మహబూబ్‌నగర్

బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మే 16: బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కురుమ, యాదవులకు గొర్రె పిల్లల పంపిణీ కార్యక్రమంపై ఒక రోజు అవగాహన సదస్సును ఎనుగొండ సమీపంలోని జెజెఆర్ గార్డెన్ పంక్షన్‌హాల్‌లో నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అథితిగా హాజరైన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అన్ని రకాలుగా బాగుపడాని ముఖ్యమంత్రి కెసిఆర్ అందరికి సమాన అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు. కుల వృత్తుల వారికి చేయూత నివ్వడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నారని అన్నారు. అందులో భాగంగా కురుమ, యాదవులకు గొర్రె పిల్లలను పంపిణీ చేసేందుకు నాలుగువేల కోట్ల నిధులు కేటాయించారని తెలిపారు. గత ప్రభుత్వాలలో ఏదైనా ఓ పథకం ప్రారంభమైందనంటే చాలు అందులో ముందుగా దళారులు వచ్చి చేరేవారని కానీ ప్రస్తుతం టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో మాత్రం నేరుగా లబ్ధిదారులకే పథకాలపై అవగాహన కల్పించి వారే నేరుగా ప్రభుత్వ అధికారులతో సంప్రదించి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 3.50 లక్షల మందికి గొర్రెల పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ప్రతి కుటుంబానికి 20 గొర్రె పిల్లలతో పాటు ఒక పొట్టేలును కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు.అదేవదంగా మత్సకారులకు సైతం వంద శాతం సబ్సీడిపై చేప పిల్లలను కూడా ఇప్పటికే గత ఏడాది వేలాది చెరువుల్లో లక్షలాది చేప పిల్లలను వదిలారని తెలిపారు. ఎన్నో ఏళ్ల తరబడి ఒక పది గొర్రె పిల్లల కోసం రుణాలు ఇవ్వాలని బ్యాంకుల చుట్టూ తిరిగినా వందమందిలో ఒకరికి రుణం లభించేదని కానీ ఆ కష్టాలు ముఖ్యమంత్రి కెసిఆర్ పుణ్యమా అంటూ గొర్రెకాపరులకు తీరిందని అన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. గ్రామాలలో కాంగ్రెస్, టిడిపి, బిజెపి నాయకులు వచ్చి ప్రభుత్వంపై విమర్శించే ప్రసంగాలు చేస్తే వారిని కురుమ యాదవులు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా కమ్యూనిస్టులు గొల చేస్తున్నారని పనికి మాలిన వ్యవహరాలను ముందుకు తెచ్చి ప్రజలకు ఉపయోగపడని అంశాలను ప్రజల మధ్యకు తీసుకువచ్చి తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతుంటే కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేక అవాకులు చేవకులు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచన విధానాలతోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని తెలిపారు. ఎంపి జింతేదర్‌రెడ్డి మాట్లాడుతూ సమాజంలో అసమానతలు లేని విధంగా ప్రజలు జీవించాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఇలాంటి పథకాలను తీసుకువస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్న పథకాలను వందశాతం సద్వినియోగం చేసుకుంటామని వాటిని ప్రజలకు అందేలా కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో కురుమయాదవులందరికి గొర్రె పిల్లల పంపిణీ చేయడం జరుగుతుందని ఇప్పటికే లబ్దిదారుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. పారదర్శకంగా ఈ ఎంపిక ఉంటుందని ప్రతి కుటుంమానికి వర్థింపజేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేశం, రాములు, వెంకటయ్య, రమేష్, చందుయాదవ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.