మహబూబ్‌నగర్

డబుల్ బెడ్‌రూంలు పూర్తిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్, ఏప్రిల్ 29: మహబూబ్‌నగర్ పట్టణంలోని క్రిష్టియన్‌పల్లిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లను రాబోయే పదిహేను ఇ రవై రోజుల్లో పూర్తిస్థాయిలో నిర్మించి అప్పగించాల్సిందిగా సంబందిత అధికారులను, కాంట్రాక్టర్‌ను జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ ఆదేశించారు. శనివారం క్రిష్టియన్‌పల్లిలోని డబుల్ బెడ్‌రూం ఇళ్‌ల పురోగతిని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి కలెక్టర్ సందర్శించి వీటిపురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబందిత ఇంజనీర్లు ఏ రోజుకారోజు పనుల పురోగతిపై ఒక రిపోర్టు తయారుచేసి ప్రతిరోజు సమర్పించాలని ఆదేశించారు. మిగిలు న్న పనులను రాబోయే రోజులకు ఒక్క పక్కా ప్రణాళిక తయారు చేసుకుని రోజురోజు సమీక్షిస్తూ పదిహేను రోజుల్లో పూర్తిచేసి ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడానికి సిద్దం చేయాలని అన్నా రు. క్రిష్టియన్‌పల్లిలో నిర్మిస్తున్న 310 ఇళ్లకుగాను 16 మాత్రమే ఇప్పటివరకు పూర్గి నిర్మాణం చేశారని, 197 ఇళ్లు 90శాతం పూర్తి అయ్యాయని, మిగిలిన వాటిపై కూడా ప్య్రేక శ్రద్ద పెట్టి పూర్తి చేయాలని అన్నారు. ప్లాస్టరింగ్, ఫ్లోరింగ్, ప్లంబింగ్ పనులు, రోడ్లు, కలర్ పేయింటింగ్, ఎలక్ట్రికల్ వంటి అన్ని పనులను పూర్తిచేసి ఇరవై రోజుల్లో తమకు అప్పగించాలని అ న్నారు. అందుకు ఎటువంటి ఇబ్బందులున్నా తమ దృష్టికి తీసుకువస్తే వాటిని నివారణ చేస్తామని జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ అన్నారు. ఈ పనులను పర్యవేక్షిస్తున్న అధికారులకు క్రిష్టియన్‌పల్లిలోనే నిర్మాణం పూర్తి చేసుకున్న ఒక ఇంటిలోనే కార్యాల యం తాత్కాలికంగా ఏర్పాటు చేసి రాత్రింభవళ్లు పనిచేస్తేనా నిర్మాణం పూర్తిచేయాలని కోరారు. అవసరమైన మేరకు అదనంగా పనివారిని ఏర్పాటు చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ప్రతి ఇంటి ఆవరణలో ఒక ఇ ంకుడు గుంతను ఏర్పాటు చేసి వాననీరు, వాడకపునీరు అందులోకి వెళ్లేలా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. త్వరలో ముఖ్యమంత్రి మహబూబ్‌నగర్‌లోని మెడికల్ కళాశాలను, బైపాస్‌రోడ్డును, డబుల్ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించేందుకు రానున్నారని, ఈ పనులను యుద్దప్రతిపాదికన పూర్తి చేసేలా చూస్తున్నామని కలెక్టర్ అన్నారు. ఈ విషయంలో ఎటువంటి తాత్సారం జరిగినా నిర్లక్ష్యం వహించినా సహించేదిలేదని హెచ్చరించారు. త్వరలో మళ్లీమళ్లీ పనుల పురోగతిని సమీక్షించడానికి ఎమ్మెల్యేతో కలిసి పర్యటిస్తానని అన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఏనుగొండనుండి పాలమూరు యూనివర్సిటి వరకు నిర్మించుకున్న బైపాస్‌రోడ్డుపనులపై కూడా ఆర్‌అండ్‌బి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి బైపాస్ రోడ్డు పనులకు సంబందించిన అన్ని అడ్డంకులను నివృత్తి చేసి పనుల ప్రారంభానికి సిద్దంగా ఉండాలని కోరారు. అవసరమైన మేర ప్లాన్‌లో ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే వెంటనే తనతో సంప్రదించి పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, హౌజింగ్ పిడి రమణరావు, ఆర్‌అండ్‌బి అధికారులు, ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.