మహబూబ్‌నగర్

దివాలుకోరుతనానికి కెసిఆర్ నిదర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, ఏప్రిల్ 29: ఏలటోడు సక్కగుంటే రాష్ట్రం సక్కగుంటది, పండించిన పంటను అమ్మడానికి మార్కెట్‌కు తీసుకువస్తే గిట్టుబాటు ధర కల్పించకుండా, వ్యవసాయ మార్కెట్‌లో 144 సెక్షన్ విధించడం రాష్ట్ర ప్రభుత్వ దివాలుకోరుతనానికి నిదర్శనమని గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ అన్నారు. శనివారం గద్వాల పట్టణం డికె సత్యారెడ్డి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతులు మిర్చి అమ్మడానికి వస్తే వారికి గిట్టుబాటు ధర కల్పించకుండా, ప్రతి రైతుకు అర్థమయేరీతిలోరైతు సమస్యలకు పరిష్కారం చూపమంటే, ప్రభుత్వాని ప్రతి పక్షాలు బెదిరిస్తున్నాయని, రెచ్చ గొడుతున్నాయని ప్రతి పక్షాలపై ఏడువడం కాదు ప్రభుత్వం చేతకాక ప్రతి పక్షాలపై ఏడుస్తున్నాయని ఆమె మండిపడ్డారు. రైతులు దృష్టిని మరల్చడానికే వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఎకరాకు రూ.4వేలు ఇస్తాననడం, ప్రస్తుత పరిస్థితిలో రైతు సమస్కలను పరిష్కరించలేకపోయాయని రైతులకు భరోసా ఇవ్వలేక ప్రతిపక్షాలపై ఏడువడం సిగుగా ఉందన్నారు. పక్క రాష్ట్ర ప్రభుత్వం మిర్చిపై రూ.1500 భోనస్ ఇచ్చి రైతులను ఆదుకుంటుందన్నారు. కాని మన రాష్ట్ర ప్రభుత్వం సాధ్యంకాని హామీలు ఇచ్చి రైతులను నట్టేట ముంచుతుందని పేర్కొన్నారు. గత సంవత్సరం అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోని ప్రభుత్వమన్నారు. కరువు కాటకాల వల్ల పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాలేక పెట్టిన పెట్టుబడులు రాక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3వేల మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటే నేటికి ఆ కుటుంబాలను ఆదుకోక కేవలం మాటలతోనే రైతులను మభ్యపెడుతున్నారే కాని రైతన్నల బాధలు తీర్చి రైతులకు భరోసా ఇవ్వని ప్రభుత్వం అని అన్నారు. తెరాస ఆవిర్భావదినోత్సవ సందర్భంగా వరంగల్‌లో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభకు ఎంతో దూరం నుండి ఎండకు రైతులను తీసుకెళ్లడం బాధకరమని, ఏమి ప్రగతి సాధించారని ఈ సభలను నిర్వహించారని నిలదీశారు. ఓ రైతు తన వ్యవసాయ పనుల నిమిత్తం 25కిలోమీటర్లు దాటితే కేసులు బనాయించే పోలీసులు, సుమారు 350 కిమి దూరం పోతుంటే చూస్తూ ఊరుకోవడం సిగ్గుచేటన్నారు. వరంగల్ సభ వారం రోజుల ముందే దినపత్రికలలో డబ్బాకొట్టుకున్నారని, అటువంటి సభకు రైతులు రాకపోవడంతో సభ ఫెయిల్ అయిందని ఎద్దేవా చేశారు. ఎన్నో ఏళ్ల ఘన చరిత్రగల ఉద్యమాల పురిటి గడ్డ తెలంగాణ ఉద్యమానికే పురిటి పోసిన ఉస్మానియా యూనివర్శిటిలో శతాబ్ది ఉత్సవాలు జరుగుతుంటే గౌరవ హోదాలో ఉన్న ముఖ్యమంత్రి ఒక్క మాట మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. గతంలోనే కాంగ్రేస్ పార్టి వాళ్లు జీవో 123 రద్దుచేసి జీవో2013 ప్రకారం రైతులకు భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవమని చెప్పిన కూడా జీవోలు సవరించక చట్టం వెనక్కు రావడం భూములు కోల్పోయిన రైతులు నష్టపరిహారం అందక ఆందోళన చెందుతున్నారని వాపోయారు. ఈ రోజు ప్రత్యేక సమావేశాలు పెట్టి చట్టాన్ని సవరించే బదులు రైతుల ఆందోళనలను, రైతు సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దిగివచ్చి రైతులకు భరోసా కల్పించిన తరువాతే శాసన సభలో చట్ట సవరణలు గురించి చర్చిస్తామని అన్నారు. ప్రభుత్వం మాటల, మాయల ప్రభుత్వమని, రైతు సమస్యలను పరిష్కరించే దిశగా ఏ మాత్రం కార్యచరణ ప్రకటించకపోవడం, రైతు సంక్షేమం కోసం ఎలాంటి కార్యచరణ ప్రకటించకపోవడం సిగ్గు చేటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డుచైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు బంగి సుదర్శన్, కాంగ్రెస్ నాయకులు బండల వెంకట్రాములు, రామాంజనేయులు, డిటిడిసి నర్సింహా, ఇసాక్, తదితరులు పాల్గొన్నారు.