మహబూబ్‌నగర్

కృషి, దీక్షకు మారుపేరు భగీరథుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, మే 2: కృషి, దీక్ష, పట్టుదలకు మారుపేరుగా భగీరథుడు నిలిచాడని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా సగర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన భగీరథ మహార్షి జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతక ముందు కొత్తకోట రోడ్డులో ఉన్న భగీరథ మహార్షి విగ్రహానికి ఆయన పూలమాల వేసి అక్కడి నుండి ర్యాలీగా దాచా లక్ష్మయ్య ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. భగీరథ వంశంలో పుట్టిన సగరులు కూడా కార్యదీక్ష పరులని అన్నారు. భగీరథ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా జరిపేందుకు తనవంతు సహకారం అందిస్తానన్నారు. వనపర్తి పట్టణంలో సగర కమ్యూనిటీ హాల్‌కు స్థలాన్ని సేకరిస్తే ఎలాగైనా రూ.20లక్షల ప్రభుత్వం తరపున మంజూరు చేయిస్తానని హామి ఇచ్చారు. భవన నిర్మాణ రంగంలో పని చేస్తున్న సగర కులస్తులకు ఇతర గీత, చేనేత, మత్య్సకారుల మాదిరిగా భీమా వర్థింపజేసేలా ప్రయత్నిస్తానని అన్నారు. భగీరథుడు దివి నుండి భూవికి గంగను తీసుకవచ్చి గంగాజలాలను మనకందించాడని, ఆ కాలంలో పుట్టిన సగరులు కూడా భాగా కష్టపడి పని చేయాలని పిల్లలను బాగా చదివించుకోవాలని ఆయన కోరారు. వనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ జి.చిన్నారెడ్డి కూడా భగీరథ మహార్షి విగ్రహానికి పూలమాలలు వేసి సమావేశంలో పాల్గొన్నారు. సగర కులస్తుల చరిత్ర ఎంతో గొప్పదని భగీరథుడు శ్రీరామచంద్ర మూర్తి వంటి ఎందరో మహానీయులు సగర, ఇక్ష్వాకా వంశీస్తులన్ని అన్నారు. భగీరథుని ఆదర్శంగా తీసుకొని సగర విద్యార్థులను ఇంజనీర్లుగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు. జిల్లాలో సగరుల సంక్షేమానికి తనవంతు సహాకారం ఎప్పుడు ఉంటుందని అన్నారు. ఈ జయంతి ఉత్సవాలకు జిల్లా సగర సంఘం అధ్యక్షులు తిరుపతయ్య సాగర్ అధ్యక్షత వహించారు. రాష్ట్ర సగర సంఘం అధ్యక్షులు చిలుక సత్యంసాగర్, విశ్రాంత ఎం ఇ ఓ చంద్రయ్య, కౌన్సిలర్ లోక్‌నాథ్‌రెడ్డి, నాయకులు వెంకట్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, ఎబిజె సత్యంసాగర్, ఉప సర్పంచు జనార్ధన్ తదితరులు ప్రసంగించారు. అంతక ముందు సగర సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి మర్రికుంటలోని భగీరథ విగ్రహానికి కొత్తకోట రోడ్డులోని భగీరథ విగ్రహానికి పూలమాలలు వేశారు. జిల్లా ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేసి అన్నదానం చేశారు.