మహబూబ్‌నగర్

సాగు ఆరంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 13: తొలకరి పులకరించింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గత రెండు మూడు రోజుల నుండి ముసురుతో కూడిన వర్షంతో పాటు అక్కడక్కడ కొద్దిపాటి భారీ వర్షంమే కురిసింది. దాంతో రైతులు ఖరీప్ పంటల సాగుకు నాగలి పట్టారు. తమ పొలాల్లో వర్షాధార పంటలకు సంబందించిన విత్తనాలు విత్తుకునే పనిలో పడ్డారు. మృగశిర కార్తేలో వర్షాలు కురిస్తే ఈ కార్తేలో మెట్ట భూముల్లో విత్తిన విత్తనాలు మొలకెత్తడంతో పాటు కాలం కలిసివస్తే మంచిపంటలు దిగుబడి అవుతాయనే నమ్మకం రైతుల్లో ఉంది. దినిని దృష్టిలో ఉంచుకుని రైతులు వర్షాదార పంటలకు సంబందించిన మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, పత్తి, ఆముదం పంటలకు సంబందించిన విత్తనాలు విత్తుకుంటున్నారు. జిల్లాలో జల్లులు కురుస్తున్నందునా నాటి కష్టాలను వెంటాడుతున్నప్పటికిని అన్నింటిని దిగమింగుకుని రైతులు నాగలి పట్టారు. బోరుబావుల కింద వరిసాగుకు నారుమళ్లు సిద్దం చేసుకుంటున్నారు. వర్షాధార మెట్టపంటల సాగుకు పొలాలను సైతం సిద్దం చేసుకుంటున్నారు. కాగా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, గద్వాల, వనపర్తి జిల్లా కేంద్రాలతో పాటు వివిధ పట్టణాలలో విత్తనాల కోసం దుకాణాల ముందు రైతుల రద్ది కనబడుతుంది. కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, అలంపూర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, నారాయణపేట, మక్తల్, అచ్చంపేట తదితర ప్రాంతాలలో పత్తి విత్తనాల కోసం రైతుల ఎక్కువగా ఆసక్తి కనబరుస్తూ దుకాణాల ముందు సందడి చేస్తున్నారు. కంది విత్తనాలు సబ్సిడీపై సరిపోను అందుబాలో లేకపోవడంతో రైతులు ఇక్కట్లకు గురవుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వేలాది మంది రైతులు కర్ణాటక ప్రాంతాలకు వెళ్లి కంది విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. పక్కనే ఉన్న వికారాబాద్ జిల్లాకు వెళ్లి కంది విత్తనాలు కొనుగోలు చేసుకుంటున్నారు. దాంతో అధిట ధరకు విత్తనాలు లబిస్తుండడంతో రైతులకు ఆర్థిక భారం పడుతుంది. కొనుగోలు నుండి పంట అమ్ముకునే దాకా అడుగడుగునా దగా పడుతున్నప్పటికిని చిరు నవ్వుతో బాధను దిగమింగుకుని రెట్టింపు ఉత్సహంతో భవిష్యత్‌పై కొడంత నమ్మకంతో రైతన్న సాగుబాట పట్టాడు. గ్రామాలలో వ్యవసాగు జోరందుకుంది. దుక్కులు దున్నడం. విత్తనాలు కొనుగోలు చేయడం పొలాల్లో వేయడం వంటి పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే రైతులకు మాత్రం కష్టాలు తప్పడంలేదు.
అందుబాటులో లేని సబ్సిడీ విత్తనాలు
ఉమ్మడి జిల్లాలో వర్షాకాలంలో దాదాపు 3.10 లక్షల హెక్టార్లలో పంటలు సాగు అవుతాయని అధికారుల అంచనా. ఇందులో అత్యధికంగా పత్తి, కంది, మొక్కజొన్న, వరి పంటలు సాగు చేస్తారు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం అయినప్పటికిని రైతులకు మేలు రకపు వంగడాలను సబ్సిడీపై అందించేందుకు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. జిల్లాలో సరసారి లక్ష హెక్టార్లలో కంది సాగు అవుతుందని అంచనా వేస్తే అందుకుగాను దాదాపు 6200లకు పైగా మెట్రిక్ టన్నుల విత్తనాలు అవసరం అవుతాయి. అయితే వ్యవసాయశాఖ 33 శాతం సబ్సిడీపై కేవలం 150 టన్నులకు పైచీలుకు విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉంచింది. దాంతో రైతులు అనివార్యంగా పాత విత్తనాలు వేయడం లేదంటే సమీపంలోని కర్ణాటకలో గల రాయచూర్, పక్కనే ఉన్న వికారాబాద్ జిల్లాలోని తాండూరు నుంచి విత్తనాలు సేకరించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వరిసాగుకు సంబందించి 3750 టన్నుల విత్తనాలు అవసరం ఉంటే సబ్సిడీపై కేవలం 1200 టన్నులు మాత్రమే అందుబాటులో ఉంచింది. మొక్కజొన్న దాదాపు 1250 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటే కేవలం 420 మెట్రిక్ టన్నులను మాత్రమే అందుబాటులో ఉంచారు. సబ్సిడీ విత్తనాలు అరకొరగా ఉండడంతో రైతులు తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్, నాణ్యతలేని విత్తనాల దుకాణాల్లో కొనుగోలు చేస్తూ నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. కాగా పెట్టుబడులకోసం ప్రైవేట్ అప్పుల వైపు రైతులు పరుగులు తీస్తున్నారు. బ్యాంకర్లు రైతులకు ఈ ఏడాది ఖరీఫ్‌కు రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి కనబరచడంలేదు. రుణమాఫీ పథకం నాలుగు విడతలుగా ప్రభుత్వం విడుదల చేయడంతో ఆ డబ్బు ప్రస్తుతం వడ్డిలకు సరిపోను కొంత అసలకు ఉపయోగం పడింది. కానీ ప్రస్తుతం రుణాలకు వెళ్తే బ్యాంకర్లు మాత్రం పాత రుణం చెల్లించి కొత్తరుణాలు తీసుకోవాలని మెలికలు పెడుతున్నారు. దాంతో రైతులు అయోమయానికి గురి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అప్పులు తీసుకువచ్చి పెట్టుబడులకు ఉపయోగించుకుంటున్నారు. ఏదిఏమైనప్పటికిని ఈ వర్షాకాలం ప్రారంభం కావడం దాంతో రైతులు సాగుపై దృష్టి పెట్టడం వంటి పనుల్లో బిజీగా ఉన్నారు.
అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలి
* టిజెఎసి జిల్లా చైర్మన్ రాజేందర్ రెడ్డి

మహబూబ్‌నగర్, జూన్ 13: తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని టిజెఎసి జిల్లా చైర్మన్ రాజేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో టిజెఎసి ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల కుటుంబాలతో కలిసి టిఎన్జీఓ భవనం నుండి తెలంగాణ అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల నేతలు, తెలంగాణ ఇంటి పార్టీ నాయకులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాల సభ్యులు, తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లిన వారు పాల్గొన్నారు. ఆర్‌అండ్‌బి అతిథి గృహం ఆవరణలో గల తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా టిజెఎసి చైర్మన్ రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం తమ ప్రాణాలనే పణంగా పెట్టిన అమరవీరుల కుటుంబాలను మంత్రులు, ఎమ్మెల్యేలు అవమానిస్తున్నారని ఆరోపించారు. మహబూబ్‌నగర్ పట్టణంలో ఇటీవల నూతనంగా ఆవిష్కరించిన తెలంగాణ అమరవీరుల స్థూపం ఆవిష్కరణ సందర్భంగా అవరవీరుల కుటుంబ సభ్యులకు ఆహ్వనించకపోవడం దారుణం అని మండిపడ్డారు. జిల్లా జెఎసి నాయకులు, ప్రజా సంఘాలు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను అవమానించే విధంగా కార్యక్రమం చేపటడం బాధాకరమని అన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావుకు స్థూపం ఆవిష్కరించిన సమయంలో అమరవీరుల కుటుంబాలు గుర్తుకు రాలేదా అన్ని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో తెలంగాణ ఉద్యమంలో మొత్తం 32 మంది చనిపోయిన్నట్లు ఉద్యమంలో చెప్పుకున్నామని వారి అంతిమయాత్రలకు సైతం వచ్చి నివాళ్లు అర్పించిన నాయకులు ఇప్పుడు అధికారంలో ఉండి వారి కుటుంబాలను పట్టించుకోవడంలేదన్నారు. అయితే అందులో 20 మందికి మాత్రం ప్రభుత్వ పరంగా ఆర్థిక సహయం అందిందని మిగతా వారి గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇతరాత్ర కార్యక్రమాలకు వేల కోట్లు వృద్ధా చేస్తున్న ప్రభుత్వం మిగతా అమరవీరుల కుటుంబాలను సైతం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షలు, ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఉద్యమ సమయంలో టిఆర్‌ఎస్ నాయకులు తెలంగాణలో పనె్నండు వందల మంది చనిపోయారని తమ ప్రసంగాలో మాట్లాడిన నాయకులు అధికారంలోకి వచ్చాక మాత్రం కేవలం నాలుగువందలు మాత్రమే అంటున్నారని ఇంత దౌర్భాగ్యం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్థూపం ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిందా లేకా ప్రైవేట్ వ్యక్తులు ఖర్చుతో ఏర్పాటు చేసిందా అనే విషయాన్ని జిల్లా కలెక్టర్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి జిల్లా కేంద్రంలో ప్రభుత్వమే అమరవీరుల స్థూపాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన స్థూపంపై జిల్లా అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఉద్యమకారుల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు రామకృష్ణారావు, చంద్రనాయక్, బాలకిషన్, ప్రభాకరాచారి, శంకర్, శ్రీ్ధర్‌గౌడ్, మంత్రి నరసింహ్మా, సాయి, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

నేడు గద్వాలకు కేంద్ర, ఆర్థిక సహాయ మంత్రి అర్జున్‌రావు రాక
* సబ్‌కాసాథ్, సబ్‌కా వికాస్ సమ్మేళనం
* మూడేళ్ల అభివృద్ధిపై, కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే
* ఎన్‌టిపిసి జనరల్ మేనేజర్, నోడల్ ఆఫీసర్ జయరాం రెడ్డి
గద్వాల, జూన్ 11: కేంద్ర ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాలన మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి జిల్లా కేంద్రంలో సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్టు ఎన్‌టిపిసి జనరల్ మేనేజర్, నోడల్ ఆఫీసర్ జయరాంరెడ్డి అన్నారు. మంగళవారం గద్వాల పట్టణంలోని ఎంకెఎస్ ఫంక్షన్ హాలులో ఆయన విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. బుధవారం పట్టణంలోని ఎంకెఎస్ ఫంక్షన్ హాలులో సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ సమ్మేళనం ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ సమ్మేళనానికి కేంద్ర, ఆర్థిక సహాయ మంత్రి అర్జున్‌రావు ముఖ్యఅతిథిగా హాజరు కానున్నట్టు ఆయన తెలిపారు. ఎన్‌టిపిసి దేశంలో అతిపెద్ద విద్యుత్ సంస్థ అని, ఇప్పటి వరకు 51 వేల మెగా వాట్ల విద్యుత్‌ను దేశానికి అందించిందన్నారు. సమ్మేళనంలో మోడీ చేసిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు. నరేంద్రమోడీ సాధించిన విజయాలపై సమావేశంలో కేంద్ర నాయకులు మాట్లాడతారని తెలిపారు. అనంతరం హైదరాబాద్ డిప్యూటీ మాజీ మేయర్ సుభాష్‌చందర్‌జి మాట్లాడుతూ సమ్మేళనానికి బిజెపి నాయకులు, ప్రముఖులు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఎన్‌టిపిసి డిప్యూటీ మేనేజర్ ఆల్‌బర్త్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, నాయకులు అప్సర్‌పాష, రాజశేఖర్‌రెడ్డి, జగన్నాథం, తదితరులు పాల్గొన్నారు.

సమాజం ఎదుగుదలకు సిటిజన్ ఫోరం
* మహబూబ్‌నగర్ జిల్లా జైలర్ సుధాకర్ రెడ్డి
మక్తల్, జూన్ 13: సమాజం ఎదుగుదలకు పైలెట్ ప్రాజెక్టుగా సిటిజన్ ఫోరం సంస్థను ఏర్పాటు చేయబడిందని మహబూబ్‌నగర్ జిల్లా జైలర్ సుధాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మక్తల్‌లోని ఎంపిపి కార్యాలయంలో మాజీ ఎంపిటిసి కోళ్ల వెంకటేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిటిజన్ ఫోరమ్ పైలెట్ ప్రాజెక్టు సంస్థ సమావేశానికి జిల్లా జైలర్ సుధాకర్‌రెడ్డి, రామకృష్ణ సేవాసమితి సభ్యులు రాజమల్లేష్, రిటైడ్ తహశీల్దార్ గంగాధర్, సిటిజన్ ఫోరమ్ సభ్యులు సుభాషిన్‌రెడ్డి, నాగభూషణం, డిసిఎంఎస్ చైర్మన్ నిజాంపాష, జెడ్పిటిసి వాకిటి శ్రీహరిలు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యాలను సమావేశానికి హాజరైన సభ్యులకు జైలర్ సుధాకర్‌రెడ్డి వివరించారు. 2001 సంవత్సరంలో ఐపిఎస్ వినయ్‌కుమార్‌సింగ్ సిటిజన్ ఫోరమ్‌ను ఒక పైలెట్ ప్రాజెక్టుగా అనంతపురంలో స్థాపించడం జరిగిందని తెలిపారు. ఇది ఒక ప్రభుత్వేతర సంస్థ కాదని, ఇది ఒకే భావజాలం కల ఒక సాంఘిక ఉద్యమ, ప్రజల సమూహిక అభిప్రాయానికి ఒక వేధిక అని జైలర్ తెలిపారు. 70 సంవత్సరాల స్వసంత్య్ర అనంతరం ప్రపంచ జనాభాలో 30 శాతం జనాభగల భారతదేశ ప్రజలు అకలి, నిరక్షరాస్యత, వైద్య సదుపాయాలు అందక, సరైన వౌలిక వసతులలేమితో సతమత మవుతున్నారని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు. ప్రజల సహకారం లేకుండా ఏప్రభుత్వాలు కూడా ఏలాంటి ప్రగతిని సాధించలేరని అన్నారు. ప్రస్తుతం కొన్ని సంస్థలైన క్లబ్‌లు, ప్రభుత్వేతర సంస్థలు, సామాజిక సంస్థలు అనేక రకాలుగా సమాజిక సేవ చేస్తున్నప్పటికి తగిన మార్పు మాత్రం రావడం లేదని అన్నారు. సిటిజన్ ఫోరమ్ ప్రజలను తమ ధనాన్ని, కాలాన్ని, సమాజ సేవకు, దేశసేవలకు ఉపయోగించమని కోరడం లేదని అన్నారు. కేవలం మీకొరకు, మీకుటుంబం కొరకు మాత్రమే పనిచేయాలన్నదే సిటిజన్ ఫోరమ్ ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. ఈ ఫోరమ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం మనలను మనం ఒకే విధానం, ఒకే వేదిక, ఒకే లక్ష్యం కలిగి ఉండేటట్లు అభివృద్ధి చేయటమేనని అన్నారు. మొదటి విడుదగా పరస్పర సహకారంతో సమస్యల పరిష్కారం, బాలబాలికలందరిని పాఠశాలలో చేర్చుట, గ్రామ పరిసర ప్రాంతాల్లో చెట్లు నాటడం, నెలకు ఒకసారి గ్రామస్థులందరు కలసి గ్రామాలను శుభ్రపర్చడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఈలక్ష్య సాధనలో భాగంగా ప్రతి కమిటిలో 20 మంది చొప్పున ఎటువంటి రాజకీయ ప్రమేయంలేని ప్రముఖ వ్యక్తులతో జిల్లా, మండల, గ్రామ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇట్టి కమిటీలు ప్రతి వారం విధిగా సమావేశమై సమస్యలన సాధనకోసం పాటుపడాలని తెలిపారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఐకమత్యంలేకుండా చేసే పని విజయం సాధించబడదని, అందుకే కలసి పని చేద్దాం, కలసి నినదిద్దాం, మంచి ఆకర్షనీయమైన ఫలితాలు సాదిద్దామన్న ధృడ సంకల్పంతోటి మనందరం పనిచేసినప్పుడే సమాజం ఎదుగుదలకు తోడ్పాటు లభిస్తుందని జైలర్ సుధాకర్‌రెడ్డి యువకులకు సూచించారు.

ముంపు నిర్వాసితులను ఆదుకుంటాం
మంత్రి జూపల్లి
పెబ్బేరు, జూన్ 13: ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరిస్తున్న ముంపు నిర్వాసితుల కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర పంచాయతిరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులకు బరోసా కల్పించారు. మంగళవారం మండల కేంద్రంలోని జూరాల అతిథి గృహ ఆవరణలో ముంపు నిర్వాసితుల రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శే్వతామహంతి హాజరు కాగా భీమా, జూరాల ప్రాజెక్టుల సిఇ ఖగేందర్, భీమా ఎస్‌ఇ భద్రయ్య, ఆర్డీఓ చంద్రారెడ్డి పాల్గొన్నారు. రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం ద్వారా డిస్టిబ్యూటర్ 23 కాల్వ నిర్మాణానికి జిల్లా పరిధిలోని పాన్‌గల్, వీపనగండ్ల, చిన్నంబావి, పెంట్లవెళ్లి గ్రామాల్లో 436 ఎకరాల భూములను గుర్తించినట్లు మంత్రి జూపల్లి తెలిపారు. ప్రతి ఎకరాకు భూమి విలువను బట్టి రూ.3.50 మొదలుకొని రూ.5.50 లక్షలు పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. డిస్టిబ్యూటర్ 22, 23 ప్రధాన కాల్వల ద్వారా నాగర్‌కర్నూల్ జిల్లాలో 220 ఎకరాలు అవసరం అవుతుండగా వనపర్తిలో 436 ఎకరాలు అవసరం అవుతుందన్నారు. డి-23 కాల్వ బుసిరెడ్డిపల్లి నుండి వీపనగండ్ల వరకు చేపడుతుండగా 14వేల ఎకరాలకు నీరందుతుందని 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. రెవిన్యూ అధికారుల సమన్వయంతో ప్రతి ఎకరాకు నష్టపరిహారంలో తేడా రాకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాన్‌గల్ జడ్పిటిసి రవికుమార్, ఎంపిపి వెంకటేష్, మార్కెట్ కమిటి ఛైర్మన్ రాంచంద్రరెడ్డి, భీమా ఇఇ ఉమాపతి రావు, ఎస్‌బిసి వెంకటయ్య, డిఇ కిరణ్‌కుమార్, ఎఇ ఆంజనేయులు, విఆర్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.

డబుల్ బెడ్‌రూంలను అందంగా నిర్మిస్తాం: జూపల్లి
కొల్లాపూర్, జూన్ 13: పట్టణంలోని అమరగిరి రోడ్డు పక్కన సర్వే నెం 126లో డబుల్ బెడ్‌రూంల నిర్మాణం హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ మాదిరిగా అందంగా నిర్మిద్దామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం పట్టణంలోని అమరగిరి రోడ్డు పక్కన సర్వే నెంబరు 126లో 45 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, అట్టి భూమిని కంచెతో బార్డర్‌ను ఏర్పాటు చేయాలని ఆర్డీవో శ్రీనివాసులును ఆదేశించారు. ఈ భూమిలోనే మైనార్టీ గురుకుల పాఠశాలకు ఐదెకరాల భూమి, ఎస్టీ గురుగుల పాఠశాలకు ఐదు ఎకరాల భూమి, షాదీఖానాకు భూమిని కేటాయించి, 250 డబుల్ బెడ్‌రూంలను ఇక్కడే కట్టించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఒకేచోట అన్ని రకాల వసతులతో కూడిన భవన నిర్మాణ పనులు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. అనంతరం పట్టణంలోని జఫర్ మైదానంలోని మినీ స్టేడియంను సందర్శించారు. ఇక్కడ నిర్మిస్తున్న సిమ్మింగ్ ఫుల్ పనులను వేగవంతగా చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. బెక్కెంగూడెం రిజర్వాయర్‌లో నాలుగు ముసళ్లు ఉన్నాయని, అవి చేపలను తింటూ చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు భయాందోళనకు గురవుతున్నామని మత్స్యకారులు మంత్రి జూపల్లికి మొర పెట్టుకోగా వనపర్తి జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి త్వరలోనే రిజర్వాయర్ నుంచి మొసళ్లను పట్టుకునే ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. ఆయన వెంట ఎంపిపి నిరంజన్‌రావు, జడ్పీటిసి హన్మంతునాయక్, ప్రత్యేక కార్యదర్శి జెవి రామారావు, పలువురు టిఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యను అభ్యసించాలి
* కలెక్టర్ శే్వతామహంతి
ఖిల్లాగణపురం, జూన్ 13: విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసించాలని కలెక్టర్ శే్వతామహంతి, ఎమ్మెల్యే డాక్టర్ జి.చిన్నారెడ్డిలు తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని శాపూర్ గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరూ చదువుకుంటేనే కుటుంబాలు బాగు పడుతాయని ప్రతి ఒక్కరు విద్యను నేర్చుకోవాలని సూచించారు. గ్రామంలో సాక్షర భారత్ కేంద్రాల ద్వారా వయోజనులు రాత్రివేళల్లో ఒకగంట పాటు విద్యను అభ్యసించాలని, కనీసం బస్సు బోర్డు తెలిసే విధంగా అక్షరజ్ఞానం పెరిగే చాలాని సూచించారు. అంతకు ముందు ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు అర్పించారు. విద్యార్థుల చేత అక్షరభ్యాసం చేయించి సాక్షర భారత్ కేంద్రంలో అక్షరజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డిఇఓ సుశీందర్ రావు, మాజీ ఎంపిపి ఉమా మహేశ్వర్, ఉప సర్పంచు సోమ్లానాయక్, తహశీల్ధార్ హరిలాల్, ఎంఇఓ ఉషారాణి, సర్పంచు మన్యంగౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
సాంకేతిక నైపుణ్యంతో నేరాలను అదుపు చేయాలి: ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
పెద్దమందడి, జూన్ 13: పోలీసులు ఆధునాతన సాంకేతిక నైపుణ్యంతో సైబర్ నేరాలను అదుపు చేయాలని జిల్లా ఎస్పీ రోహిణి ప్రయదర్శిని అన్నారు. మంగళవారం పెద్దమందడి పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్‌లో పలు నేరాలకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. క్రైమ్ రేట్ నమోదు, ప్రజల నుండి వచ్చిన పిర్యాదులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పాటు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాధితులకు బరోసా కల్పించాలని వారితో స్నేహభావంగా నడుచుకోవాలని సూచించారు. అనంతరం పోలీస్‌స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఎస్పీ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని పెద్దమందడి పోలీస్‌స్టేషన్‌లోని వెనుక భాగంలో ఖాళీగా ఉన్న స్థలంలో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయాలని ఎస్పీ ఎస్ ఐ లెనిన్ గౌడ్‌ను ఆదేశించారు.