సవివరంగా వీడియో ప్రదర్శన నిర్వహించడం జరిగింది. దినిని అధికారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంఅండ్‌హెచ్‌ఓ శ్రీనివాసులు, స్టేట్ టిబి అధికారులు, జిల్లా టిబి అధికారి శ్రీనివాస్‌రెడ్డి, పిహెచ్‌సి వైద్యులు, ల్యాబ్ టెన్నిషియన్లు, సంబందిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.