మహబూబ్‌నగర్

గులాబీలో గ్రూపుల కుంపట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 27: సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మాత్రం అన్ని రాజకీయ పార్టీలలో విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్‌ఎస్)లో మాత్రం పరిణామాలు రోజురోజుకు విచిత్రంగా మారుతున్నాయి. దాంతో నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ పరిస్థితులు ఇలాగే ఉంటే రాబోయే ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని పలువురు నాయకులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గంలో కొల్లాపూర్, వనపర్తి, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాలలో అక్కడి నాయకులు కొంత సమన్వయం చేసుకుంటూ మందుకు వెళ్తున్నారు. నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం కొన్ని మండలాల్లో గ్రామ, మండల స్థాయి నాయకుల మధ్య పాత కొత్త పంచాయతీలు నెలకొని ఉన్నాయి. వీటిని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి, మరో నాయకుడు జక్కా రఘునందన్‌రెడ్డిలు వాటిని ఎప్పటికప్పుడు పసిగడుతూ నాయకుల మధ్య నెలకొన్న బేదాభిప్రాయాలను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనబడుతుంది. కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో విచిత్రమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇక్కడి టిఆర్‌ఎస్ నాయకుల మధ్య ఉన్నటువంటి గ్రూపు రాజకీయాలు ఇతర పార్టీలకు మేలు చేకూరే విధంగా ఉందని టిఆర్‌ఎస్ నాయకులే బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో అందరు ఎమ్మెల్యే అభ్యర్థులమేనని నేతలు ప్రచారం చేసుకుంటారు. 2014 ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఓటమి చెందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్‌కు దగ్గరగా ఉంటూ నియోజకవర్గంలో పార్టీ జెండాను గ్రామ గ్రామానికి మోసిన బాలాజీసింగ్ ప్రస్తుతం నిరాశతో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే నియోజకవర్గానికి చెందిన నేత ఎమ్మెల్సీగా గెలుపొందిన కసిరెడ్డి నారాయణరెడ్డికి అంటూ ప్రత్యేకంగా ఓ గ్రూపు అంటూ ఉంది. ఆయన 2014 ఎన్నికల్లో సైతం ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గౌరవప్రదమైన ఓట్లను సంపాధించారు. దాంతో ఆయనకంటూ నియోజకవర్గంలో అప్పటికే ఓ గ్రూపు ఉంది. తదనంతరం జరిగిన పరిణామాల దృష్ట్యా ఆయన తెరాసలోకి వచ్చి ఎమ్మెల్సీగా గెలుపొందారు. అదేవిధంగా కల్వకుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ ద్యాప విజితారెడ్డి కూడా ఈ నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావం నుండే నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి ఎనలేని కృషి చేశారు. రాష్ట్ర రాజకీయాల పరిణామాల దృష్ట్యా ఆమే కొన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. కొన్ని రోజుల తర్వాత తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ విజితారెడ్డికి కల్వకుర్తి మార్కెంట్ కమిటీ చైర్మన్‌గా నియమించారు. ఇలా నాలుగైదుగురు నాయకులు నియోజకవర్గంలో ఎవరికి వారుగా ప్రత్యేకంగా తమకుంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడంతో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో విచిత్రమైన రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. బయటకు మాత్రం తమ మధ్య ఎలాంటి గ్రూపులు లేవని చెప్పుకుంటున్నప్పటికిని గ్రామాల్లో మాత్రం స్పష్టంగా కార్యకర్తలు ఫలానా నాయకుడి గ్రూపుగా కనబడుతుంది. ఒక్కో గ్రామంలో రెండు మూడు గ్రూపులు ఉండడంతో నియోజకవర్గంలో రోజురోజుకు పరిణామాలు విచిత్రంగా మారుతున్నాయని పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ కోసం పని చేసిన గ్రామ స్థాయి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ నిరాశ చెందుతున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రతి పక్ష పార్టీల నాయకులు తెరాస నాయకుల గ్రూపు రాజకీయాలను ఆసరాగా చేసుకుని నియోజకవర్గంలో బలపడాలని చూస్తున్నారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, బాలాజీసింగ్, విజితారెడ్డిలు మాత్రం తమ మధ్య రాజకీయ గ్రూపులు లేవని చెబుతున్నప్పటిని కార్యకర్తలు మాత్రం తామ నాయకుడు మాత్రం ఫలానా అని బహిరంగంగా చెబుతుంటే తెరాసలో గ్రూపులు ఉన్నాయన్న విషయాన్ని వారంతకు వారే బహిరంగంగా చెప్పుకుంటున్నట్లు చెప్పకనే చెప్పకవచ్చు. ఇదిలా ఉంటే గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలో సైతం గ్రూపు రాజకీయాలు స్పష్టంగా కనబడుతున్నాయి. గద్వాల తెరాస నియోజకవర్గ ఇన్‌చార్జీ కృష్ణమోహన్‌రెడ్డి, మరో నాయకుడు బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, జడ్పి చైర్మన్ బండారి భాస్కర్‌ల మధ్య బేదాభిప్రాయాలు నెలకొన్నట్లు ప్రచారం జరుగుతుంది. కృష్ణమోహన్‌రెడ్డితో బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి విబేధిస్తున్నట్లు పుకార్లు షికార్లు కొడుతున్నాయి. వీరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకోవడమే కాకుండా నియోజకవర్గంలో ఎవరంతకు వారుగా గ్రూపు రాజకీయాలు నడిపిస్తున్నారని వివిధ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. గద్వాల నియోజకవర్గంలో తెరాస కార్యకర్తలు సైతం గ్రూపుల వారిగా చిలినట్లు స్పష్టంగా కనబడుతుంది. ఈ విషయాన్ని వివిధ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బహిరంగంగానే చర్చించుకుంటుండడం గమనర్వం. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో సైతం ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్, మాజీ మంత్రి రాములు మధ్య సైతం విబేధాలు నెలకొని ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీని వీడి తెరాసలోకి మాజీ మంత్రి రాములు వచ్చాక ఆయన నియోజకవర్గంలో పర్యటించడానికి సైతం వెనుకంజ వేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇందుకు కారణం ఎమ్మెల్యే వర్గీయులు రాములు గ్రామాలో తిరిగితే తమ నాయకుడు ఉన్నాక పార్టీలోకి వచ్చిన మాజీ మంత్రి రాములు నియోజకవర్గంలో తిరిగితే మేం ఎలా ఒప్పుకుంటామనే రీతిలో ఎమ్మెల్యే వర్గీయులు ఉన్నారనే ప్రచారం జరుగుతుంది, ఈ విషయంపై రాములు వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తూనే తమ నాయకుడు ఉనికిని ఎలా కాపాడుకోవాలో తమకు బాగా తెలుసనే రీతిలో రాములు వర్గీయులు సైతం చాపకింద నీరులా రాజకీయ పావులు కదుపుతున్నారు. దీనిని బట్టి చూస్తే అచ్చంపేట తెరాసలో సైతం గ్రూపు రాజకీయాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఏదిఏమైన్ప్పటికి నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం తెరాస నేతల మధ్య గ్రూపు రాజకీయాలు తెరపైకి వస్తుండడం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయేనని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు.

పాలమూరులో మోడల్ బస్టాండ్లు
* రాష్టంలోనే ఆథర్శ జిల్లా కేంద్రంగా తీర్చిదిద్దుతాం
* మినీ బస్టాండ్లతో పట్టణానికి ఓ కొత్తకల వస్తుంది
* మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్

మహబూబ్‌నగర్, జూన్ 27: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ప్రయాణికుల సౌకర్యార్థం మాడల్ బస్టాండ్లను ఏర్పాటు చేస్తున్నామని అందుకు శ్రీకారం చుట్టామని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ముందు రూ.10 లక్షలతో నిర్మించిన నూతన మిని బస్టాండ్‌ను ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ చైర్‌పర్సన్ రాదా అమర్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్ పట్టణంలో మినీ బస్టాండ్లు లేని కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురువుతున్నారని ఎండాకాలం, వానాకాలం వచ్చిందంటే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ముఖ్యంగా వృద్ధులు కూర్చోవడానికి సైతం ఏర్పాట్లు లేవని ప్రజల బాధలను గుర్తించి మహబూబ్‌నగర్ పట్టణంలో దాదాపు 10కిపైగా మాడల్ బస్టాండ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించామని అందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి ముందు రూ.10 లక్షలతో నూతనంగా నిర్మించి ప్రారంభించామని అన్నారు. మంచినీటి సౌకర్యంతో పాటు బస్టాండ్ పరిశుభ్రంగా ఉంచడానికి సైతం ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మహబూబ్‌నగర్ పట్టణానికి అందంగా తీర్చిదిద్దడమే తన ముందున్న లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి ఓ అందం తీసుకువస్తున్నామని అందుకు నిదర్శనం మయూరి వనం దగ్గర గల హరితవనం అని రెండు వందల ఎకరాల్లో హరిత వనం పార్క్ ప్రజలందరిని ఆకట్టుకుంటుందని తెలిపారు. పాలమూరు పెద్ద చెరువు అద్బుతంగా తయారు అవుతుందని రూ.6 కోట్లతో మిని ట్యాంకుబండ్‌గా తిర్చిదిద్దుతున్నామని పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం ఆదర్శంగా నిలవనుందని అందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా నిధులు ఇస్తూ సహకరిస్తుందన్నారు. ఇప్పటికే రోడ్డు వెడల్పుకు సంబందించిన పనులు చకచకగా కొనసాగుతున్నాయని ప్రస్తుతం ప్రభుత్వ కార్యాయాల దగ్గర గల రోడ్డును వెడల్పు చేస్తున్నామని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ముందుగా ఈ పని చేస్తున్నామని తెలిపారు.
రోడ్డు వెడల్పుకు గాను రూ.32 కోట్లు మంజూరి అయ్యావని అన్నారు. అంతేకాకుండా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి బైపాస్ రోడ్డు కూడా మంజూరి కావడమే కాకుండా అందుకు రూ.90 కోట్లకు పైగా నిధులు మంజూరి చేస్తూ ప్రభుత్వం జిఓను విడుదల చేసిందన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు అందరు సహకరించి అభివృద్ధిలో తాము కూడా బాగస్వామ్యం ఉన్నామని భావించాలని అన్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గం రాష్ట్రంలో మంచి అనివృద్ధి పనులు జరుగుతున్నాయని మన్యంకొండ గుట్టపై దాదాపు 350 కోట్లతో రిజర్వాయ నిర్మాణం పనులు జరుగుతున్నాయని తెలిపారు. వారం పదిరోజుల్లో దాదాపు 42 గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ వెంకటయ్య, మార్కెట్ కమిటి చైర్మన్ రాజేశం, కౌన్సిలర్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
మిషన్ కాకతీయతో రైతుల్లో ఆనందం
* ఎమ్మెల్సీ కసిరెడ్డి
వెల్దండ, జూన్ 27: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో రైతుల్లో అనదం వెల్లి విరుస్తుందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం వెల్దండ మండలం కొట్ర గ్రామంలో మూడవ విడత మిషన్ కాకతీయలో భాగంగా రూ.9 లక్షలతో చేపట్టే నేరేడుకుంట మరమ్మత్తు పనులను ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో వట్టిపోయి పునరుద్దరణకు నోచుకోని చెరువులు, కుంటలకు ముఖ్యమంత్రి కెసిఅర్ జీవం పోశారన్నారు. రైతన్నల జీవితాలలో వెలుగులు చూడాలనే లక్ష్యంతోనే వేల కోట్లు వెచ్చించి చెరువులు కుంటల మరమ్మత్తు పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. విడతల వారిగా చెరువులు కుంటలకు జీవం పోయడమే కాకుండా అందులోని వండ్రు మట్టిని పోలాలకు రైతులు తరలించి లబ్ది పోందుతున్నారని గుర్తు చేశారు. వర్షాలు ప్రారంభమై చాల గ్రామాల్లో చెరువులు కుంటలు నిండి రైతన్నల ముఖాల్లో అనదం వ్యక్తమవుతుందని అయన అన్నారు. ముఖ్యంగా భూగర్బ జలలు సైతం పెరిగే అవకాశలు చాల ఉన్నాయన్నారు. మరో విడతలో తెలంగాణ రాష్ట్రంలోని చెరువులు కుంటలు మరమ్మత్తులు పూర్తవుతాయని చెప్పారు. ఒక్కవైపు ప్రాజెక్టులు మరోవైపు చెరువులు కుంటలతో రాష్ట్రం పచ్చటి పైర్లతో కళకళా లాడుతుందని అశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఉపాధి కూలీలతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రాజశేఖర్, వైస్ ఎంపిపి వెంకటయ్యగౌడ్, సింగిల్‌విండో చైర్మన్ మోహన్‌రెడ్డి, సర్పంచ్ గీతారాణీ, ఎంపిటిసిలు కృష్ణయ్య, జయప్రకాష్, మాజీ వైస్ ఎంపిపిలు భూపతిరెడ్డి, సాంబయ్యగౌడ్, ఐజాక్, నాయకులు గోపాల్‌రెడ్డి, సంజీవ్‌కుమార్‌యాదవ్, వెంకటేశ్వర్‌రావు, బాలస్వామి, జంగయ్య, గజిని శ్రీను తదితరులు పాల్గొన్నారు.

అంకితభావంతో పనిచేస్తే గుర్తింపు: డిఎస్పీ బాలకోటి
నాగర్‌కర్నూల్, జూన్ 27: ప్రతి ఉద్యోగి తమ విధులపట్ల నిర్లక్ష్యం వహించకుండా అంకితభావంతో పనిచేస్తేనే తగిన గుర్తింపు వస్తుందని గద్వాల డిఎస్పీ బాలకోటి అన్నారు. మంగళవారం గిరిజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భారతదేశంలో పోలీస్ శాఖలో ఇచ్చే అత్యుత్తమమైన ఇండియన్ పోలీస్ మెడల్ గద్వాల డిఎస్పీ బాలకోటికి వచ్చిన సందర్భంగా గిరిజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మోతీరాంనాయక్, ప్రధాన కార్యదర్శి హాతీరాంనాయక్, గౌరవ అధ్యక్షులు రాంజీనాయక్, నేతలు సీతారాంనాయక్, కృష్ణానాయక్, మన్యానాయక్, డాక్టర్ రమేష్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఒక్కో విద్యార్థికి రూ.42 వేల ఖర్చుతో విద్యను అందిస్తున్నాం
* గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర కమిషనర్ లక్ష్మణ్‌నాయక్
వెల్దండ, జూన్ 27: ఒక్కో విద్యార్థికి రూ.42 వేల రూపాయల ఖర్చు చేసి విధ్యను అందించడం జరుగుతుందని గిరిజన సంక్షేమ రాష్ట్ర కమిషనర్ లక్ష్మణ్‌నాయక్ తెలిపారు. మంగళవారం వెల్దండ మండలం గుండాల,కవానిపల్లి రెవెన్యూ శివారులో నూతనంగా మంజూరైన ఎకలవ్య మాడల్ రెసిడెన్సియల్ పాఠశాల భవన నిర్మాణానికి అవసరమగు స్థలాన్ని కమీషనర్ లక్ష్మన్‌నాయక్ పరీశీలించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఎకలవ్య మాడల్ రెసిడెన్సియల్ పాఠశాలను వెల్దండ మండలానికి మంజూరి చేసిందన్నారు. ఇట్టి పాఠశాల నిర్మాణానికి ఏడు ఎకరాల భూమిని స్థానికులు కల్పిస్తే తక్షణమే భవన నిర్మాణ పనులను ప్రారంభిస్తామన్నారు. ఇందుకు గాను రూ. 12 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందని . ఒక్కోక్క విద్యార్ధికి ఎడాదికి రూ.42వేల రూపాయలను ఖర్చు చేయనుందని తెలిపారు. ఒక్కొక్క తరగతిలో రెండేసి సెక్షన్‌లు ఉంటాయని అందులో 40 మందితో 80మంది ఉంటారన్నారు.యేటేటా తరగతి పెరుగుతూ ఉంటుందని. ముందుగా 5,6 తరగతులను ప్రారంభిస్తామని చెప్పారు. అయన వెంట మాజీ వైస్ ఎంపిపి భూపతిరెడ్డి, నాయకులు గోపాల్‌రెడ్డి, భీమయ్యగౌడ్, ఎటిడబ్ల్యూ నర్సింహ్మరెడ్డి తదితరులు ఉన్నారు.