మహబూబ్‌నగర్

పోలీసుల పనితీరు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మే 9: శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పనితీరు భేష్‌గా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి కితాబు ఇచ్చారు. మంగళవారం జడ్చర్ల పోలీస్ స్టేషన్‌ను ఆధునీకరిస్తూ నూతనంగా నిర్మించిన భవనాన్ని ఆయన ప్రారంభించారు. అదేవిధంగా సిసి కెమెరాల కంట్రోల్ రూంను ప్రారంబించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసుల పనితీరు భేష్‌గా ఉందని నేరాలు అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు తూ.చా తప్పకుండా పోలీసు సిబ్బంది కఠినంగా వ్యవహరిస్తుండడంతో రాష్ట్రంలో రోజురోజుకు నేరాల సంఖ్య తగ్గుతుందని తెలిపారు. ముఖ్యంగా ప్రెండ్లీ పోలిసింగ్ విధానంతో ప్రజల సహకారం పోలీసులకు వందశాతం అందుతుందని దాంతో గ్రామాల్లో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలిగిన వెంటనే నేరగాళ్లను పోలీసులు పట్టుకోవడానికి వీలు పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు పూర్తి స్వేచ్చను ఇచ్చిందని దాంతో పోలీసులు తమ పనితాము చేసుకుంటూ నేరాలు ఆరికట్టడంలో సఫలికృతం అవుతున్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలను ఆరికట్టడడానికి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అందుకు గాను ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రణాళికలు రూపొందించుకుంటే బాగుంటుందని సూచించారు. జిల్లాలో మూడు జాతీయ రహదారులు ఉన్నందున రహదారులపై ప్రమాదాలు జరుగుతున్నాయని అందులో చనిపోయినవారితో పాటు అవిటివారిగా అయిన కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని వారి బాధ వర్ణానాతీతం అవుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువకులకు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయన్నారు. గత ఉమ్మడి రాష్ట్రంలో పోలీస్‌స్టేషన్లకు నిధులు ఇచ్చే దాఖలాలు లేవని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతి పోలీస్ స్టేషన్‌కు ప్రతినెల రూ.25వేల మెయిన్‌టెన్స్ ఖర్చు కింద ప్రభుత్వం నిధులు ఇస్తుందన్నారు. దింతో అవినీతి కూడా తగ్గిందన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్ ఆధునీకరించేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని అందుకు కూడా ప్రత్యేకంగా నిధులు ఇస్తుందన్నారు. జడ్చర్ల పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌ను ఆధునీకరించడమే కాకుండా సిసి కెమెరాలను ఏర్పాటు చేసి కంట్రోల్ రూం నుండే అంతా పరిశీలించేవిధంగా టెక్నాలజీ రావడంతో మరింత నేరాలు తగ్గడానికి అస్కారం ఉంటుందన్నారు. ప్రెండ్లీ పోలిసింగ్ విధానంతో మరింత ముందుకు వెళ్తే మంచి ఫలితాలు సాదించవచ్చారు. ఎస్పీ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ జిల్లాలోని ప్రధాన పట్టణాల్లోని పోలీస్‌స్టేషన్లను ముందుగా ఆధునీకరిస్తున్నామని విడతల వారిగా అన్ని పోలీస్‌స్టేషన్లను ఆధునీకరిస్తామన్నారు. ఒక్క సిసి కెమెరా వంద మంది పోలీసులతో సమానమని ప్రధాన పట్టణాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలీస్‌స్టేషన్ల నుండే మానిటరింగ్ జరుగుతుందని ఆమె వెల్లడించారు. పోలీసులకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ భాస్కర్, సిఐ, ఎస్సై, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

గ్రామస్థాయి నుండే ఆదరణ పెంచుకోవాలి
* పోలీసులకు చిత్తశుద్ధి, క్రమశిక్షణే ప్రాధాన్యం * శాంతి భద్రతల పరిరక్షణ
విషయంలో రాజీపడొద్దు * హైదరాబాద్ రిజియన్ ఐజిపి స్టీఫెన్ రవీంద్ర

మహబూబ్‌నగర్, మే 9: గ్రామస్థాయి నుండి పోలీసు వ్యవస్థకు ఉన్న ఆదరణను పెంచుకోవడంలో పోలీసు అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని హైదరాబాద్ రీజియన్ ఐజిపి స్టీఫెన్ రవీంద్ర అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీతో పాటు డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశంలో ఐజిపి స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ అత్యంత పరిణితి కలిగిన అధికారి జిల్లాకు నేతృత్వం వహిస్తున్న తరుణంలో సిబ్బంది వృత్తిపరమైన అంశాలను మెరుగుపెట్టుకోవాలని సూచించారు. జిల్లాలోని పోలీసు అధికారులు సిబ్బంది కష్టపడుతున్నందుకే పోలీసుశాఖకు చక్కటి విజయాలు అందుతున్నాయని తెలిపారు. అదే సందర్భంలో ప్రజా అవసరాలకు, ఆలోచనలకు తగ్గట్టుగా నడుచుకోవల్సిన అవసరాన్ని అధికారులకు నొక్కి చెప్పారు. పోలీసు అధికారులు విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే తగు చర్యలు తప్పవని, పోలీసులు విధులపై నిర్లక్ష్యం వహిస్తే ఆ ప్రభావం సమాజంపై పడుతుందని, నేరగాళ్లకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందన్నారు. నేరగాళ్లను ఎప్పటికప్పుడు ఉక్కుపాదంతో తొక్కిపెట్టాలని జిల్లాలో నేరాల సంఖ్య తగ్గడానికి వ్యూహత్మకమైన ప్రణాళిక రచించుకుని ముందుకు వెళ్లాలన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. ఖాకీ దుస్తులు తొడిగినప్పుడే త్యాగాలకు సిద్ధం కావాలని, శిక్షణ సమయంలోనే త్యాగం అంటే ఏమిటో నేర్చుకున్నారని తెలిపారు. జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి మంచి ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్నారని అభినందించారు. కృష్ణా పుష్కరాలు మొదలుకుని వివిధ రకాల బందోబస్తుల్లో విజయం సాధించారన్నారు. విధుల పట్ల చూపుతున్న శ్రద్ధ అభినందనీయమన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రత్యేకతను ఆ ప్రాంతాల్లో శాంతిభద్రత పరంగా ఆయా ప్రాంతాల ప్రాధాన్యతను బట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సమస్యాత్మకమైన ప్రాంతాల్లో సిసి కెమెరాలతో నిఘా పెట్టి వాటిని పోలీస్ స్టేషన్ల నుండే కంప్యూటర్ చిత్రకరణ ద్వారా విశే్లషించాలని నేరనిరోధన, పరిశోధన అంశాలు పోలీసుశాఖకు అత్యంత అవసరమన్నారు. పోలీస్ స్టేషన్ల ఆధునీకరణ, ప్రజాసంబంధాలు సామాజిక సమస్యలైన బాల్యవివాహాలు, అంటరానితనం, జోగిని వ్యవస్థలపై పోలీసులు తీసుకుంటున్న చర్యలను అభినందించారు. జిల్లాలో బాల్యవివాహాలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ సమాజంలో చైతన్యం తీసుకురావడం సంతోషించదగ్గ విషయమన్నారు. తరచూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయాలని దాంతో ప్రజల ప్రాణాలు కాపాడిన వారిమవుతామని ముందుగా గ్రామగ్రామాన డ్రంక్ అండ్ డ్రైవ్‌పై అవగాహన కల్పించడమే కాకుండా చట్టాలపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. షీటీంలను మరింత పెంచాలని ఇప్పటికే మహబూబ్‌నగర్ జిల్లాలో షీటీం వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తుందని అకతాయిలకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా పిల్లల పట్ల వారు చేస్తున్న వ్యవహారాలను తెలియజేయడం వారి జీవితంలో మార్పు వచ్చేవిధంగా జిల్లా పోలీసు యంత్రాంగం చేసే కృషి అభినందనీయమన్నారు. ప్రధాన రహదారుల వెంట ముమ్మర తనిఖీలు చేయాలని దాంతో డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడపకుండా నిరోధించడానికి వీలు పడుతుందన్నారు. కొన్ని సందర్భాల్లో ఒత్తిడులు వచ్చిన లొంగకూడదని విధులపట్ల ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటే సమాజంలో మంచి మార్పులు వస్తాయన్నారు. ఈ సమావేశంలో శిక్షణ ఐపిఎస్ అధికారిణి చేతన, డిఎస్పీలు భాస్కర్, శ్రీనివాస్‌రెడ్డి, మురళీమనోహర్, సాయికుమార్, పోలీసు పిఆర్‌ఓ రంగినేని మన్మోహన్, సిఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

ఆదిశిలా క్షేత్రంలో జిల్లా జడ్జి
మల్దకల్, మే 9: గద్వాలజిల్లా మక్తల్ మండలం ఆదిశిలా క్షేత్రంలో వెలసిన శ్రీ స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వరస్వామిని మంగళవారం జిల్లా జడ్జి ఈశ్వరయ్య కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జడ్జి దంపతులను ఆలయ మర్యాదలతో చైర్మన్ ప్రహ్లాదరావు, అర్చకులు మధుసూదనచార్యులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పూజారులు జడ్జి దంపతులకు స్వామివారి విశిష్టతను వివరించి శేవవస్త్రాలు, తీర్థప్రసాదాలు సమర్పించి ఘనంగా సన్మానించారు. వారి వెంట పలువురు న్యాయవాదులు ఉన్నారు.

భాధ్యతలు స్వీకరించిన కమిషనర్
-కార్యాలయం వైపు కనె్నత్తి చూడని పాలకపక్ష సభ్యులు
- న్యాయస్థానానికి వెళ్లేందుకు బిజెపి సిద్ధం?
నారాయణపేటటౌన్, మే 9: నారాయణపేట మున్సిపల్ కమిషనర్‌గా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు గత శుక్రవారం భాధ్యతలు చేపట్టిన కమిషనర్ గోపాల్ మంగళవారం తన భాధ్యతలు నిర్వర్తించారు. కాగా గత శుక్రవారం భాధ్యతలు చేపట్టిన వెంటనే గందరగోళం సృష్టించిన వైస్ చైర్మన్ నందునామాజీ సహా పాలకపక్ష కౌన్సిలర్లు మంగళవారం కార్యాలయం వైపు కనె్నత్తి చూడకపోవడం విశేషం. మంగళవారం కార్యాలయంలోని అన్నీ శాఖల సిబ్బందితో ఆయన ప్రత్యేకంగా సమావేశమై కార్యాలయ పనితీరును మెరుగుపరచాలని సూచించారు. పనుల పట్ల నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే ఏర్పాట్లు చేయాలని కార్యాలయ సిబ్బందికి సూచించారు. అయితే గత శుక్రవారం కమిషనర్‌గా మెప్మా పిడి గోపాల్ భాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇక్కడి నుండి తక్షణం వెళ్లిపోవాలని సూచించిన మున్సిపల్ వైస్ చైర్మన్ నందునామాజీ, పాలకపక్ష కౌన్సిలర్లు కార్యాలయం వైపు కనె్నత్తి చూడలేదు. కాగా వైస్ చైర్మన్ నందునామాజీ మాత్రం కమిషనర్ గోపాల్‌తో మీరు ముందుగా సిడిఎంఎ నుండి ఇన్‌చార్జి భాధ్యతలు తీసుకువచ్చి కమిషనర్‌గా విధులు నిర్వహించాలని ఫోన్లో కోరగా దానికి తాను కలెక్టర్ ఆదేశాల మేరకు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నానని తన విధులకు ఆటంకం కలిగించవద్దని కమిషనర్ బదులిచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి వైస్ చైర్మన్ నందునామాజీ తాము సిడిఎంఎతో మాట్లాడుతామని త్వరలోనే మున్సిపల్ మేనేజర్ గంగాధర్‌కు ఇన్‌చార్జి కమిషనర్‌గా భాధ్యతలు ఇప్పించేలా మరోమారు ఉత్తర్వులు తీసుకువస్తామని విలేఖరులకు తెలిపారు. పాలకవర్గం పనిచేస్తుండగా పాలకవర్గాన్ని బర్తరఫ్ చేయకుండా కలెక్టర్ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీనిపై న్యాయపోరాటానికి తాము సిద్ధమన్నారు.

కెఎల్‌ఐ ప్రాజెక్టు ద్వారా ప్రతి గ్రామానికీ..
సాగు, తాగునీరు అందించాలి
* కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి హర్షవర్ధన్ రెడ్డి
పెద్దకొత్తపల్లి, మే 9: కెఎల్‌ఐ ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి సాగు, తాగునీరు అందించాలని కొల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జీ బీరం హర్షవర్దన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా చేశారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ కెఎల్‌ఐ ప్రాజెక్టును నిర్వీర్యం చేసేందుకే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఇక్కడి రైతాంగం వలసలు వెళ్లేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదన్నారు.
కెఎల్‌ఐ ప్రాజెక్టుకు అన్యాయం జరగకుండా రైతులతో కలిసి పోరాటం చేస్తానని అన్నారు. యాపట్ల గ్రామం సమీపంలో ఉన్న బల్పాలగండిని రిజర్వాయర్‌గా చేసి చుట్టుపక్కల గ్రామాలకు సాగునీరు అందించాలన్నారు. కెఎల్‌ఐ ప్రాజెక్టుకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశ్యంతో గ్రీన్ కోర్టులో పిటిషన్ వేసినట్లు తెలిపారు. ప్రభుత్వం తెలంగాణ వాదం పేరుతో కుట్ర పన్నుతూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపొతల పథకం ద్వారా ఉన్న నీళ్లన్నీ ఇతర ప్రాంతాలకు తరలించేందుకు కమీషన్లకు కక్కుర్తి పడి ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలని ప్రవేశపెడుతూ లబ్దిదారులకు పూర్తిస్థాయిలో అందకుండా అన్యాయం చేస్తుందన్నారు. ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలలో అన్యాయం జరగకుండా రైతులతో పోరాటాలు చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. దాదాపు గంటసేపు రాస్తారోకో చేయడంతో రోడ్డుకు ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతోపాటు ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎస్సై నర్సింహ్మారావు ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నాయకుల వద్దకు చేరుకొని వారి సర్దిచెప్పి కార్యక్రమాన్ని విరమింపచేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి తహశిల్దార్‌కు వినతిపత్రాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గణేష్‌రావు, రాంలాల్‌నాయక్, జంబులయ్య, గాలియాదవ్, కాశన్న, శ్రీనివాసులు, అరవిందు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

సభ్యత్వాలను ప్రారంభించిన చిన్నారెడ్డి
వనపర్తి, మే 9: వనపర్తి పట్టణంలోని 1వ వార్డులోగల రాయిగడ్డలో మంగళవారం వనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ జి.చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్దంగా నిర్వహించే ఎన్నికల్లో భాగంగా ముందుగా పార్టీ సభ్యత్వాలను చేస్తామని అనంతరం వార్డు, గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఎన్నికలు నిర్వహించి పార్టీ నాయకులను ఎన్నుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. అందులో భాగంగానే పట్టణంలోని 26 వార్డుల్లో మంగళవారం సభ్యత్వాలను అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సభ్యత్వాలను ఇవ్వడంతో పాటు ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. వీలైనంత వరకు సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించారు. మిగిలిన సమస్యలను కూడా వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. కార్యకర్తలు, నాయకులు ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని వారి పరిధిలో పరిష్కారం కానీ సమస్యలను తన దృష్టికి తెస్తే పరిష్కరిస్తామన్నారు. అప్పటికి సమస్యలు పరిష్కరం కాకపోతే ఉద్యమాల ద్వారానైనా సమస్యలను పరిష్కరించాలని ఆయన సూచించారు. వార్డుల్లో ఇంటింటికి తిరిగి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు సభ్యత్వాలను కూడా అందజేశారు. కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్న వారికి ఇన్సురెన్స్ సౌకర్యం, గుర్తింపు కార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శంకర్‌ప్రసాద్, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, కిరణ్‌కుమార్, నందిమల్ల చంద్రవౌలి, తిరుపతయ్య, రాగివేణు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
షార్ట్‌సర్క్యూట్‌తో పశుగ్రాసం దగ్ధం
వీపనగండ్ల, మే 9: విద్యుత్ షాట్ సర్య్కూట్‌తో నాలుగు గడ్డివాములు దగ్ధమైన సంఘటన మండల పరిధిలోని కల్వరాల గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గొంది బిచ్చారెడ్డి, గొంది యాదిరెడ్డిలకు చెందిన నాలుగు గడ్డివాములు విద్యుత్ షాట్ సర్య్కూట్‌తో దగ్ధమయ్యాయి. గడ్డివాముల పైనుంచి కరెంటు తీగలు ఉండడంతో గతంలో పలుసార్లు విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన అధికారుల నిర్లక్ష్యం కారణంగా కాలిపోయాయని బాధితులు వాపోయారు. గడ్డివాము దాదాపు రూ.2.50లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు.

తప్పని వలసలు
* కడుపు నింపని ఉపాధి పథకం
ధన్వాడ, మే 9: గ్రామాలలో ఉన్న కూలీలకు పనులు లేకపోవడంతో పట్టణాలకు వలసలు పోవల్సిన దుస్థితి మరికల్ మండలంలో నెలకొంది. మరికల్ మండలంలోని మధ్వార్ గ్రామంలో కూలీపనులు చేసుకోనే కూలీలు దాదాపు100నుండి 200లపైగా ఉంటారు. పనుల కోసం ఇళ్లకు తాళాలువేసి పోతున్నారు. గ్రామంలో ఉపాధిహమీ పనులతో కడుపులు కూడా నిండటంలేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసిన పనులకు ప్రభుత్వం రెండు నెలలకు ఒకసారి కూడా డబ్బులు ఇవ్వలేని దుస్థితి మరికల్ మండలంలో నెలకోంది. గ్రామంలో ఉన్న కూలీలు పనులకోసం హైదరాబాద్, ముంబాయి, మహారాష్టక్రు వెళ్లడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. కొందరు చిన్న పిల్లలను ఇంటి వద్దే పెట్టి పోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చక గ్రామాలలో ఉన్న కూలీలకు ఆదుకున్న దాఖలాలు లేవన్నారు. బంగారు తెలంగాణ అంటూ నాయకులు, ప్రజాప్రతినిధులు చెప్పడం తప్పా నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైన్నారని మధ్వార్ గ్రామస్థులు విమర్శిస్తున్నారు.
ఘనంగా చౌడేశ్వరిదేవి ఉత్సవాలు
పెబ్బేరు, మే 9: మండల పరిధిలోని సూగురు గ్రామంలో మంగళవారం చౌడేశ్వరిదేవి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈనెల 8 నుండి ప్రారంభమైన ఉత్సవాలు నేటితో ముగిసాయి. రాత్రి చౌడేశ్వరిదేవి ఆలయ ఆవరణలో జ్యోతులతో నృత్యాలు చేస్తూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని చౌడేశ్వరిదేవికి నైవేద్యాలు సమర్పించారు. ఈ ఉత్సవాలకు జిల్లా నుండే కాక ఆంధ్రప్రదేశ్ నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు హాజరై చౌడేశ్వరిదేవిని దర్శించుకున్నారు. ఈ ఉత్సవాలకు హాజరైన పెబ్బేరు మార్కెట్‌యార్డు ఛైర్మన్ గౌనిబుచ్చారెడ్డిని సర్పంచు రాజశేఖర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ ఉత్సవాలను 60 సంవత్సరాల క్రితం నిర్వహించినట్లు గ్రామపెద్దలు తెలిపారు. తిరిగి ఈ ఉత్సవాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీతార వెంకటేశ్వర్లు, ఎంపిటిసి నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.