మహబూబ్‌నగర్

క్రీడలతో పేరుప్రతిష్టలను తీసుకురావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాంతినగర్, మే 16: క్రీడాకారులు క్రీడల్లో రాణించి పేరుప్రతిష్టలను తీసుకురావాలని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం వడ్డేపల్లి మండల కేంద్రమైన శాంతినగర్‌లో జోగుళాంబ గద్వాల జిల్లా పోలీసు వారి ఆధ్వర్యంలో తాలూకా స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను మంగళవారం ఎస్పీ విజయ్‌కుమార్ ప్రారంభించారు. అనంతరం మైదానంలో కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించారు. అనంతరం ఎస్పీ విజయ్‌కుమార్ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని క్రీడాకారులకు సూచించారు. క్రీడలు దేహదారుడ్యానికి ఎంతో దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో డిఎస్పీ బాలకోటి, సిఐ వెంకటేశ్వర్‌రావు, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు.

రైతులను విస్మరిస్తే పతనం తప్పదు
* బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృషా ణరెడ్డి
కల్వకుర్తి, మే 16: రైతులను విస్మరించిన ఏ ప్రభుత్వానికైన పతనం తప్పదని, తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ కుంటుంబ పాలనకు సైతం చరమగీతం పడనుందని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ధర్నాలు రాస్తారోకోలు ఉండవని చెప్పిన కెసిఆర్, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాక రైతులకు బేడీలు వేసిన ఘనత దక్కించుకున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలో స్వాతి గార్డెన్ పంక్షన్ హాలులో నిర్వహించిన బిజెపి జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని, స్థానిక ప్రజల ముసుగులో ఇందిరా పార్క్ వద్ద టిఆర్‌ఎస్ కార్యకర్తలను, పోలీసులను ప్రతిపక్షాలపై దాడికి పాల్పడే విధంగా ప్రొత్సహించడం దురదృష్టకరమని, దేశ చరిత్రలో లేని విధంగా రైతులను బేడీలతో కోర్టుకు హాజరు పర్చడం రాష్ట్ర ప్రభుత్వ పతానానికి పునాది అని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న 32 వేల పోలింగ్ బూతులను 8వేల మంది స్వచచ్ఛంద కార్యకర్తలతో బిజిపి కార్యక్రమాల గురించి బూత్ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అచారి మాట్లాడుతూ ఖరిఫ్ నాటికి కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సాగునీరు అందించాలని కాలువ వెడల్పు 20 మీటర్లకు తగ్గకుండా పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఖరిఫ్ నాటికి పనులు పూర్తి చేయకుంటే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. డిండి రిజర్వాయర్ నుండి కల్వకుర్తి నియోజకవర్గానికి 2 టిఎంసిల నీటిని అందించి మిగిలిన నీటిని ఎక్కడికైనా తరలించుకోవచ్చని ఆయన అన్నారు. మోదీ నాయకత్వంలో రాష్ట్రంలో ఏడు ప్రధాన జాతీయ రహాదారులను మంజూరు చేసిందని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడైన జానెడు రోడ్డు వేసిన దాఖాలాలు ఉన్నాయా అని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్ర ప్రజలను మాటల గారడితో పాలన కొనసాగిస్తున్నారని గతంలో పిట్టల దొర మాదిరిగా కెసిఆర్ పాలన ఉందని ఆయన అరోపించారు. విలేఖరుల సమావేశంలో రాష్ట్ర నాయకులు నరేందర్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గ ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు యెన్నం శేఖర్‌రెడ్డి, జిల్లా నాయకులు కాశన్న, నాయకులు కృష్ణయ్య, కృష్ణగౌడ్, శేఖర్‌రెడ్డి, రాఘవేంధర్‌గౌడ్, హన్మంత్, అబిలాష్‌రెడ్డి, సంతు తదితరులు ఉన్నారు.