మహబూబ్‌నగర్

కెసిఆర్ మైనారిటీల వ్యతిరేకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 27: ముస్లిం, క్రిస్టియన్లను గ్రహాంతర వాసులని విమర్శించి తన మతతత్వ బుద్దిని చాటుకున్న బిజెపి రాష్టప్రతి అభ్యర్థి రాంనాథ్ కోవింద్‌కు ముఖ్యమంత్రి కెసిఆర్ మద్దతు ఇవ్వడం అంటే మైనారిటీల వ్యతిరేకి అని రుజువైందని కాంగ్రెస్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు జహీర్ అక్తర్ ఆరోపించారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జహిర్ అక్తర్ మాట్లాడుతూ బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు అమిత్‌షా కాదు భ్రమిత్‌షా అంటూ విమర్శించిన కెసిఆర్ ప్రస్తుతం మోదీ జపం పాడుతున్నారని ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్ వాది అయినా బిజెపి రాష్టప్రతి అభ్యర్థి రాంనాథ్ కోవిద్‌కు ముఖ్యమంత్రి కెసిఆర్ మద్దతు ఇవ్వడం తెలంగాణలోని ముస్లింలు సహించరని అన్నారు. సెక్యూలర్ ముసుగులో ఉన్న ముఖ్యమంత్రి నిజ స్వరూపం బయటపడిందని అన్నారు. మైనారిటీలకు తాయిలాలు ఇచ్చినంత మాత్రానా మొత్తం ముస్లింలు కెసిఆర్ వెంట వస్తారని రాబోయే ఎన్నికల్లో ఓట్లు వేస్తారని భావించుకుంటే ఆయన ముర్ఖత్వమేనని అన్నారు. 12శాతం రిజర్వేషన్లు అంటూ మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి మాజీ లోక్‌సభా స్పీకర్ మీరాకుమారి రాష్టప్రతి అభ్యర్థికి అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు. విలేఖరుల సమావేశంలో నాయకులు రంగారావు, బెనహర్, లింగంనాయక్, వినోద్, ఫయాజ్, రావూఫ్, ఖాజా, అజ్మత్, షబ్మీర్ తదితరులు పాల్గొన్నారు.