మహబూబ్‌నగర్

కులవృత్తుల్లో రాజకీయాలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణపేటటౌన్, మే 16: కులవృత్తుల విషయంలో రాజకీయాలు వద్దని కురుమ, యాదవ కులాలు ఆరాధించే బీరప్ప, మల్లయ్య స్వామిలను ఆరాధించిన తరహాలోనే కుల వృత్తిని ఆరాదిద్దామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధకశాఖామాత్యులు తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గడ్డం పెంచుకుని ఎలాంటి ప్రేలాపనలు చేసినా ఫలితం శూన్యమన్నారు. జైలుకెళ్లి వచ్చిన దొంగలు సైతం చిన్నా, పెద్దా తేడా లేకుండా కనీసం వయసుకు గౌరవం ఇవ్వకుండా మాట్లాడటం వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు ఆయన పరోక్షంగా టిడిపి వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్‌రెడ్డికి చురకలు అంటించారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట పట్టణంలోని జిపి శెట్టి ఫంక్షన్‌హాల్‌లో జరిగిన గొర్రెల పంపిణీ పథకం అవగాహన సదస్సుకు ఆయనతో పాటు మంత్రులు డాక్టర్ లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపి ఎపి జితేందర్‌రెడ్డి, ప్రణాళికాసంఘం ఉపాధ్యాక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్.రాజేందర్‌రెడ్డి, చిట్టెం రాంమోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కురుమ, గొల్ల కులస్థులు సోదరుల్లాంటి వారని వారు కులవృత్తిని ప్రేమించిన తరహాలోనే ఒకరినొకరు ప్రేమించుకోవాలని సూచించారు. కురుమ, యాదవుల సంక్షేమానికి సిఎం కెసిఆర్ గొర్రెల పంపిణీ పథకాన్ని అమలు చేసి ఈ కులాలకు చెందిన కుటుంబాలకు మనసున్న మారాజుగా మారిపోయారన్నారు. గొర్రెల పంపిణీ పథకం క్రింద 18సంవత్సరాలు నిండిన ప్రతి గొర్రెల కాపరికి 1.25వేల విలువ చేసే 20గొర్రెలు, ఒక పోటేలును అందించి వాటి సంరక్షణకు ప్రభుత్వమే అన్నీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి ఒక సంచార పశువైద్యశాలను ఏర్పాటు చేయనున్నట్లు అందులో వైద్యుడితో పాటు కంపౌండర్, మందులను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. మొత్తం 84లక్షల యూనిట్లను మంజూరు చేయగా ఈ సంవత్సరం 42లక్షల యూనిట్లకు గొర్రెలను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. 1.25లక్షల రుణంలో 92250రూపాయలను ప్రభుత్వమే చెల్లిస్తుందని, మిగిలిన 32వేల 750రూపాయలను లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుందని, ఈ రుణానికి పావలావడ్డీని అమలు చేస్తున్నట్లు తెలిపారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు సిఎం కెసిఆర్ అహర్నిషలు కృషి చేస్తున్నారని ఇది సహించని విపక్షాలు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తే ప్రజలే వారికి గుణపాఠం నేర్పేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది పథకాలను అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటూ ప్రజలను మోసం చేయడం మానుకోవాలని లేనిచో తిరుగుబాటు తప్పదని తీవ్రస్వరంతో హెచ్చరించారు. రైతులకు తొమ్మిది గంటల నిరంతర విద్యుత్ అందిస్తున్నట్లు, 15వేల కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేసినట్లు తెలిపారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రతి పంటలకు నాలుగువేల సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. అయితే పిసిసి నేత తాము అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయలను మాఫీ చేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఈ సమావేశంలో గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, నారాయణపేట, మక్తల్ మార్కెట్ కమిటీ చైర్మన్లు బండి వేణుగోపాల్, నర్సింహాగౌడ్, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, నాయకులు శివకుమార్‌రెడ్డి, దేవరి మల్లప్ప, డాక్టర్ పి.నర్సింహారెడ్డి, నాగరాజ్ సరాఫ్, సబ్‌కలెక్టర్ కృష్ణాదిత్య, పశుసంవర్దకశాఖ సంచాలకులు డాక్టర్ డి.వెంకటేశ్వర్లు, జిల్లా వెటర్నరీ అధికారి డాక్టర్ దుర్గయ్య, డేయిరి శాఖ డిడి వి.మల్లికార్జునరావు, జిల్లా మత్య్సశాఖాధికారి ఖదీర్ అహ్మద్, డాక్టర్ ఎంకె సాయి, వెంకటేశ్, తహసిల్దారు పార్థసారథి, ఎంపిడిఓ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

అధికారులందరు సమష్టిగా పనిచేయాలి: ఎమ్మెల్యే చిట్టెం
ఊట్కూర్, మే 16 : ఊట్కూర్ మండలం అభివృద్ధి కోసం అధికారులు సమష్ట్టిగా పనిచేయాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి పద్మావతి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్యసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం రాంమోన్‌రెడ్డి మాట్లాడుతూ మండలంలోని గ్రామాల అభివృద్ధి కోసం మండల అధికారులు సమష్టిగా పనిచేయాలని అన్నారు. మండలంలోని బిజ్వార్, పెద్దజట్రం, నిలుగుర్తి, నిలుగుర్తితండ, పైనతాండ, తాగునీరు లేకపోవడంతో అర్‌డబ్ల్వుఎస్ అధికారులను తాగునీటి కోసం ట్యాంకర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. కోల్లుర్ ప్రధానోపాధ్యాయుడిని తొలగించాలని కొల్లుర్ ఎంపిటిసి నర్పిములు ఎమ్మెల్యే వినతిపత్రం అందజేశారు. మండలంలో ఇసుక అనుమతులు ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులు గురి చేస్తున్నారని గ్రామల్లో సిసి రోడ్లు, మరుగుదోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం అగిపోయిందని అయా గ్రామాల సర్పంచులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకోచ్చారు. అందుకు ఎమ్మెల్యే స్పందిస్తు తహశీల్దార్ నాగన్నకు మండల అభివృద్ధి కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వాలని సూచించారు. మండలంలోని అన్ని గ్రామాలలో మిషన్ కాకతీయ పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే అన్నారు. మండలంలోని ప్రతిగ్రామంలో కుర్వ కలస్తులకు అవగాహన కల్పించి అధికంగా ధరఖాస్తులు వచ్చేవిధంగా చేయాలని అధికారులను సూచించారు.కార్యక్రమంలో జడ్పిటిసి సూర్యప్రకాష్‌రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నారాయణరెడ్డి, తహశీల్దార్ నాగన్న, ఎంపిడిఓ రవికమార్, అయా శాఖల అధికారులు, అయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.