మహబూబ్‌నగర్

రోడ్డెక్కిన గర్భిణులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, జూన్ 27: ఏరియా ఆస్పత్రి స్థాయిని పెంచి జిల్లా ఆస్పత్రి గా నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రిని చేయడంతో వైద్య సేవలు మెరుగుపడుతాయని భావించిన ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర నిరాశయే మిగులుతుంది. జిల్లా కలెక్టర్‌తోపాటు జిల్లాస్థాయి అధికారులంతా కూడా జిల్లా కేంద్రంలోనే ఉండటంతో 24 గంటలు వైద్య సేవలు అందుతాయని ఆశించిన వారికి ఆశాభంగమే కలుగుతుంది. సరిపడు వైద్యులు లేకపోవడంతో ఈ ఆస్పత్రికి వచ్చే వారిని విధి నిర్వహణలో ఉన్న వైద్యులు, సిబ్బంది ప్రథమ చికిత్స చేసి మహబూబ్‌నగర్, హైదరాబాద్‌కు వెళ్లాలని సిఫారసు చేస్తున్నారు. డబ్బులుంటే పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాలని బాహటంగా సూచిస్తూన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవం చేసుకుంటే కేసిఆర్ కిట్ ఇవ్వడంతోపాటు గర్భిణీగా నిర్ధారించిన సమయం నుంచి ప్రసవం వరకు ప్రభుత్వ ఆస్పత్రిలోనే చూయించుకుంటే రూ.12వేల ఆర్థిక సహాయం అందచేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో గత నెలరోజుల నుంచి ప్రభుత్వ ఆస్పత్రులకు గర్భిణీల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో స్థానిక జిల్లా ఆస్పత్రిలో ప్రతి మంగళవారం గర్భిణీలకు అల్ట్రాసౌండ్ స్కానింగ్‌తోపాటు ఇతర వైద్య పరీక్షలు చేసి తగిన చికిత్సలు చేయడం జరుగుతుంది. గత మూడు వారాల నుంచి గర్భిణీలు జిల్లా ఆస్పత్రికి వస్తున్నప్పటికి స్ర్తి వైద్య నిపుణులు లేకపోవడంతో వైద్య పరీక్షలుగాని, చికిత్సలు గాని చేయడంలేదని పలువురు గర్భిణీలు వాపోయారు. మంగళవారం ఉదయం వివిధ ప్రాంతాల నుంచి వైద్య పరీక్షలకోసం వచ్చిన గర్భిణీలకు గంటలు గడిచిన సంబంధిత డాక్టర్ రాకపోవడంతో సహనం కోల్పొయిన గర్భిణీలు ప్రధాన రహదారిపైకి వచ్చి రాస్తారోకో చేపట్టారు. దీనితో రోడ్డుకు ఇరువైపుల భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు గంటసేపు గర్భిణీలు రాస్తారోకో చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఎస్సై పురుషోత్తం అక్కడికి చేరుకొని రాస్తారోకో చేస్తున్న గర్భిణీలను నచ్చచెప్పి, డాక్టర్ వచ్చి పరీక్షలను నిర్వహించేలా చూస్తానని హామిఇచ్చి రాస్తారోకోను విరమింపచేసి వారందరిని ఆస్పత్రిలోకి వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాలతితో గర్భిణీలు వాగ్వివాదం చేశారు. గర్భిణీలతోపాటు ఎస్సై పురుషోత్తం డాక్టర్ మాలతితో మాట్లాడి ఎలాగైనా ఆస్పత్రికి వచ్చిన గర్భిణీలందరికి వైద్యపరీక్షలు చేసి, అవసరమైన చికిత్సలు అందించాలని కోరారు. జిల్లా ఆస్పత్రిలో నెలకొన్న పరిస్థితిని డాక్టర్ మాలతి ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డికి వివరించగా, ఆయన వెంటనే మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రి అధికారులకు వివరించి అక్కడి నుంచి గైనకాలిజిస్టును రప్పించి మధ్యాహ్నం గర్భిణీలకు వైద్య పరీక్షలను నిర్వహించారు. గర్భిణీల చేసిన ఆందోళనలకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు మద్దతు తెలిపి గర్భిణీలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

జిఎస్‌టికి వ్యతిరేకంగా...
వస్త్ర ధుకాణాలు బంద్

మహబూబ్‌నగర్, జూన్ 27: కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోయే జిఎస్‌టి (వస్తుసేవా పన్ను)కు వ్యతిరేకంగా జిల్లాలో మంగళవారం వస్త్ర వ్యాపారులు రోడ్డెక్కారు. జిఎస్‌టి నుండి వస్త్రాలను మినహయించాలని రాబోయే పన్ను శాతం విపరీతంగా ఉందంటూ కేంద్రం పన్ను శాతాన్ని తగ్గించాలని వ్యాపారులు డిమాండ్ చేశారు. జూలై మాసం నుండి అమలులోకి తీసుకువస్తున్న వస్తుసేవా పన్ను వస్తవ్య్రాపారులపై తీవ్రపైన ప్రభావం పడుతుందని ఆరోపిస్తూ జిల్లా వ్యప్తంగా వేలాది మంది వస్త్ర దుకాణ దారులు నిరసనకు దిగారు. అంతేకాకుండా మూడు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా దుకాణాలను మూసివేసేందుకు నిర్ణయం తీసుకుని మొదటి రోజు జిల్లాలో అన్ని దుకాణాలు మూసివేశారు. దుకాణాలు బంద్ కావడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్ పట్టణంలో దుకాణాలు బంద్ కావడంతో రోడ్లు వెలవెల బోయాయి. వస్తవ్య్రాపారులు దుకాణాలను బంద్ చేసి దర్నా చౌక్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వస్త్ర దుకాణాల సంఘం నాయకులు నరేందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న జిఎస్‌టి తమపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా మూడు రోజుల పాటు దుకాణాలను బంద్ చేస్తున్నామని తమ నిరసనను తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు, సత్యనారాయణ, మణికంఠ, రహీం, భగత్, వెంకట్, ధుబేరా తదితరులు పాల్గొన్నారు.