మహబూబ్‌నగర్

రెపరెపలాడిన త్రివర్ణ జెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, ఆగస్టు 15: దేశ 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను మంగళవారం పట్టణం, మండలంలోని అన్ని గ్రామాల్లోనూ అత్యంత వైభవంగా ప్రజ లు జరుపుకున్నారు. స్థానిక పోలీస్ పరే డ్‌గ్రౌండ్‌లో వేడుకలు నిర్వహించారు. దీనిలో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ప్రభాతభేరీ నిర్వహించారు. పలువురు విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణతో ఆకట్టుకున్నారు. గాంధీ పార్కు వద్ద నగర పంచాయతీ చైర్మన్ వంగ మోహన్‌గౌడ్ జాతీయ జెండాను ఎగరవేయగా నగరపంచాయతీ కమిషనర్ జయంత్‌రెడ్డి, నగరపంచాయతీ కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. స్థానిక కలెక్టరేట్ భవన సముదాయం ముందు జెసి సురేందర్ కరణ్, ఎస్పీ కార్యాలయం, జిల్లాసాయుధ పోలీస్ దళ కార్యాలయం ముం దు ఎస్పీ కల్మేశ్వర్ సింగెనవర్ జాతీయ జెండాను ఎగరవేశారు. అదేవిధంగా స్ధానిక సీనియర్ సివిల్ కోర్టు సముదాయం ముందు సినియర్ సివిల్ జడ్జీ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో కార్యాలయం ముం దు శ్రీనివాస్, నగరపంచాయతీ కార్యాలయం ముందు చైర్మన్ మోహన్‌గౌడ్, తహశీల్ కార్యాలయం ముందు శ్రీనివాససూరి, జిల్లా ఆస్పత్రి ముందు సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్‌తోపాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల ముందు ఆయా శాఖల అధికారులు జాతీయ జెండాను ఎగరవేశారు. పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలలు, వివిధ సంస్థలు తదితర చోట్ల ఆయా సంస్థల అధిపతులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం వద్ద టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు జక్కా రఘునందన్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం స్థలం ఆవరణలో జడ్పీటిసి మణెమ్మ, బిజెపి కార్యాలయం ముందు జాతీయ జెండాను ఎగరవేశారు. మం డల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపిపి బండి శాంతమ్మ, సింగిల్ విండో కార్యాలయం వద్ద అధ్యక్షులు బి.వెంకట్రాములు, జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల వద్ద జిహెచ్‌ఎం రమేష్, తదితరులు ఆయా కార్యాలయాల వద్ద జాతీయ జెండాను ఎగరవేయగా, ఆయా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల వద్ద అధిపతులు మువ్వనె్నల జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలో నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. అదేవిధంగా విద్యార్థులకు, జెండావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వారికి మిఠాయిలను పంపిణీ చేశారు.
పాన్‌గల్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం మండలంలోని వివిధ గ్రామాలలో జాతీయ జెండా రెపరెపలాడింది. తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ చక్రపాణి, ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపిపి వెంకటేష్ నాయుడు, పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ సునీల్ కుమార్, పిహెచ్‌సిలో సిహెచ్ ఓ భాస్కర్, సింగిల్‌విండో కార్యాలయంలో ఛైర్మన్ బాల్‌రెడ్డి, మహిళ సమాఖ్యలో సంఘం అధ్యక్షురాలు బాలమ్మ, గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి ఎక్బాల్, పశువైద్యశాలలో వెటర్నరీ డాక్టర్ శ్యామ్, ఎంఆర్‌సిలో ఎంఇఓ లక్ష్మణ్‌నాయక్, గ్రామ పంచాయతిలో సర్పంచు సురేఖ రాముయాదవ్, జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ ప్రకాష్, ఎస్‌బిఐలో మేనేజర్ శ్రీనివాసులు, టిఆర్‌ఎస్ కార్యాలయంలో మంత్రి జూపల్లి తనయుడు జూపల్లి అరుణ్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ జడ్పిటిసి, ఉమ్మడి జిల్లాల ప్రధాన కార్యదర్శులు రాంమూర్తి నాయుడు, సోమ్‌నాథ్ నాయక్‌జాతీయ జెండాలను ఎగరవేశారు. కార్యక్రమంలో జడ్పిటిసి రవికుమార్, విండో వైస్‌చైర్మన్ భాస్కర్‌యాదవ్, కో-ఆప్షన్ యూనుస్‌ఖాన్, నేతలు తిరుపతయ్య, ఎంపిడిఓ ఆంజనేయులు, వీరసాగర్, రాజునాయక్, ఠాగూర్‌నాయక్, గోపాలకృష్ణ, యాదగిరి, గోపాల్‌రావు, డిసిసి సహాయ కార్యదర్శి రఘుపతినాయుడు, ఈశ్వర్‌లాల్, రాము యాదవ్, గాల్‌రెడ్డి, రాంచందర్, ఉప సర్పంచ్ మాసుంబాబా, బండి సరోజ, యూత్ కాంగ్రెస్ నేతలు రవీందర్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు: స్వాతంత్య్ర ఫలాలు ప్రతి ఒక్కరికి దక్కినప్పుడే స్వార్థకత చేరుకూరుతుందని ఎంపిపి శ్రీ్ధర్‌గౌడ్, మా ర్కెట్ కమిటీ ఛైర్మన్ రాజేందర్‌సింగ్, సింగిల్‌విండో అధ్యక్షులు కృష్ణమూర్తి, త దితరులు వెల్లడించారు. 71వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఆత్మకూరు పట్టణంలోని వివిధ కార్యాలయాల వద్ద జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. తెల్లవారుజాము నుండే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు ప్రభాతభేరీ నిర్వహిస్తూ జాతీయ నాయకులకు జేజేలు పలికారు. తహశీల్దార్ కార్యాలయంలో మోహన్, సిఐ కార్యాలయంలో బండారి శంకర్, పంచాయతీ కార్యాలయంలో సర్పంచు గంగాధర్‌గౌడ్, తదితరులు, జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.
కొత్తకోట: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను మంగళవారం కొత్తకోట, మదనాపురం మండలాల్లో ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని సిఐ కార్యాలయం లో సిఐ సోమ్ నారాయణసింగ్, పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ రవికాంత్‌రావు, ఎక్సైజ్ కార్యాలయంలో ఎక్సైజ్ సిఐ ఓంకార్, పిహెచ్‌సిలో డాక్టర్ సౌజన్య, తహశీల్ధార్ కార్యాలయంలో తహశీల్దార్ రాజేందర్‌గౌడ్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి గుంత వౌనిక, గ్రామ పంచాయతి, గ్రంథాలయం, చౌరస్తాలో సర్పం చు చెన్నకేశవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జడ్పిటిసి పి.జె బాబులు జాతీ య జెండాలను ఆవిష్కరించారు. అలాగే యువకులు చౌరస్తాలో మానవహరంగా ఏర్పడి తివర్ణ పతకాన్ని పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. వివిధ ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాలు, పాఠశాలల్లో తివర్ణ పతకాన్ని ఎగరవేశారు. మదనాపురం మండలంలోని తహశీల్ధార్ కార్యాలయం లో సింధూజ, పోలీస్‌స్టేషన్‌లో అబ్దుల్ జబ్బార్ జెండాలను ఎగరవేశారు. కార్యక్రమంలో సిడిసి చైర్మన్ జగన్, ఎంపిటిసిలు బాబురెడ్డి, కృష్ణయ్య, వెంకట్ నారాయణ, సంజీవుడు, నాగన్నసాగర్, నాయకులు భీంరెడ్డి, కొండారెడ్డి పాల్గొన్నారు.
నారాయణపేటటౌన్: నారాయణపేట డివిజన్ వ్యాప్తంగా 71వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఉదయమే పట్టణ పురవీధుల గుండా ప్రభాత్‌పేరి, శోభయాత్ర నిర్వహించి దేశభక్తులను మననం చేసుకుంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ కృష్ణాదిత్య, మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్ గందె అనసూయ, ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపిపి మణె మ్మ, మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బండి వేణుగోపాల్, పిఎసిఎస్ కార్యాలయంలో పిఎసిఎస్ అధ్యక్షులు సత్యనారాయణయాదవ్, సూర్యలక్ష్మీ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ రజిత సింహారెడ్డి, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు కోట్ల రాజవర్దన్‌రెడ్డి, బిజెపి కార్యాలయంలో బిజెపి అధ్యక్షుడు బోయ లక్ష్మణ్, టిడిపి కార్యాలయంలో అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వామన్‌గారి కృష్ణ, డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సిఐ కార్యాలయంలో సిఐ చంద్రశేఖర్‌రెడ్డి, పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై మధుసూదన్‌గౌడ్, ఎక్సైజ్ కార్యాలయంలో సిఐ రమణయ్య, సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో ఎస్‌ఆర్‌ఓ సూరజ్‌సింగ్, ఆటో యూనియన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు రఘువీర్‌యాదవ్ త దితరులు పతాకాలను ఆవిష్కరించారు.
ఖిల్లాగణపురం: మండల కేంద్రంతో పాటు ఆయాగ్రామాల్లో 71వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని తహశీల్ధార్ కార్యాలయంలో తహశీల్ధార్ హరిలాల్, ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపిడిఓ రెడ్డ య్య, ఎంఆర్‌సి కార్యాలయంలో ఎంఇఓ ఉషారాణిలు తివర్ణ పతకాన్ని ఎగరవేశారు. ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల్లో తివర్ణ పతకాలను ఎగరవేశారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపిపి కృష్ణనాయక్, జడ్పిటిసి రమేష్‌గౌడ్, ఎంపిటిసి గోపాల్, సర్పంచు సామ్యానాయక్, ఉ పాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
చిన్నచింతకుంట: 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం మండలంలోని వివిధ గ్రామాల్లో మువ్వెనె్నల జెండా రెపరెపలాడింది. మండల కేంద్రంలోని మండల పరిషత్‌లో ఎంపిపి క్రాంతి, తహశీల్ధార్ కార్యాలయంలో తహశీల్ధార్ కిషన్‌నాయక్, పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ సతీష్, పిహెచ్‌సిలో డాక్టర్ సంధ్యరాణి, ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం రామలింగం, వ్యవసాయ కార్యాలయంలో ఎఓ రామకృష్ణ, గ్రామ సచివాలయంలో సర్పంచు మానస, ఎస్సీ, బిసి సంక్షేమ హాస్టల్‌లో యాద య్య, అశోక్‌గౌడ్, అంగన్‌వాడీ కేంద్రాల్లో మువ్వెనె్నల జెండాను ఎగరవేశారు.
వనపర్తి: వనపర్తి జిల్లాలో 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ శే్వతామహంతి, ఎస్పీ కార్యాలయం వద్ద జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే డాక్టర్ జి.చిన్నారెడ్డి, అలాగే టిడిపి, బిజెపి కార్యాలయాల వద్ద ఆ పార్టీ అధ్యక్షులు, వివిధ ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాల వద్ద అధికారులు, ఆ సంస్థల ప్రతినిధులు తివర్ణ పతకాన్ని ఎగరవేసి స్వాతంత్య్ర దినోత్స వేడుకలను జరుపుకున్నారు. వివిధ పాఠశాలలు, కళాశాలల వద్ద జాతీయ జెండాను ఎగరవేసి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనం గా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్వీట్ల పంపిణీతో పాటు సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు.
నర్వ: మండల పరిధిలోని నర్వ, లంకాల, పెద్దకడమూరు, పాతర్‌చేడ్, ఉందెకోడ్, కల్వాల, యాంకి తదితర గ్రామాల్లో మంగళవారం 71వ స్వాతం త్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులచే పూరవీధుల గుండా ఉరేగింపు నిర్వహిస్తూ ప్రభుత్వ కార్యాలయాల వద్ద జెండాలను ఎగరవేశారు. ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపిడిఓ రాఘవ, తహశీల్దార్ కార్యాలయం లో తహశీల్ధార్ జయసుధ, పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ శివకుమార్, సింగిల్‌విండో కార్యాలయంలో ఛైర్మన్ చుక్క లింగారె డ్డి, పిహెచ్‌సిలో వైద్యాధికారి సిద్ధప్ప జెండాలను ఎగరవేశారు. లంకాలలోని పాఠశాల వద్ద హెచ్‌ఎం శివశంకర్, గ్రామ పంచాయతీలో సర్పంచ్ చిన్నయ్య జెం డాలను ఎగరవేశారు. అనంతరం పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ గ్రామ యువత భాస్కర్‌రెడ్డి రూ. 40వేల నగదుతో నీటి శుద్ధి ట్యాంకును పాఠశాలకు వితరణ చేశారు. యువజన సంఘం ఆధ్వర్యంలో 25వేల నోట్ పుస్తకాలను విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. గ్రామస్తులు పాఠశాల అభివృద్ధి కోసం రూ.70వేల విలువగల సామాగ్రిని వితరణ చేశారు. కార్యక్రమంలో సర్పంచులు, ఎంపిటిసిలు, యువజన సంఘం నాయకులు చెన్నప్ప, శ్రీకాంత్‌రెడ్డి, జనార్ధన్, రవి, పాండు, శ్రీ్ధర్‌శెట్టి, తదితరులు పాల్గొన్నారు.
మక్తల్: నియోజకవర్గ కేంద్రంలోని మక్తల్ పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాలలో, వాడ వాడలలో 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఎంతో కనులపండుగగా జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రజాసంఘాలు, వివిధ యువజన సంఘాల ఆధ్వర్యంలో మువ్వనె్నల జెండాను ఎగురవేస్తూ పండుగ విశేషాన్ని చాటుకున్నారు. ఆయా పాఠాశాలల విద్యార్థులు వేకువజామున పట్టణంలోని పురవీధుల గుండా ప్రభాతభేరిలో జాతి నేతలు, తెలంగాణ ఉద్యమ పితామహులను తలుచుని నినదిస్తూ ర్యాలీలు నిర్వహించారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ ఓంప్రకాష్ మువ్వనె్నల జెండాను ఎగుర వేశారు. స్థానిక మార్కెట్ యార్డులో మార్కెట్ చైర్మన్ పి.నర్సింహగౌడ్, స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎస్సై వెంకటేశ్వర్లు, ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపిపి కోళ్ల పద్మమ్మ, ఎమ్మార్సీ కార్యాలయంలో ఎంఇఓ లక్ష్మినారాయణ, గ్రామపంచాయతీ కార్యాలరయంలో సర్పంచ్ భాగ్యమ్మ ఐబి కార్యాలయంలో డిప్యూటి ఇఇ విజయనందన్, మువనె్నల జెండాను ఎగురవేశారు. జడ్పి బాలుర ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం అనీల్‌గౌడ్‌తోపాటు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం చంద్రకాంత్, జడ్పి బాలికల ఉన్నత పాఠశాలలో వెంకటవరలక్ష్మీ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ భాస్కర్‌రెడ్డిలు మువ్వనె్నల జెండాను ఎగుర వేశారు. అలాగే నూతనంగా వెలసిన స్కాలర్స్ జూనియర్ కళాశాల, వివేకానంద, శ్రీసాయి చైతన్య జూనియర్ కళాశాలతో పాటు ఆదర్శ, రేడియంట్, అక్షర, దయానంద, ఎంపిఎస్, సిపిఎస్, జిపిఎస్, నలంద, కెరళా, క్రిష్ణవేణి, శాంతినికేతన్, లిటిల్‌ఏంజిల్స్, భారతీ విద్యానికేతన్, సాయిజ్యోతి, శిశుమందిర్, శ్రీగీతం, అభ్యాస పాఠశాలలో సంబంధిత ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను ఎగుర వేశారు. అలాగే వివిద కూడళ్లలో ఎబివిపి విద్యర్థులు, యువక సంఘాలు, విద్యార్థులు మువ్వనె్నల జెండాను ఎగురవేశారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు జరిగిన వందన స్వికరణ కార్యక్రమంలో చిన్నారు వివిధ దేశభక్తి నాయకుల వేషాదారణతో చేసిన మార్చుపాస్టు ఎంతో అలరించింది. ఇట్టి కార్యక్రమానికి ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థుల మార్చ్‌పాస్ట్ కార్యక్రమాన్ని తిలకించి ఆనందించారు. ఈకార్యక్రమంలో వివిద పార్టీలకు చెందిన నాయకులు జెడ్పీటిసి వాకిటి శ్రీహరి, మార్కెట్ చైర్మన్ నర్సింహగౌడ్, వైస్ ఎంపిపి సునిత గోపాల్‌రెడ్డి, కొండయ్య, సర్పంచ్ భాగ్యమ్మ, ఎంపిటిసి సభ్యులు రవిశంకర్‌రెడ్డి, కావలి శ్రీహరి, మాజీ ఎంపిపి చంద్రకాంత్‌గౌడ్, చంద్రశేఖర్, కోళ్ల వెంకటేష్, గోపాల్‌రెడ్డి, పాఠశాలల ప్రిన్సిపాల్స్ రమేష్‌రావు, అంజయ్య ఆచారీ, మోహ్మద్‌అలీ, రాఘవేందర్, ఆంజనేయరెడ్డి, తదితరులు పా ల్గొన్నారు. సామూహిక వందన స్వీకారం తీసుకున్న వాటిలో వివిధ పాఠశాలల విద్యార్థుల నుంచి తహశీల్దార్ ఓంప్రకాష్ వందన స్వీకారం తీసుకున్నారు.
వెల్దండలో: భారత 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మంగళవారం మండలంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో జాతీ య నాయకులకు జేజేలు పలుకుతూ విద్యార్థులు ప్రభాత్ భేరి నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయం ముందు తహశీల్దార్ గునగంటి సైదులు. ఎంపిడిఓ ఆపీసు వద్ద ఎంపిపి రాజశేఖర్, సర్కిల్ అఫీస్ వద్ద సిఐ గిరికుమార్ కల్కొటా, పోలీస్‌స్టేషన్ వద్ద ఎస్సై ముత్యాల రామ్మూర్తి, గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ లక్ష్మి, వివిధ కార్యాలయాల వద్ద మంజుల, అమర్‌సింగ్, రాంగోపాల్, రామునాయక్, మోహన్‌రెడ్డి, నివేధిత, పరుశరాములు, లక్ష్మారెడ్డి, నాయుడు, యాఖూబ్, సంజీవ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, సు బ్బారెడ్డి, పుష్పలత, మంజుల, అంజ య్య, పార్టీల వద్ద ఈశ్వరయ్య, విజయ్‌కుమార్ రెడ్డి, రామకృష్ణ, కుమార్ తదితరులు త్రివర్ణ పతాకాలను ఎగుర వేశారు. ఎంపిడిఒ వెంకటేశ్వర్ రావు, వైస్ ఎంపిపి వెంకటయ్యగౌడ్, జంగయ్యయాదవ్, నాగులు నాయక్, జయప్రకాష్, పుట్ట రాంరెడ్డి, ఐజక్, భూపతిరెడ్డి, సూజాత, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
చారకొండ మండలంలో..
మండలంలో మంగళవారం స్వాతం త్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తహశీల్దార్ కార్యాలయం వద్ద తహశీల్దార్ నర్సయ్య, ఐకెపి అఫీస్ వద్ద ఎపిఎం నర్సయ్యగౌడ్, వ్యవసాయ అఫీస్ వద్ద అధికారి చిన్న హుస్సేన్, పం చాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ శిల్పా, పోలీస్ స్టేషన్‌వద్ద ఎఎస్సై బద్రీనాథ్, పాఠశాల వద్ద హెచ్‌ఎంలు సాం బయ్య, పద్మ జెండాలను ఎగుర వేశారు.
* ధన్వాడ, మరికల్ మండలాల్లో..
ధన్వాడ: ధన్వాడ, మరికల్ మండలాల్లో మంగళవారం ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉద యం 5.30 గంటలకే వివిధ పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులు ప్రభాత్‌భేరి ఊరేగింపు నిర్వహించారు. ఈ ప్రభాత్‌బేరీలో స్వాతంత్య్ర సమరయోదులను స్మరిస్తూ జాతీయ నాయకుల వేషాధారణతో విద్యార్థులు అందరిని ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా సిఐ కార్యాలయంలో జాతీయ జెండాను మరికల్ సిఐ సోమనాథం ఎగుర వేశారు. మరికల్ ఎస్సై కార్యాలయం వద్ద ఎస్సై జములప్ప, ధన్వాడ పోలీస్‌స్టేషన్ కార్యాలయం వద్ద ఎస్సై జానకిరాంరెడ్డి, ధన్వాడ ఎంపిపి కార్యాలయం వద్ద ఎంపిపి శశికళ, ధన్వాడ మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద ఇంన్‌చార్జి తహశీల్దార్ పార్థసారధి, మరికల్ మండల తహశీల్ధార్ కార్యాలయం వద్ద తహశీల్దార్ చంద్రశేఖర్, మరికల్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ జోగులక్ష్మీ రామస్వామి, ఎంఇఓ కార్యాలయం వద్ద మధుసూధన్, లక్ష్మీలు, మరికల్ యువక మండలి కార్యాలయం వద్ద అధ్యక్షులు పి.వెంకట్రామరెడ్డి, ధన్వాడ గ్రామపంచాయతి కార్యాలయం వద్ద సర్పంచ్ ఇందిరమ్మ, మరికల్ మండల పంచాయతీ డిప్యూటి కార్యాలయం వద్ద నరేంధర్, ధన్వాడ మండల గ్రాంథాలయం వద్ద గ్రంథపాలకుడు రాంమ్మోహన్, మరికల్ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల వద్ద ప్రిన్సిపాల్ రఫీ, ధన్వాడ మండల మాడల్‌స్కూల్ వద్ద ప్రిన్సిపాల్ ఉమాదేవి తదితరులు తమతమ కార్యాలయల వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు.
వీపనగండ్ల: 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మంగళవారం మండలంలోని వివిధ గ్రామాలలో ఘనంగా జరుపుకున్నారు. గ్రామ పంచాయతి కార్యాలయాల్లో, ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల్లో జాతీయ జెండాలను ఎగరవేశారు. పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్ గోపాల్‌రెడ్డి, తహశీల్ధార్ కార్యాలయంలో తహశీల్దార్ రమేష్‌రెడ్డి, ఎంపిడిఓ కార్యాలయం లో ఎంపిపి లావణ్య, వ్యవసాయ కార్యాలయంలో ఎఓ డాకేశ్వర్‌గౌడ్, మండల సమాఖ్యలో ఎపిఎం వెంకటేష్, పిహెచ్‌సిలో డాక్టర్ శ్రీనివాస్, గ్రామ పంచాయతిలో సర్పంచు ప్రహ్లాద్‌రెడ్డి, జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ నర్సింహులు, కస్తూర్భా పాఠశాలలో ప్రిన్సిపాల్ శైలజలు జాతీయ జెండాలను ఎగరవేసి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో జడ్పిటిసి లోకారెడ్డి, వైస్ ఎంపిపి సత్యనారాయణ, నాయకులు ఎత్తం బాలస్వామి, కృష్ణయ్య, రజాక్, రవిందర్‌రెడ్డి, గోపి, తదితరులు పాల్గొన్నారు.
కల్వకుర్తి: మండలంలోని వివిధ గ్రా మాలతో పాటు పట్టణ కేంద్రంలో ప్రభు త్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలలో 71వ స్వాతంత్య్ర వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్ చౌరస్తాలో గల రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద స్థానిక ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పట్టణ కేంద్రంలో పలు ప్రభుత్వ కార్యాలయాల జాతీయ జెండా అవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా అర్డీఓ కార్యాలయంలో అర్డీఓ రాజేష్‌కుమార్, డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ రమాకాంత్‌రావు, నగర పంచాయతీ కార్యాలయంలో నగర పంచాయతీ చైర్మన్ శ్రీ శైలం, ఎంపిడిఓ కార్యాలయంలో ఎం పిపి రామేశ్వరమ్మ, తహశీల్దార్ కార్యాలయంలో మంజుల, పోలీసు స్టేషన్‌లో ఎస్సై జలందర్‌రెడ్డి, వాసవి క్లబ్ భవనం వద్ద వాసవి క్లబ్ అధ్యక్షుడు గోపాల్, మహిళ సమాఖ్య భవనం వద్ద సమాఖ్య అధ్యక్షురాలు, పంచాయతీ రాజ్ కార్యాలయం వద్ద ఇఇ దుర్గప్రసాద్, పాలమూ రు చౌరస్తాలో టిఆర్‌ఎస్‌వి నాయకులు, ఐసిడిఎస్ కార్యాలయంలో ఐసిడిఎస్ అధికారి సుమలత, వాటర్ షెడ్ కార్యాలయం వద్ద గోవిందరాజన్, వ్యవసాయ కార్యాలయం వద్ద మండల వ్యవసాయాధికారి శ్రీలత, సింగిల్ విండో కార్యాలయం వద్ద సింగిల్ విండో ఉపాధ్యక్షులు జనార్థన్‌రెడ్డిలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, విద్యార్థి సంఘాల కార్యాలయాలలో జాతీయ పతకాన్ని ఎగురవేశారు. నగర పంచాయతీ కార్యాలయంలో జాతీయ పతాకవిష్కరణకు ఎమ్మెల్యే హాజరయ్యారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పద్మ, ఆనంద్‌కుమార్, రామరాజు, యాదగిరిచారి, నయిమ్, విజయ్, పార్వతీ, లక్ష్మీ, ఎల్లమ్మ, సీత్యానాయక్, జానకమ్మ, శ్రీకాంత్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.
ఊట్కూర్: మండలంలోని ఆయా గ్రా మాల పాఠశాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని మంగళవారం ఎగురవేసి 71వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై విజయ్‌కుమార్, ఎంఆర్‌సి కార్యాలయంలో ఎంఇఒ వెంకటయ్య, ప్రభుత్వ అసుపత్రిలో డాక్టర్ నరేష్‌చంద్ర, తెలంగాణ సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ప్రిన్సిపాల్ స్వరూపరాణి, ప్రాథమిక ఉన్నత పాఠశాలలో శివకుమార్, గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ భాస్కర్, తదితర కార్యాలయాల్లో జెండా ను ఎగురవేశారు. ఎంపిటిసిలు గోవిందప్ప, జయదేవు, రాధకృష్ణగౌడ్, ఆయా పార్టిల నాయకులు అరవింద్‌కుమార్, బాల్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, చందులాల్, వెంకటేష్, పోలప్ప, భరత్, రమేష్, నవీన్, గోపాల్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, నర్సింహ్మ, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, ఆయాశాఖల అధికారులు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
మాగనూర్: మాగనూర్, కృష్ణ మండలాల్లో మువ్వనె్నల జెండాలు మంగళ వారం రెపరెపలాడాయి. విద్యార్థుల కళానృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. తహశీల్దార్ కార్యాలయంలో వెంకటేశ్వర్‌గుప్త, కృష్ణ తహశీల్దార్ కార్యాలయంలో ఎతిరాజ్, తదితర ప్రభుత్వ కార్యాల యాల్లో జెండాలను ఎగురవేశారు.
దేవరకద్ర: దేవరకద్రలో 71వ స్వా తంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహశీల్దార్ కార్యాల యం ముందు తహశీల్దార్ చెన్నకిష్టయ్య, మండల పరిషత్ కార్యాలయం ముందు ఎంపిపి ఇవి గోపాల్, పోలీస్‌స్టేషన్ ముం దు ఎస్సై అశోక్‌కుమార్,ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ముందు వైద్యురాలు సరిత, అసుపత్రి ముందు వైద్యుడు జీసన్ అలీ, జెండాలను ఎగురవేశారు.