మహబూబ్‌నగర్

ఉత్తమ సేవలకు పురస్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 15: జిల్లాలో వివిధ శాఖలలో పని చేస్తున్న జిల్లా అధికారులతో పాటు సిబ్బంది చేసిన ఉత్తమ సేవలకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతిభ పురస్కారాలను అందజేశారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా తమ విధి నిర్వహణలో మంచి ప్రతిభ కనబరిచి సేవలు అందించిన ఉద్యోగులకు మంత్రి లక్ష్మారెడ్డి ప్రశంస పత్రాలు, ప్రతిభ పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తించిన నలుగురు ఉద్యోగులకు హైదరాబాద్‌లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా ప్రశంస పత్రాలను అందుకున్నారు. అందులో భాగంగా మిషన్ భగీరథ ఇఇ బి.శ్రీనివాస్, నారాయణపేట తహశీల్దార్ పార్థసారథి, గండిడ్ మండలం పరిధిలోని మహమ్మదాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న స్ట్ఫా నర్సు జయమ్మ, నారాయణపేట సబ్ కలెక్టర్ కార్యాలయంలో పని చేస్తున్న జూనియర్ అసిస్టెంట్ శ్రీశైలంకు రాష్ట్ర స్థాయి అవార్డు, రివార్డులు అందాయి. అదేవిధంగా జిల్లా స్థాయిలో వివిధ శాఖల జిల్లా అధికారులు వెంకటేశ్వర్లు, బుక్యా దెవ్‌సింగ్, శారదా ప్రియదర్శిని, సరోజనీదేవి, సోమిరెడ్డి, హరిచంద్రారెడ్డి, వెంకన్న, టివిఎల్ సత్యవాణి, ఆశోక్, సుచరిత, దుర్గయ్య, గోవిందరాజులకు మంత్రి లక్ష్మారెడ్డి జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవేడుకల్లో ప్రసంసా ప్రతాలను అందజేవారు.
జిల్లా పోలీసు శాఖలో ఉత్తమ సేవలు అందించిన డిటిసి సిఐ, రవిందర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ రూరల్ సిఐ రామకృష్ణ, పిసిఆర్ మహబూబ్‌నగర్ లక్ష్మయ్య, అడ్డాకుల ఎస్సై శ్రీనివాసులు, కోయిల్‌కొండ శ్రీకాంత్‌రెడ్డి, ఊట్కూర్ ఎస్సై విజయ్‌కుమార్, మక్తల్ ఎసై వెంకటేశ్వర్లు, డిఎస్‌బి ఎఎస్సై దేశ్యానాయక్, డిసిసి ఎఎస్సై కిష్ట్యానాయక్, డిసిఆర్‌బి హెడ్‌కానిస్టేబుల్ ఆంజనేయులు, మహబూబ్‌నగర్ రూరల్ సెడ్‌కానిస్టేబుల్ హర్పీజ్ నవాజ్, మద్దూర్ పిఎస్ కానిస్టేబుల్ బి.అంజిలప్ప, హన్వాడ పిఎస్ కానిస్టేబుల్ కేశవులుగౌడ్, మరికల్ పిఎస్ కానిస్టేబుల్ నరేందర్‌గౌడ్, నారాయణపేట పిఎస్ కానిస్టేబుల్ అబ్ధుల్, ఎఆర్‌హెచ్‌సి డిఎఆర్ రాజశేఖర్, ఎంఎ సలీం, ఎఆర్‌పిసి డిఎఆర్ ఇంతియాజ్‌హుస్సేన్, డిఎఆర్‌హచ్‌జి ఎండి సలీం, డిఎఆర్ మహిళా హెడ్‌కానిస్టేబుల్ యాదమ్మలకు ఉత్తమ ప్రశంస పత్రాలను, ప్రతిభ పురస్కారాలను మంత్రి లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్, ఎస్పీ రెమా రాజేశ్వరి, జడ్పి చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ శివకుమార్‌నాయుడులు అందజేశారు. అదేవిధంగా రెవెన్యూశాఖలో దాదాపు 17 మందికి ప్రశంస పత్రాలను అందజేశారు. అందులో భాగంగా కోస్గి మండల తహశీల్దార్ బాలచందర్, వెంకటేష్ గుప్తా(మాగనూర్), జ్యోతి( హన్వాడ), ఎన్.జ్యోతి (్భత్పూర్), ఎంవి.ప్రభాకర్‌రావు(మహబూబ్‌నగర్ అర్భన్), డి.ప్రేమ్‌రాజ్ కలెక్టరేట్ ఏఓ, వరప్రసా ద్ ఉప తహశీల్దార్ మక్తల్, ఆజామ్‌అలి ఉప తహశీల్దార్ నవాబుపేట,రవిందర్‌రెడ్డి గిర్ధవర్ మరికల్ తహశీల్దార్ కార్యాలయం, శ్రీనివాసులు జడ్చర్ల, రెహమాన్ కలెక్టరేట్ కార్యాయలం, యాదర్‌అలి కలెక్టరేట్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్, అంజయ్య జూనియర్ అసిస్టెంట్ తహశీల్దార్ ఆఫీస్ మహబూబ్‌నగర్, విఆర్‌ఓలు రవిశంకర్(కలెక్టరేట్), సత్యం ( నవాబుపేట) బాల్‌రాజ్ (మక్తల్) జ్ఞానేశ్వర్‌రెడ్డి(జడ్చర్ల)లు ప్రసంసా పత్రాలను అందుకున్నారు. అంతేకాకుండా కలెక్టర్ అండ్ జెసి క్యాంప్ ఆపీస్ సిబ్బంది అయినా డిప్యూటి తహశీల్దార్ వెంకట్రామిరెడ్డి, హబిబూద్దిన్(జెమ్మెదార్) శ్రీనివాస్‌గౌడ్, రామ్‌గొపాల్(గన్‌మెన్) శ్రీనివాస్‌జ్యోషి(డిప్యూటి తహశీల్ధార్)లకు ప్రశంస పత్రాలను అందజేశారు. జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లో పనిచేస్తున్న వారిలో ముగ్గురు ఎంపిడిఓల అందించిన సేవలకు సైతం ప్రతిభ పురస్కారాలు అందాయి. అందులో నర్సింగరావు(అడ్డాకుల) జి.మున్ని(జడ్చర్ల) పి.రాఘవ(నర్వ)లు ప్రశంస పత్రాలను మంత్రి చేతుల మీదుగా అందుకున్నారు. కాగా వివిధ శాఖలలో పని చేస్తున్న మరో 72 మంది ఉద్యోగులకు సైతం మంత్రి లక్ష్మారెడ్డి ప్రతిభ పురస్కారాలతో పాటు ప్రశంస పత్రాలను అందజేశారు. కాగా తాము చేసిన పనికి గుర్తింపుగా స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రతిభ పురస్కారాలు, అవార్డులు, ప్రశంస పత్రాలు అందుకున్న వివిధ శాఖల అధికారులు వాటిని తీసుకుని సంబురపడ్డారు. ప్రశంసా పత్రాలను అందుకున్న అధికారులను స్వాతంత్య్ర వేడుకలకు వచ్చిన వారంత వారికి అభినందనలు తెలిపారు.