మహబూబ్‌నగర్

ఎంపిఎల్ క్రికెట్ టోర్నీ చాంపియన్ గద్వాల బుల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 16: పట్టణంలో ఈ నెల 9వ తేదీ నుండి జరుగుతున్న మహబూబ్‌నగర్ ప్రీమియర్-4 క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం ముగిసింది. పట్టణంలో నిర్వహించిన ఎంపిఎల్-4 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు సమావేశానికి మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యుడు, ఎండిసిఎ జిల్లా అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చివరి ఫైనల్ మ్యాచ్‌ను ఎంపితో పాటు పలువరు ప్రముఖులు తిలకించారు. గద్వాల బుల్స్, మల్లేష్ అండ్ బ్రదర్స్ టోర్నమెంట్‌లో ఫైనల్లో ఢీకొన్నాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన మల్లెష్ అండ్ బ్రదర్స్ జట్టు 20 ఓవర్లలో 148 పరుగులు తీశారు. తరువాత బ్యాంటింగ్‌కు దిగిన గద్వాల బుల్స్ 14.1 ఓవర్లలోనే 149 పరుగులు తీసి టోర్నమెంట్‌లో విన్నర్‌గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌ను తిలకించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున క్రీడా మైదానానికి చేరుకుని ఎంపిఎల్ చివరి మ్యాచ్‌ను ఆసక్తిగా ఆనందంగా తిలకించారు. పట్టణంలో ఓపండుగ వాతావరణంలా కనిపించింది.
ఎంపిఎల్ టోర్నమెంట్ చాంపియన్ షిప్ విన్నర్‌గా గద్వాల బుల్స్, రన్నర్‌గా మల్లేష్ అండ్ బ్రదర్స్, మూడవ స్థానంలో ఆల ఫోర్స్ నిలిచింది. విన్నర్‌గా నిలిచిన గద్వాల బుల్స్‌కు లక్ష రూపాయల చెక్కును, కప్‌ను, రన్నర్‌గా నిలిచిన మల్లేష్ అండ్ బ్రదర్స్ జట్టుకు రూ.50వేల చెక్కుతో పాటు రన్నర్ కప్‌ను, మూడవ స్థానంలో నిలిచిన ఆల ఫోర్స్ జట్టుకు రూ.30వేల చెక్కుతో పాటు కప్‌ను ఎంపి జితేందర్ రెడ్డి అందజేశారు. టోర్నమెంట్‌లో మ్యానాఫ్‌ది సిరిస్‌గా నిలిచిన మల్లేష్ అండ్ బ్రదర్స్ కెప్టెన్ ఆబేద్ హుస్సేన్‌కు బైక్‌ను అందజేశారు. ఉత్తమ బ్యాట్స్‌మెన్‌గా ఎంజెఆర్ జట్టు కెప్టెన్ మహేష్, ఉత్తమ కీపర్‌గా హర్ష, ఫైనల్ మ్యాచ్‌లో 62 పరుగులు చేసిన పరుశాకు మ్యాన్‌ఆఫ్‌ది మ్యాచ్ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఎంపి జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడలకు తన సంపూర్ణ సహకారం ఎల్లప్పుడు ఉంటుందని, జిల్లా క్రీడానైపుణ్యం కలిగిన వారెందరో ఉన్నారని వారిని వెలికి తీసేందుకు మహబూబ్‌న్‌గర్ క్రికెట్ ఆసోషియోషన్ ద్వారా ఎంపిఎల్ మ్యాచ్‌లను నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో హెచ్‌సిఏ పరిధిలో జిల్లాలలో తొలి నూతన మైదానం కేవలం మహబూబ్‌నగర్‌లోనే ఉందని మైదానం తయారు చేసిన నెల రోజుల వ్యవధిలోనే ఎంపిఎల్ టోర్మమెంట్‌ను నిర్వహించడం పట్ల తాను ప్రత్యేకంగా తమ సభ్యులను అభినందిస్తున్నానని తెలిపారు. ఈ మైదానంలో రాష్ట్ర స్థాయి మ్యాచ్‌లను సైతం నిర్వహించేందుకు తయారు చేయడానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ఎంపిఎల్ మ్యాచ్‌లతో పట్టణంలో ఓ పండుగ వాతావరణం నెలకొందని, ప్రతి రెండు సంవత్సరాలకు ఇలాంటి టోర్నమెంట్‌లు నిర్వహిస్తే మంచి ప్రతిభగల క్రీడాకారులను గుర్తించి వారికి రంజీ స్థానంలో ఆడించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లా ఒలంపిక్ అసోషియోషన్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్ మాట్లాడుతూ జిల్లాలో మంచి క్రీడా ఆణిముత్యాలు ఉన్నాయని తెలిపారు. జిల్లా వాలీబాల్, కబఢ్డీ అసోషియోషన్ జిల్లా అధ్యక్షుడు శాంతికుమార్ మాట్లాడుతూ క్రీడాకారులకు ఆటపై కసి ఉండాలని అప్పుడే కప్ వస్తుందని తెలిపారు. క్రీడాకారుడికి క్రమశిక్షణ ఉంటే ప్రజల మనుస్సులను సైతం గెలుస్తాడని తెలిపారు. కార్యక్రమంలో ఎండిసిఏ జిల్లా కార్యదర్శి రాజశేఖర్, హెచ్‌సిఏ కోశాధికారి మహేందర్, సభ్యులు హన్మంత్‌రెడ్డి, నాయకులు కృష్ణమోహన్, కేశవ్, శంకర్, మనోహర్‌రెడ్డి, సురేష్, ఉదయ్, జనక్‌సింగ్, నరేందర్‌రెడ్డి, అబ్దల్లా, ముక్తార్ తదితరులు పాల్గొన్నారు. కాగా గద్వాల బుల్స్ జట్టు విన్నర్‌గా నిలవడంతో గద్వాల నియోజకవర్గం తెరాస ఇన్‌చార్జి కృష్ణమోహన్‌రెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేశవ్‌లు జట్టు సభ్యులతో కలిసి ఆనందాన్ని వ్యక్తం చేశారు జట్టు సభ్యులను వారు అభినందించారు. మ్యాచ్ ఆడుతున్న సమయంలో తమ జిల్లా జట్టు సభ్యులు పరుగుల వర్షం కురిస్తున్న సమయంలో ఆ నాయకులు సైతం మైదానంలో తమ ఉత్సహాన్ని నిలుపుకోలేకపోయారు.