మహబూబ్‌నగర్

రాష్ట్రంలో రాజకీయ మార్పు తథ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 16: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ మార్పు తథ్యమని ఆ సిగ్నల్ కనబడుతున్నందుకే కెసిఆర్ కొత్త గారఢికీ శ్రీకారం చుట్టారని అదే సర్వేల గారఢి అని బిజెపి రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ విమర్శించారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లోని బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో శాంతికుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ పాలన అస్థవ్యస్తంగా మారిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆహాంకారంగా తయారయ్యాడని ఆయన విధానాలు అన్ని ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో బిజెపి రోజురోజుకు ఎదుగుదల కావడంతో ముఖ్యమంత్రి కెసిఆర్‌కు అప్పుడే భయం పుట్టుకుందన్నారు. అందుకే బిజెపిపై విషం కక్కుతున్నారని అన్నారు. దేశ ప్రజలు బిజెపి ప్రధానమంత్రి దేశానికి కావాలని కోరుకున్నారు కాబట్టే ప్రధానమంత్రిగా నరేంద్రమోధీ పదవిలోకి వచ్చారని తెలిపారు. తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి నుండి కెసిఆర్‌ను ప్రజలు దింపాలని చూస్తున్నారని అది జరగడం ఖాయమన్నారు. శాశ్వితంగా అధికారం ఉంటదని కెసిఆర్ భావించుకోవడం తగదని అది ప్రజలు నిర్ణయిస్తారన్నారు. తెలంగాణ వ్యాప్తంగా బిజెపి బూత్ కమిటీలను వేసిందని ఇప్పటికే తాము అనుకున్న దానికి రెండింతలుగా ఎదిగామని రాబోయే ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధిస్తామని అన్నారు. రాష్ట్ల్రో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బిజెపి పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు బావిస్తున్నారని అన్నారు. పార్టీ బలోపేతం కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆహార్నిషలు పని చేస్తున్నారని కుటుంబాలకు దూరమై పదిహేను రోజుల నుండి నెల రోజుల వరకు పార్టీ కోసమే త్యాగాలు చేస్తున్న నాయకత్వం ఉన్న పార్టీ బిజెపి అన్నారు. దేశం కోసం పరితపించే పార్టీ అని అన్నారు. ఇలాంటి పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని దేశ వ్యాప్తంగా ఆ పథకాలు అమలు జరుగుతుంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఆ పథకాలు తమవిగా ప్రచారం చేసుకుంటున్న టిఆర్‌ఎస్ నాయకులను చూసి జాలి వేస్తుందన్నారు. కేంద్రం సహయం పొందుతూ కేంద్ర ప్రభుత్వంపైనే రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు బురద్ద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఇది మంచిపద్దతి కాదన్నారు. ఈ నెల 17 శనివారం రోజు మహబూబ్‌నగర్ జిల్లాకు కేంద్ర ఇన్‌ఫార్మేషన్ టెక్నాలాజీ శాఖ మంత్రి పిపి చౌదరి వస్తున్నారని సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ సమ్మెళంలో పాల్గొంటారని వెల్లడించారు. ఈ సమ్మెళనాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.రాష్ట్రంలో బిజెపి ఎదుగుదల చూసి టిఆర్‌ఎస్ నాయకులు ఓర్వలేక పోతున్నారని ఆరోపించారు. అబద్దాలకు కేరాఫ్ తెరాస పాలనఅని విమర్శించారు. కెసిఆర్ ఎన్ని జిమ్మికులు చేసిన ఇక పదవి నుండి పారిపోవడం ఖాయమని అన్నారు. 2019 ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలను బిజెపి సాధిస్తుందని అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం తథ్యమని శాంతికుమార్ అన్నారు. విలేఖరుల సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, రాష్ట్ర నాయకులు పడాకుల బాల్‌రాజ్, కొండయ్య, రతంగ్‌పాండురెడ్డి, సుదర్శన్‌రెడ్డి, రాములు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.